Tamil producer-director commits suicide ప్రముఖ దర్శక నిర్మాత బలవన్మరణం..

Harassed by financier film producer director ashok kumar ends life

ashok kumar, vishal, ashok kumar death, ashok kumar suicide, ashok kumar news, vishal, producer association, tamil film producer death, N Anbuchezhian, Sasikumar, Southside, Tamil film inustry, Kollywood

Tamil filmmaker Ashok Kumar killed himself at his residence in Chennai. He has left a suicide note, in which he has blamed an influential financier for pushing him to take this extreme step.

ప్రముఖ దర్శక నిర్మాత బలవన్మరణం..

Posted: 11/22/2017 11:19 AM IST
Harassed by financier film producer director ashok kumar ends life

అందమైన లోకమని..రంగు రంగులుంటాయని.. ఒక్క చాన్స్ దొరికితే జీవితం మారిపోతుందని భావించి ఎన్నో అశలతో, కోరకిలతో అడుగుపెట్టే వారు.. ఏళ్లు గడుస్తున్న బ్రేక్ లభించక కొందరు.. బ్రేక్ లభించినా.. అనుకున్న స్థాయిలో లాభాలు అందక.. పెట్టిన పెట్టబడులను వెనక్కి అడిగే వారు మరోవైపు ఇలా అన్నింటి మధ్య జీవితంపై అశలు కొల్పోయి.. నిండూ నూరేళ్లు బతకాల్సిన జీవితాలను అర్థాయుషులోనే బలవంతంగా పలువురు తీసుకుంటున్నారు. గత వారం బెంగాల్ దర్శక నిర్మాత ఆత్మహత్య తరువాత తాజాగా కాలీవుడ్ దర్శక నిర్మాత అశోక్ కుమార్ కూడా అత్మహత్యకు పాల్పడ్డారు.

చెన్నైలోని అళ్వార్‌ తిరునగర్ లోని తన నివాసంలో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులకు లోనైన అశోక్ కుమార్ బలవన్మరణానికి పాల్పడ్డారు. అయితే ఆయన దర్శక నిర్మాణంలో రూపోందుతున్న చిత్రాలకు పెట్టుబడులు పెట్టిన ఫైనాన్సియర్లు వారి డబ్బును తిరిగి చెల్లించాలని తీవ్ర వత్తిడి తీసుకురావడంతో.. గత్యంతరం లేని ఆయన బలవంతంగా ఆత్మహత్యకు పాల్పడ్డారని సమాచారం. ప్రముఖ నటుడు, దర్శకుడు, నిర్మాత శశికుమార్ కు.. అశోక్ కుమార్ బంధువు.

శశికుమార్ నిర్మాణంలో తెరకెక్కిన ఇసన్, పొరలి సినిమాలకు సహ నిర్మాతగా కూడా వ్యవహరించారు. వీరి నిర్మాణంలో తెరకెక్కిన కోడి వీరం రిలీజ్ సిద్ధంగా ఉంది. మరోవైపు అశోక్ కుమార్ మృతి పట్ల పలువురు తమిళ సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఈ విషయంపై స్పందించిన హీరో సిద్ధార్థ్ ' ఫైనాన్సియర్ ఒత్తిడి కారణంగా ఓ యువ కళాకారుడు మరణించటం బాధ కలిగించింది.

తమిళ సినీరంగంలో ఇలాంటివి చాలా ఉన్నాయి. కానీ ప్రపంచం కేవలం పేరు, సక్సెస్ లను మాత్రమే గుర్తిస్తుంది. మొత్తం వ్యవస్థనే మార్చాల్సిన సమయం వచ్చింది. రైతైనా, దర్శకుడైనా ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి రావటం దారుణం'. అంటూ ట్వీట్ చేశారు. తమిళనాడు నిర్మాతల కౌన్సిల్ అధ్యక్షుడు, నటుడు విశాల్ అశోక్ కుమార్ ఆత్మహత్యపై స్పందించారు. అశోక్ కుమార్ ది అత్మహత్య అనేకంటే ఇది ఫైనాన్సియర్ల హత్యగా భావించాలని సూచించారు. కాలీవుడ్ పరిశ్రమలో నిర్మాతలందనూ ఏకమై ఫైనాన్సియర్లకు వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన అవసరముందని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ashok Kumar  Kollywood  N Anbuchezhian  Sasikumar  Southside  Tamil film inustry  

Other Articles