Now RSS gives Jay Shah a clean chit జైషా అవినీతిపై అరెస్సెస్ సన్నాయి నోక్కులు..

Probe jay shah only if prima facie charges true rss

Dattatreya Hosabale, RSS general secretary, Jay Shah, Yashwant Sinha, Amit Shah, Amit shah Jay Shah, jay shah corruption, jay shah company, The Wire, RSS, corruption, PM Modi, latest news

The cyber crime cell of the Bengaluru Police has begun a hunt for a man who allegedly installed a camera in his tenant's bedroom and uploaded videos on porn websites.

జైషా అవినీతిపై అరెస్సెస్ సన్నాయి నొక్కులు..

Posted: 10/12/2017 02:51 PM IST
Probe jay shah only if prima facie charges true rss

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా కొడుకు జయ్‌ షాపై అవినీతి ఆరోపణలు రావడం.. వాటిని కేంద్రమంత్రి పియూష్ గోయల్ ఖండించడం.. అరోపణలను ప్రచురిచిన వెబ్ పోర్టల్ పై రూ.100 కోట్ల రూపాయల మేర పరువునష్టం దావా వేసి.. దానిని వాదించేందుకు ఏకంగా ప్రభత్వ సాలిసిటరీ జనరల్ కు అప్పగించడం అంతా చూస్తుంటే.. ఇదంతా పెద్ద అవినీతి పక్కా ప్లాన్ ప్రకారం జరిగిందన్న అనుమానాలు పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి యశ్వంత్ సిన్హా వ్యక్తం చేసిన నేపథ్యంలో అర్ఎస్ఎస్ కూడా దీనిపై స్పందించింది.

అవినీతి అరోపణలు వస్తే వాటిపై దర్యాప్తు చేయాల్సిందేనన్న సంఘ్.. ఈ ఆరోపణలు చేసిన వ్యక్తులు, అందుకు సంబంధించిన అధారాలు కూడా పరిశీలించిన తరువాతే దర్యాప్తుకు అదేశించాలని సన్నాయి నోక్కులు నొక్కింది. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే జయ్‌ షా ఆస్తులు అనూహ్యంగా పెరిగిపోయాయంటూ కథనాలు రావడం.. దీనిపై సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేయడంతో తన వైఖరిని స్పష్టం చేసిన ఆరెస్సెస్‌.. అవినీతి ఆరోపణలు ఎవరిపైన వచ్చినా దర్యాప్తు చేయాల్సిందేనంటూనే.. ప్రాథమిక ఆధారాలు ఉండాలని నర్మగర్భవ్యాఖ్యలు చేసింది.

భోపాల్‌లో జరుగుతున్న ఆరెస్సెస్‌ సదస్సులో పాల్గొన్న సంస్థ సంయుక్త ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబాలే  ఇవాళ మీడియాతో మాట్లాడారు. 'ఎవరిపైనా అవినీతి ఆరోపణలు వచ్చినా దర్యాప్తు జరిపి తీరాల్సిందే. అయితే, అక్రమాలు జరిగినట్టు ప్రాథమికంగా ఆధారాలు ఉండాలి' అని ఆయన అన్నారు. జూనియర్‌ షాపై కేసు నమోదుచేసే అవకాశముందా? అన్న విలేకరుల ప్రశ్నకు.. 'అది ఆరోపణలు చేసినవారిపై ఆధారపడి ఉంటుంది. ఆరోపణలను రుజువు చేసే బాధ్యత వారిదే' అని ఆయన పేర్కొన్నారు.

2014లో బీజేపీ అధికారంలోకి రావడంతోనే జయ్‌ షాకు చెందిన రెండు కంపెనీల టర్నోవర్‌ అమాంతం పెరిగిపోయిందని, అంతేకాకుండా పలు ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల నుంచి ఆయన కంపెనీలకు భారీ రుణాలు అందాయని 'దవైర్‌.ఇన్‌’ వెబ్‌సైట్‌  ఓ కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే. దీంతో రంగంలోకి దిగని ప్రతిపక్షాలు ఈ అంశంపై దర్యాప్తు జరిపాలని డిమాండ్ చేస్తున్నాయి. అవినీతి అరోపణలు విపక్షాలపై వస్తే ఒకలా. స్వపక్ష నేతలపై వస్తే మరోలా స్పందిస్తున్న తీరును ఎండగట్టాయి. సీబిఐ చేత విచారణ జరిపించి.. ప్రధాని నిజమైన అవినీతి వ్యతిరేకవాదని నిరూపించుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dattatreya Hosabale  RSS  Jay Shah  Yashwant Sinha  Amit Shah  corruption  PM Modi  

Other Articles