son uploaded tenants intimate videos on porn sites అద్దెకు దిగితే.. ఏకాంత వీడియోలు తీసి నెట్లో పెట్టాడు

Man installs camera in tenant s bedroom uploads videos on porn sites

Porn websites, obscene videos, hidden camera, tenants videos, anjan, Sri Rama Layout, KR Puram, cyber crime cell, Bengaluru police, crime, latest news

The cyber crime cell of the Bengaluru Police has begun a hunt for a man who allegedly installed a camera in his tenant's bedroom and uploaded videos on porn websites.

పాడు సైట్లో అద్దింటి దంపతుల ఏకాంత వీడియోలు..

Posted: 10/12/2017 01:34 PM IST
Man installs camera in tenant s bedroom uploads videos on porn sites

సునాయాసంగా డబ్బులు సంపాదించాలనుకునే దుర్మార్గలు అడ్డదార్లలో అందివచ్చిన సాంకేతిక విప్లవం కూడా చేరిపోయింది. అసిస్టెంట్ ఫ్రోఫెసర్ గా ఉద్యోగం రావడంతో సదరు ప్రైవేటు కాలేజీకి చేరువలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్న ప్రోఫెసర్ దంపతులకు ఓ రోజు వారు ఇంట్లో వుండగా, ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి వచ్చిన ఇంటర్ నెట్ కాల్.. వారిని తీవ్ర దిగ్ర్భాంతికి గురిచేసింది. వారు ఏకంతంగా గడిపిన దృశ్యాల తాలూకు వీడియోలు ఓ పోర్న్ వైబ్ సైట్ లో దర్శనమిచ్చాయన్నది ఫోన్ కాల్ సారాంశం. దీంతో విస్తుబోయిన వారు పోలీసులను ఆశ్రయించారు.

వివరాల్లోకి వెళ్తే... కర్ణాటకకు చెందిన దంపతులకు బెంగళూరులోని కోరమంగళలో పరిధిలోని అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఓ ప్రైవేటు కాలేజీలో ఉద్యోగం వచ్చింది. దీంతో అక్కడే స్థానికంగా వున్న కేఆర్ పురం పరిధిలో వున్న శ్రీరామా లేఅవుట్ లో ని ఒక అద్దె ఇంట్లో దంపతులు అద్దెకు దిగారు. తాజాగా ఓ అజ్ఞత వ్యక్తి వారికి ఇంటెర్ నెట్ నుంచి ఫోన్ చేసి, వారిద్దరి ఏకాంతంగా గడిపిన శృంగార దృశ్యాలు వెబ్‌ సైట్‌ లో చూశామని చెప్పాడు. అంతేకాదు ఆ వెబ్ సైట్ లింకు కూడా వారికి పోందుపర్చాడు. దీంతో దిగ్భ్రాంతికి గురైన ఆ దంపతులు పోలీస్ స్టేషన్ కు వెళ్లి సైబర్ క్రైం అధికారులకు ఫిర్యాదు చేశారు.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, ఈ దౌర్భాగ్యానికి ఒడిగట్టిన వ్యక్తిపై కేసు నమోదు చేసి.. దర్యాప్తును ప్రారంభించగా, తమ ఇంటి యజమాని కుమారుడు అంజన్ పై అసిస్టెంట్ ఫ్రోఫెసర్ అనుమానాన్ని వ్యక్తం చేసింది. తాము ఇంట్లో లేని సమయంలో డూప్లికేట్ తాళంతో ఇంటి తలపులు తెరచి సిసికెమెరాను అమర్చి.. ఈ దురాగతానికి పాల్పడ్డాడని అరోపించారు. తమ వీడియోలు సెప్టెంబర్ 29న అప్ లోడ్ చేసినట్లు తేదీని నిర్థారిస్తున్నాయని అమె భర్త అంజన్ పై అనుమానాలను మరింత బలం పోస్తూ.. పోలీసులకు చెప్పారు.

దీంతో ఈ దిశగా తమ దర్యాప్తును సాగించిన బెంగుళూరు సైబర్ క్రైం పోలీసులు.. అంజన్ కోసం వెతకసాగింది. అయితే తమ ఇంట్లో అద్దెకుంటున్నవారు బెంగళూరు సైబర్ క్రైం పోలీసులను అశ్రయించారని తెలుసుకున్న ఇంటి యజమాని కుమారుడు అంజన్ ఇళ్లు వదలి పారిపోయాడు. అంజన్ ను అదుపులోకి తీసుకుందామని వచ్చిన పోలీసులకు అతను ఇళ్లు వదలి పారిపోయాడని తెలసి అతని కోసం వేట ప్రారంభించారు. దీంతో ప్రత్యేక టీమ్ తో అతని కోసం గాలింపు చేపట్టారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Porn websites  obscene videos  hidden cam  tenants videos  cyber crime cell  Bengaluru police  crime  

Other Articles

 • Missing inter student sai prajwala safe in uppal

  సాయి ఇంట్లో ప్రజ్వలించిన దీపావళి.. ఉప్పల్ లోనే ఇంటర్ బాలిక

  Oct 20 | మెడికల్ ఎంట్రెస్ కోసం నీట్ పరీక్షల శిక్షణ పోందుతున్న విద్యార్థిని సాయి ప్రజ్వల ఇంట్లో ఈ దీపావళి నిజంగానే కొత్త శోభతో ప్రజ్వలించింది. నారాయణ కాలేజీలో విద్యార్థులపై సాగుతన్న మానసిక వేదన భరించలేక.. ఆ... Read more

 • Man thrashed forced to spit lick saliva as punishment

  అమానవీయం: ఇది మనుషుల చేసే పనియేనా..?

  Oct 20 | బీహార్ లో మరోమారు అటవిక న్యాయం యావత్ దేశ ప్రజలను విస్మయానికి గురిచేసింది. మనిషన్నవాడు ఎవరూ చేయని తరహాలో అక్కడ ఓ నాయి బ్రహ్మణుడికి శిక్షన విధించిన వైనం సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసింది.... Read more

 • Gambling at marriott taskforces raids hotel 40 businessmen held

  మారియట్ లో మకాం వేసి.. ప్రముఖుల పాడు పని..

  Oct 20 | దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రజలందరూ.. లక్ష్మీ పూజ చేసుకుని.. ఇంట్లోని వారందిరితో కలసి స్వీట్లు పంచుకుని టపాసులు పేలుస్తుంటే.. నగరంలోని ప్రముఖుల మాత్రం తమ కార్యకలాపాలను పక్కనబెట్టి భారీస్థాయిలో జూదానికి తెరతీశారు. వినడానికి విచిత్రంగా... Read more

 • Police investigating alleged terror plot to kill cm

  సీఎం హత్యకు కుట్ర.. అకతాయి పనా..? లేక నిజమా..?

  Oct 18 | పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్‌ అధినేత్రి మమతా బెనర్జీని హత్యకు నిజంగానే ఉగ్రవాద మూకలు పథక రచన చేస్తున్నాయా.? అసలు అమెనే తమ టార్గెట్ గా ఎంచుకునేందుకు కారణమేంటి. అమెపై ఉగ్రవాదులు గురి ఎందుకు... Read more

 • Revanth reddy slams andhra pradesh tdp leaders

  ఏపీ టీడీపీ నేతలపై రేవంత్ ఫైర్.. కాంగ్రెస్ తో కలిసే..

  Oct 18 | టీడీపీ పార్టీ కోసం తాను తుది వరకు పోరాడతానని చెప్పిన తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి.. తెలంగాణలో టీడీపీ పార్టీయే కనుమరుగు అవుతున్నా ఇంకా అందులోనే కోనసాగుతూ.. తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం... Read more

Today on Telugu Wishesh