Gujarat, Himachal Pradesh Elections Schedule Released | రెండు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. తక్షణమే కోడ్ అమలులోకి వస్తుందన్న ఈసీ

Ec release two states elections schedule

Election Commission, Gujarat Elections, Himachal Pradesh Assembly Elections, Gujarat Himachal Pradesh Elections Details

Election Commission Announced Gujarat, Himachal Pradesh Poll Dates. Election dates and schedule Complete Details.

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్

Posted: 10/12/2017 04:19 PM IST
Ec release two states elections schedule

రెండు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ను స్వయంగా ప్రధానాధికారి చదివి వినిపించారు. వీవీపాట్ యాంత్రాల్లో స్క్రీన్‌ సైజు 5.6 సెం.మీ నుంచి 10 సెం.మీలు పెంచుతున్నామని, దీంతో ఓట‌ర్లు తేలిక‌గా వాటిని ఉప‌యోగించే వీలు ఉంటుంద‌ని చెప్పారు.

హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో త‌క్ష‌ణ‌మే ఎన్నిక‌ల నియామ‌వ‌ళి అమ‌లు చేస్తున్న‌ట్లు పేర్కొన్ఆన‌రు. అభ్య‌ర్థుల గ‌రిష్ఠ ఎన్నిక‌ల వ్య‌యం రూ.28 ల‌క్ష‌లని చెప్పారు. హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో అసెంబ్లీ ఎన్నిక‌లకు ఈ నెల 16న నోటిఫికేషన్ విడుదల చేస్తామని, న‌వంబ‌ర్ 9న ఎన్నికలు జ‌రుగుతాయ‌ని, ఓట్ల కౌంటింగ్ డిసెంబ‌రు 28న ఉంటుంద‌ని తెలిపారు. జనవరి 7, 2018తో హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ముగుస్తున్న విషయం తెలిసిందే.అలాగే, డిసెంబరు 18న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయని పేర్కొన్నారు. గుజరాత్ ఎన్నికల కౌంటింగ్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల కౌంటింగ్ ఒకే రోజు ఉంటుందని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles