Retired Judge Arumugasamy to Probe Jayalalithaa's Death జయలలిత మృతిపై రిటైర్డు జడ్జీతో కమిటీ..

Retired madras hc judge arumugasamy to probe jayalalithaa s death

aiadmk, amma death, EK Palaniswami, Arumugasamy, J Jayalalithaa, Jaya Death, jaya death probe, Jayalalithaa, Jayalalithaa Death, O Panneerselvam, TTV Dinakaran, VK Sasikala, latest news

The Tamil Nadu government has appointed retired Madras High Court judge Justice A Arumugasamy to probe the death of former chief minister J Jayalalithaa.

జయలలిత మృతిపై రిటైర్డు జడ్జీతో కమిటీ..

Posted: 09/25/2017 06:42 PM IST
Retired madras hc judge arumugasamy to probe jayalalithaa s death

తమిళనాడు స్వర్గీయ ముఖ్యమంత్రి, తమిళుల పురచ్చి తైలవిగా ఖ్యాతిగాంచిన జయలలిత అకాల మరణం విషయంలో అటు తమిళ ప్రజలతో పాటు ఇటు అన్నాడీఎంకే నేతలు కార్యకర్తలు కూడా అనేక అనుమానాలను వ్యక్తం చేసిన నేపథ్యంలో.. ఎట్టకేలకు రంగ ప్రవేశం చేసిన తమిళనాడులోని పళనిస్వామి ప్రభుత్వం మద్రాసు రిటైర్డు న్యాయమూర్తితో మిటీని వేసింది.

అమ్మ మరణం తరువాత శరవేగంగా మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో మూడుగా చీలిపోయిన అన్నాడీఎంకే పార్టీలోని రెండు వర్గాలు ఒక్కటి కానున్న తరుణంలో ఇరువర్గాల మధ్య అనేక చర్చలు, హామీలు ఇచ్చిపుచ్చుకున్నారు. అందులో అమ్మ మృతిపై జుడీషియల్ కమిటీని వేయాలన్న షరతుకు అంగీకరించిన పళనిసామి ప్రభుత్వం.. ఇచ్చిన హామీ మేరకు ఇవాళ రిటైర్డ్‌ జడ్జీ నేతృత్వంలో న్యాయవిచారణకు ప్రభుత్వం ఆదేశించింది.

మద్రాసు హైకోర్టులో పదవీ విరమణ పోందిన న్యాయమూర్తి జస్టిస్ అర్ముగస్వామి పేరును ఎంపిక చేశారు. దీంతో అర్ముగస్వామి అమ్మ మృతి ఎలా జరిగిందన్న విషయాన్ని దర్యాప్తు చేయనున్నారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆమె.. చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. గత ఏడాది డిసెంబర్ 5న అనుమానాస్పద పరిస్థితుల్లో కన్నుమూశారు. జయలలిత మృతిపై నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయడానికి న్యాయవిచారణ జరపాల్సిందేనని ఆమె వీరవిధేయుడు పన్నీర్ సెల్వం డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పళనిస్వామి ప్రభుత్వం అమ్మ జయలలిత మృతిపై న్యాయవిచారణకు ఆదేశించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jayalalita  jayalalihtaa demise  committee  EK Palaniswami  Arumugasamy  Panneerselvam  Tamil Nadu  

Other Articles