ప్రజాబలం నిజమే అయితే.. ఈ కప్పదాట్లు ఎందుకు..? KCR promoting undemocratic culture

Jana reddy criticises trs govt over farmer problems

janareddy lashes out on kcr, jana reddy slams kcr, janareddy on kcr, kcr false promises, elections promises, Rayon Factory in Warangal, Nizam Sugar Factory, Sirpur Paper Mills, Nizamabad, Sonia gandhi, rahul gandhi, man mohan singh

CLP leader Jana Reddy lashed out at CM KCR for making false promises to the people during the 2014 elections and cheating them after coming to power.

ITEMVIDEOS: టీఆర్ఎస్ ప్రజాబలం నిజమే ఐతే.. ఈ కప్పదాట్లు ఎందుకు..?

Posted: 10/26/2016 10:10 AM IST
Jana reddy criticises trs govt over farmer problems

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి నిప్పులు చెరిగారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఇన్నాళ్లు సన్నాయి నోక్కులు నోక్కిన ఆయన తొలిసారిగా విమర్శలు గుప్పించారు. కొత్త రాష్ట్రంలో ప్రజలకు ఏదో మేలు జరుగుతుంది, అందునా కోత్త ప్రభుత్వం కోలువుదీరిందని ఇన్నాళ్లు సొంత పార్టీ నేతలు అయనపై విమర్శలు గుప్పించినా.. మౌనంగానే భరించిన ఆయన కేసీఆర్ సర్కార్ రేండేళ్లు పూర్తి చేసుకున్నా.. ఎన్నికల హామీలను నెరవేర్చకుండా తాత్సారం చేస్తున్న క్రమంలో మాత్రం ఆయన తన గళాన్ని విప్పారు. రెండున్నరేళ్లు గడుస్తున్నా ప్రజలకిచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విరుచుకుపడ్డారు.

సీమాంధ్ర నేతలు, కేంద్ర మంత్రులు సహా పలు పార్టీలు వ్యతిరేకించినా.. తమ అధినేత్రి సోనియా గాంధీ దయాదాక్షిణ్యాలపైన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యిందని అయన గుర్తుచేశారు. ఉద్యమం సయయంలో అన్ని పార్టీలు కలసిరావడంతో తెలంగాణ ఏర్పాటయ్యిందన్న విషయాన్ని మర్చిపోరాదని, తన ఒక్కడి ఘనతే అని నిరూపించుకునేందుకు కేసీఆర్ ఇంకా తాపత్రపడుతున్నారని మండిపడ్డారు. ఆయన ఉద్యమం పాకిస్థాన్‌తో చేసిన యుద్ధం కంటే ఎక్కువేమీ కాదని విరుచుకుపడ్డారు. తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించి, వారికి ఎన్నికల హామిని ఇవ్వడంతోనే తన మాటకు కట్టుబడి సోనియా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని పేర్కొన్నారు.

రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు రోజురోజుకు పెరుగుతున్నా.. వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదని జానారెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో అభివృద్ధి జాడ కూడా లేదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ బలంగా ఉందని సర్వేలు చెబుతున్నాయని అంటున్న టీఆర్ఎస్ నాయకులు, ఇతర పార్టీల నేతలను తమ పార్టీలలో ఎందుకు చేర్చుకుంటున్నారని ప్రశ్నించారు. సర్వేల పేరుతో లేని బలాన్ని ఉన్నట్టు చూపి ప్రజలను మరోమారు మోసం చేయాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. డబుల్ బెడ్రూం ఇళ్ల హామీ ఏమైందని జానారెడ్డి నిలదీశారు. ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదన్నారు. పేద విద్యార్థుల విద్య మధ్యలోనే అగరాదన్న సదుద్దేశ్యంతో రాష్ట్రంలో కాంగ్రెస్ అమల్లోకి తీసుకోచ్చిన ఫీజు రియంబర్స్ మెంట్ ను ప్రభుత్వం ఎత్తివేయాలని చూస్తుందని విమర్శించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jana reddy  cm kcr  false election promises  TRS government  congress  telangana  

Other Articles