విశాఖపై పంజా విసరనున్న ‘కయాంట్’.? Cyclone Kyant can spoil Diwali plans in Bengal, Odisha coast

Cyclone kyant can spoil diwali plans in bengal odisha coast

Cyclone Kyant, Met officials, Bay of Bengal, Indian Meteorological Department, Vishakapatnam, Odisha, West Bengal, diwali celebrations, cyclone,

A cyclone packing winds up to 100 km per hour will smash into coastal Odisha later this week, met officials said, and potentially dampen Diwali celebrations in Bengal.

కయాంట్’ పంజా నుంచి తప్పించుకున్న విశాఖ

Posted: 10/26/2016 09:09 AM IST
Cyclone kyant can spoil diwali plans in bengal odisha coast

విశాఖపై మళ్లి ప్రకృతి ప్రకోపాన్ని చాటుకుంటుందా..? హుద్దూద్ తుఫాను విసిరిన పంజా ధాటికి త్వరగానే కోలుకున్న విశాఖపై మరోమారు విలయం ముంచెత్తనుందా.? విశాఖలో హుధూధ్ మిగిల్చిన గాయలు ఇంకా పలువుర్ని వెంటాడుతున్న తరుణంలోనే కయాంట్ తన ప్రకోపంతో పగబట్టనుందా..? అయితే అవుననే అంటున్నారు వాతావరణ శాస్త్రవేత్తలు. తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం నుంచి వాయుగుండంగా బలపడిన వర్షాలతో సరిపెడుతుందని భావించిన తరుణంలో అది మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారిందని నిఫుణులు చెబుతున్నారు.

కాగా, తీవ్ర వాయుగుండం తుపానుగా మారిందని విశాఖపట్టణంలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. దీనికి 'కయాంట్‌'గా నామకరణం చేసినట్టు వాతావరణ శాఖాధికారులు తెలిపారు. తుపాను ప్రస్తుతం పశ్చిమ నైరుతి దిశగా కదులుతోందని, ఈ రాత్రికి పోర్టుబ్లెయిర్‌ తీరానికి ఉత్తర వాయవ్యంగా 610 కిలోమీటర్ల దూరంలో, విశాఖ తీరానికి తూర్పు దిశలో 780 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంటుందని అధికారులు తెలిపారు. పశ్చిమ బెంగాల్ పై దీని ప్రభావం తీవ్రంగా వుంటుందని పడనుందని అంటున్నారు. దీపావళి పండగ పర్వదినం సంబరాలకు ముస్తబవుతున్న బెంగాల్ వాసుల ఆశలపై కయాంట్ నీళ్లు చల్లుతుందని అంటున్నారు.

అయితే ఆంధ్రప్రదేశ్, ఒడిశాలపై కయాంట్ ప్రభావం పెద్దగా వుండకపోవచ్చని నిఫుణులు చెబుతున్నారు. తీరప్రాంతాల్లో వర్షాలు ముంచెత్తనున్న నేపథ్యంలో అంధ్రప్రదేశ్, ఒడిశా ప్రభుత్వాలు అధికారులను అప్రమత్తం చేశాయి. దీని ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో అంటే 27 లేదా 28 నుంచి తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించిన నేపథ్యంలో ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తలరలించాలని ప్రభుత్వాలు అదేశాలు జారీ చేశాయి. సముద్రంలోకి మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వారు సూచించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Cyclone Kyant  Met officials  Bay of Bengal  Indian Meteorological Department  

Other Articles