పవన్ ఇజం గురించి ఉదహరించిన ఎమ్మెల్యే.. mla sravan kumar remembers pawan kalyan on adilabad incident

Mla sravan kumar remembers pawan kalyan on adilabad incident

sravan kumar, mla sravan kumar, power star, power star pawan kalyan, pawan kalyan janasena, janasena, adialabad, drinking water, mineral water, borewell

andhra pradesh tdp mla sravan kumar remembers pawan kalyan on adilabad incident, says pawan has leadership qualities, tha's why they won't underestimate neither him nor his party.

పవన్ ‘ఇజం’ గురించి ఉదహరించిన ఎమ్మెల్యే..

Posted: 10/24/2016 03:49 PM IST
Mla sravan kumar remembers pawan kalyan on adilabad incident

పవనిజం అంటూ పవర్ స్టార్ పవన కల్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు ఎందుకు నిత్యం ఆయన నామస్మరణ చేస్తారు..? ఆయనలో అంత ప్రత్యేకత ఏమిటీ..? ఇంకోందరు అభిమానులైతే.. ఆయనను దేవుడాగాను, తమను భక్తులుగాను పరిగణించుకుంటారెందుకు.? ఆయనలో అంత స్పెష్టాలిటీ ఏమిటీ.. అంటే.. సమాజంలో ఎందరో హీరోలకు వశం కానిది పనవ్ సొంతమైందని అంటుంటారు అభిమానులు. గల్లికో రాజకీయ నాయకుడు వున్న ఈ రోజుల్లో ప్రజల హృదయాలలోంచి, వారి గుండెల సవ్వడిలోంచి వినిపించే పేరు మాత్రం రాజకీయ నేతలది కాదు. కేవలం నాయకులదే. కార్యకర్తలు హర్షధ్వానాల మధ్చ, అభిమానుల అరుపులు కేరింతల మద్యలోంచి పుట్టుకోచ్చేవాడే లీడర్. అయనే పవన్ కల్యాణ్. అందుకనే ఆయన అభిమానులు అయన దేవుడంటారు. పవన్ఇజంతో ముందుకెళ్తుంటారు.

అందుకు కారణం ఆయనలో వున్న భావాలు. మనం నిత్య జీవితంలో ఎన్నో సంఘటనలు చూస్తుంటాం. మరెన్నో కంటతడి పెట్టించే పరిస్థితులను కూడా ఎదుర్కోంటాం. దేవుడిచ్చిన మర్చపోయే శక్తి మనలో అధికంగా వుంటుంది కాబట్టి వాటని మర్చిపోతాం. అక్కడి నుంచి మరో ప్రాంతానికి, మరో వ్యక్తిని కలసి సమయంలో ఇక దాని గురించి అసలు గుర్తుకు కూడా తెచ్చుకునే ప్రయత్నం చేయం. అయితే పవన్ కల్యాన్ అలా కాదట. తన హృదయాన్ని కలచివేసే ఏ ఘటనను చూసినా ఆయన దానిని మర్చిపోకుండా.. వారికి తన వంతుగా పరిష్కారం చూయించే వరకు నిద్రపోరట. ఇది ఆయనతో పాటుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రస్తుత ఎమ్మెల్యే చెబితే కానీ తెలియని విషయమిది.

సామాజిక దృక్కోణం అధికంగా ఉన్న హీరో, రాజకీయ వేత్త పవన్ అని ఆయన అంటున్నారు. ఈ నేపథ్యంలో పవన్‌ గురించిన తెలుపుతూ ఓ సంఘటనను ఎమ్మెల్యే శ్రావణ్‌ కుమార్‌ ఉదహరించారు. 2009 ఎన్నికల ప్రచారంలో తన సోదరుడు మోగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ తరపున.. పవన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తున్నా రోజులవి. ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా అదిలాబాద్‌ జిల్లా నార్నూరు గ్రామం వద్దకు పవన్‌ వెళ్లారు. అయితే అప్పట్లో ప్రజారాజ్యం పార్టీలో తాను కొనసాగుతూ.. పవన్ తోపాటు తాను అక్కడికి వెళ్లాలనని చెప్పుకోచ్చాడు ఎమ్మెల్యే. అక్కడ ఒకచోట ఉన్న బావి వద్ద కిలోమీటర్‌ దూరం వరకు బిందెలు వరుసగా ఉన్నాయి. అక్కడ ఓ ముసలావిడ కూడా నీళ్ల కోసం వచ్చింది. ఆమెను తోసేస్తూ వేరేవాళ్లు నీళ్లు పట్టుకుపోతున్నారు. ఆ దృశ్యం చూసి బాధపడి పవన్‌తోపాటు మేమంతా మా గదులకు వచ్చేశాం.
 
ఆ తర్వాతి రోజు తెల్లవారుజామున ఎవరో నా గది తలుపు తట్టిన శబ్దం వినబడింది. తీరా చూస్తే పవన్‌. అక్కడందరూ గుక్కెడు నీళ్ల కోసం అల్లాడుతుంటే నాకు ఈ మినరల్‌ వాటర్‌ తాగాలనిపించడం లేదని, వాళ్లకోసం ఏదో ఒకటి చేయాలని పవన్‌ అన్నారు. అప్పటికప్పుడు పవన్‌ తన సొంత ఖర్చులతో రెండ్రోజుల్లో బోర్‌ వేయించారు. నిజానికి ఆ ఊర్లో అంతకుముందే కొన్ని బోర్లు ఉన్నాయి. కానీ వాటిలో నీళ్లు పడలేదు. అయితే అదేం మహత్యమో పవన్‌ వేయించిన బోర్లో మాత్రం నీళ్లు పడ్డాయని స్వార్థంతో చేసే పనికన్నా.. పది మందికి మేలు జరగాలని బలమైన సంకల్పంతో చేసే పనికి భగవంతుడి ఆశీస్సులు కూడా తోడవుతాయని.. ఈ సంఘటతో రుజువైందని శ్రావణ్‌ కుమార్‌ తెలిపారు. ఓ రాజకీయ నేతకు ఉండాల్సిన లక్షణాలతో పాటు ఒక లీడర్ కు ఉండాల్సిన సామాజిక దృక్పథం కూడా పవన్‌కు ఉన్నాయని, అందుకే ఆయణ్ని, ఆయన పార్టీని తాము తేలికగా తీసుకోవడం లేదని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sravan kumar  power star pawan kalyan  janasena  adialabad  drinking water  mineral water  borewell  

Other Articles