సద్దుమణుగుతున్న వేళ.. అక్షయ్ కుమార్ లెటర్ బాంబ్..! ramgopal yadav son akshay yadav writes letter

Ramgopal yadav son akshay yadav writes letter

akhilesh yadav, samajwadi party, uttar pradesh, shivpal yadav, mulayam singh yadav, amar singh, shivpal yadav sacked, ramgopal yadav, akhilesh sacks shivpal yadav, uttar pradesh politics, uttar pradesh elections, up assembly elections, uttar pradesh assembly elections, up polls, up votes, samajwadi party

samajwadi party senior leader and rajya sabha member ram gopal yadav son akshay yadav MP of Firozabad contituensy writes letter to cm akhilesh yadav on party internal imbroglio

సద్దుమణుగుతున్న వేళ.. అక్షయ్ లెటర్ బాంబ్..!

Posted: 10/24/2016 03:54 PM IST
Ramgopal yadav son akshay yadav writes letter

సమాజ్ వాదీ పార్టీలో ఏర్పడిన రాజకీయ అనిశ్చితిని ఓ వైపు సద్దుమణిగేందుకు చర్యలు తీసుకుంటున్న క్రమంలో పార్టీ అధినేత ములాయం సింగ్ సన్నిహితుడైన రాజ్యసభ సభ్యుడు, ఇటీవల పార్టీ నుంచి బహిష్కరణకు గురైన నేత రాంగోపాల్ యాదవ్ కుమారుడు, ఫిరోజాబాద్ ఎంపీ అక్షయ్ యాదవ్ లెటర్ బాంబు పేల్చారు. పార్టీలో నెలకొన్న పరిస్థితులపై ఇవాళ ఉదయమే లక్నోలో అధినేత ములాయం తన సోదరుడు శివసాల్ సింగ్ కు, కుమారుడు, అఖిలేష్ యాదవ్ కు మద్య ఏర్పడిన అగాధాన్ని తీర్చేందుకు ప్రయత్నించారు. ఆ తరువాత ఇరువురితో కలసి ని పార్టీ కార్యాలయంలో మీడియాతో కూడా మాట్లాడారు. ..

ఇలా సంక్షోభం సద్దుమణుగుతుందని భావించిన సమయంలో సీఎం అఖిలేశ్ యాదవ్ కు మద్దతుగా అక్షయ్ యాదవ్ లేఖాస్త్రం సంధించారు. పార్టీలో సంక్షోభానికి ముమ్మాటికి శివపాల్ యాదవ్ కారణమని ఆరోపించారు. అఖిలేశ్ వ్యతిరేకంగా శివపాల్ ఏవిధంగా కుట్ర సాగించారో తన లేఖలో వివరించారు. 2012లో అఖిలేశ్ ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకుని, తానే సీఎం కావాలని శివపాల్ అన్ని ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. అఖిలేశ్ ను దారుణంగా అవమానించారని, మానసికంగా హింసించారని ఆవేదన వ్యక్తం చేశారు. అఖిలేశ్ ను ఇంట్లోంచి బలవంతంగా గెంటివేయడంతో, ఆయన కొత్త ఇంటికి మారారని వెల్లడించారు. నాలుగున్నరేళ్లుగా ఆయనను అణచివేసేందుకు కుట్రలు చేశారని ఆరోపించారు.

అఖిలేశ్ కు తన తండ్రి మద్దతు ప్రకటించడం ఆయన జీర్ణించుకోలేకపోయారన్నారు. బీజేపీకి దగ్గరయ్యారంటూ తన తండ్రిపై అసత్య ప్రచారం చేశారని వాపోయారు. అయితే శివపాల్ సింగే బీజేపీతో సంబంధాలు పెట్టుకున్నారని ఆరోపించారు. జూలైలో బీజేపీ ఎంపీతో కలిసి ఆ పార్టీకి చెందిన అగ్రనేతను శివపాల్ కలిశారని, తన దగ్గర ఆధారాలున్నాయన్నారు. శివపాల్ కుమారుడి వివాహ రిసెప్షన్ కు అయిన ఖర్చు అమర్ సింగ్, బీజేపీ ఎంపీ భరించారని వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles