ముఖ్యమంత్రిని టార్గెట్ చేసి ఉగ్రవాదుల కాల్పులు.. తప్పించుకున్న సీఎం Manipur CM Okram Ibobi escapes from Terrorist attack

Manipur cm okram ibobi escapes unhurt amidst firing by militants

Manipur, chief minister, Okram Ibobi, Militant firing, helicopter, NSCN militants, Ukhrul district

Manipur Chief Minister Okram Ibobi Singh today escaped unhurt when suspected militants opened gunfire as he was getting out of his helicopter at the Ukhrul helipad

ఫ్లాష్.. ష్లాష్.. ముఖ్యమంత్రిని టార్గెట్ చేసి ఉగ్రవాదుల కాల్పులు..

Posted: 10/24/2016 02:39 PM IST
Manipur cm okram ibobi escapes unhurt amidst firing by militants

ముఖ్యమంత్రిని ఉగ్రవాదులు టార్గెట్ గా చేసుకుని జరిపిన కాల్పుల నుంచి ఆయన తృటిలో తప్పించుకున్నారు. మణిపూర్ ముఖ్యమంత్రి ఓక్రమ్ ఇబోబి తృటిలో ప్రాణాపాయ పరిస్థితుల నుంచి భయటపడ్డారు. ఆయనపై అనుమానిత ఎన్ఎస్‌సీఎన్ ఉగ్రవాదులు దాడి చేశారు. మణిపూర్ రాష్ట్రంలోని ఉక్రుల్ జిల్లాలో హెలిపాడ్‌ నుంచి ఆయన దిగుతున్న క్రమంలో అప్పటికే అక్కడికి చేరుకున్న ఉగ్రవాదులు అయనను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. అయితే ముఖ్యమంత్రికి ఎలాంటి గాయాలు కానీయకుండా సురక్షితంగా ఇంఫాల్ కు తరలించడంలో ఆయన భద్రతాదళాలు సఫలమయ్యాయి.

త్వరలో ఎన్నికల నగరా మ్రోగనున్న ఈ రాష్ట్రంలో.. పలు అభివృద్ది పనులను ప్రారంభించేందుకు ఉక్రుల్ జిల్లాలోని హన్ ఫుంజ్, చింగల్ గ్రామాలకు ముఖ్యమంత్రి రావాల్సివుంది. హన్ ఫుంజ్ గ్రామంలో వంద పడకల అసుప్రతితో పాటు పవర్ సబ్ స్టేషన్ ను కూడా లాంచ్ చేయాల్సి వుంది. చింగల్ గ్రామంలో గ్రామస్థులు నిరసన కారణంగా హెలికాప్టర్ ను అపకుండానే సీఎం వెళ్లారు. ఈ ఘటన నేపథ్యంలో ముఖ్యమంత్రి హుటాహుటిన ఎమర్జెన్సీ క్యాబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు సమాచారం. కాగా ఉగ్రవాదలు జరిపిన దాడిలో భద్రతా దళానికి చెందిన ఓ కానిస్టేబుల్ తీవ్రగాయాపాలయ్యాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Manipur  chief minister  Okram Ibobi  Militant firing  helicopter  NSCN militants  Ukhrul district  

Other Articles