60 hours on, Indian Air Force's Antonov AN-32 still missing

60 hours on indian air force s antonov an 32 still missing

AN-32, Air Forces AN-32, Tambaram air base, Indian Air Force, Missing AN-32, Antonov, Chennai, Defence minister, IndianAirForce, Naval Armament Depot, NewsTracker, Parrikar, RISAT, Russia, Ukraine

The search continued with more assets being pulled in, even as the rough seas posed a challenge.

మూడో రోజు కూడా లభించని ఐఎస్ 32 అచూకీ..

Posted: 07/24/2016 10:15 AM IST
60 hours on indian air force s antonov an 32 still missing

మూడు రోజులు గడుస్తున్నా బంగాళాఖాతంలో కూలిపోయిన భారత వాయుసేన విమానం ఏఎన్-32 ఆచూకీ ఇంకా లభించలేదు. తమిళనాడులోని తాంబరం వైమానిక స్థావరం నుంచి పోర్టుబ్లెయిర్‌కు శుక్రవారం ఉదయం బయలుదేరిన విమానం కొద్దిసేపటికే అదృశ్యమైన సంగతి తెలిసిందే. ఇందులో మొత్తం 29 మంది సిబ్బంది వున్నారు. వారిలో ఎనిమిది మంది విశాఖపట్నానికి చెందినవారు. ఘటన జరిగి 36 గంటలు దాటినా విమానం జాడ లేదు. ఇది బంగాళాఖాతంలో కూలిపోయి వుంటుందనే అనుమానంతో రక్షణ అధికారులు చెన్నై పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా గాలిస్తున్నారు.

మొత్తం 18 యుద్ధనౌకలు, ఆరు విమానాలు, 10 హెలికాప్టర్లు, ఓ జలాంతర్గామి ఈ పనిలో నిమగ్నమై ఉన్నాయి. ప్రత్యేక రాడార్‌ సదుపాయం, అత్యంత శక్తివంతమైన కెమెరా పరికరాలున్న బీ81 రకం విమానంతోనూ ముమ్మరంగా గాలిస్తున్నారు. తాజాగా పోర్ట్‌బ్లెయిర్‌ నుండి విశ్వసద్‌ అనే భారీ నౌక కూడా గాలింపు చర్యల్లో పాల్గొనేందుకు సిద్ధంగా ఉంది. భారతదేశంలో రక్షణ శాఖ ఇప్పటివరకు చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్లలో ఇదే పెద్దది. ఇంత పెద్దఎత్తున బలగాలను ఎప్పుడూ గాలింపునకు ఉపయోగించలేదని నేవీ వర్గాలు చెబుతున్నాయి.
 
సహ్యాద్రి, రాజపుత, రణ్‌విజయ్‌, శక్తి, జ్యోతి, సుకన్య తదితర యుద్ధనౌకలు బంగాళాఖాతాన్ని అణువణువూ గాలిస్తున్నాయి. కోస్ట్‌గార్డ్‌కు చెందిన మరో మూడు నౌకలు తీరం చుట్టూ తిరుగుతున్నాయి. నేవీకి చెందిన రెండు పీ-8ఐ నిఘా విమానాలతో పాటు డార్నియర్‌ విమానాలు గగనతలం నుంచి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సముద్రాన్ని జల్లెడ పడుతున్నాయి. కూలిపోయి బంగాళాఖాతంలో మునిగిపోయి ఉంటే.. దాని జాడ పసిగట్టేందుకు, సిగ్నల్స్‌ను అందుకోవడానికి సబ్‌మెరైన ప్రయత్నిస్తోంది.

గాలింపు చర్యలను స్వయంగా పర్యవేక్షించేందుకు రక్షణ మంత్రి మనోహర్‌ పరీకర్‌ తమిళనాడు చేరుకున్నారు. వైమానిక దళాధిపతి ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ అరూప్‌ రాహా, తూర్పు నౌకాదళం ప్రధానాధికారి వైస్‌ అడ్మిరల్‌ హెచ సీఎస్‌ బిస్త్‌లతో కలిసి ఆయన అరక్కోణంలోని రాజాలి వైమానిక స్థావరం నుంచి నిఘా విమానం పీ-8ఐలో వెళ్లి ఏరియల్‌ సర్వేలో పాలుపంచుకున్నారు. పరిస్థితిని స్వయంగా సమీక్షించారు. ప్రమాద ఘటనను అధికారులు ఆయనకు ఛాయాచిత్రాలతో వివరించారు.
 
గాలింపును మరింత విస్తృతం చేయాలని మంత్రి ఆదేశించడంతో అదనపు బలగాలను రంగంలోకి దించారు. త్వరగా విమానం జాడ కనుగొనేందుకు రక్షణ దళమంతా కృషి చేస్తోందని పరీకర్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు. వాతావరణం గాలింపునకు అనుకూలంగా లేదని, దట్టమైన మబ్బులు కమ్ముకొని ఉండడంతో పాటు, సముద్రం కల్లోలంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఐఎనఎ్‌స జలాశ్వపై నుంచి హెలికాప్టర్‌తో నిర్వహిస్తున్న గాలింపు చర్యలను పరిశీలించారు. కన్యాకుమారిలో తమిళనాడు కోస్ట్‌గార్డ్‌ మూడు నౌకలతో విస్తృతంగా గాలిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Air Forces AN-32  Tambaram air base  Indian Air Force  Missing AN-32  

Other Articles