నేపాల్ ప్రధాని ఓలి రాజీనామా | Nepal Prime Minister Oli resigns ahead of no trust vote

Nepal prime minister oli resigns ahead of no trust vote

Nepal Prime Minister Oli, Nepal PM resigns,Oli no trust vote, Nepal Oli resign, నేపాల్ ప్రధాని రాజీనామా

Nepal Prime Minister Oli resigns ahead of no trust vote

నేపాల్ రాజకీయాల్లో కల్లోలం... పీఎం ఓలీ రాజీనామా

Posted: 07/24/2016 10:43 PM IST
Nepal prime minister oli resigns ahead of no trust vote

అవిశ్వాస తీర్మానం ఎదుర్కోవడానికి ముందే నేపాల్ ప్రధాని కేపీ ఓలీ తన పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఓలీ మాట్లాడుతూ, భారత్, చైనాలతో సత్సంబంధాలు మెరుగు పరిచేలా కృషి చేసినందుకే నేపాలీ కాంగ్రెస్, మావోయిస్టులు తన ప్రభుత్వంపై కుట్ర చేశారని ఆయన ఆరోపించారు. కాగా, అక్టోబర్ 2015లో కేపీ ఓలీ నేపాల్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. సీపీఎన్-మావోయిస్టు సెంటర్, నేపాల్ కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రీయ ప్రజాతంత్ర, మాదేసి జనాధికార ఫోరంతోపాటు మరో రెండు చిన్నపార్టీలు సైతం సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించి అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాయి.

ఇక అవిశ్వాస తీర్మానానినికి ప్రతిపక్ష నేపాల్ కాంగ్రెస్ పార్టీ సహజంగానే మద్దతు తెలిపింది. అలా అన్ని పార్టీలు ఏకమై ప్రధానిపై తిరుగుబావుటా ఎగరేశాయి. ఎలాగూ ఓటమి తప్పని పరిస్థితుల్లో ఓలీ రాజీనామా చేశారు. అయితే పార్టీల మధ్య నెలకొన్న సైద్ధాంతిక, రాజకీయ విబేధాల మధ్య కొత్త ప్రభుత్వం ఏర్పాటు అవుతుందా? అన్నది సంశయమే! పార్లమెంట్ ను రద్దు చేసి మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తారనే వార్తలు వినవస్తున్నాయి.

అసలేం జరిగింది...

నేపాల్ పార్లమెంట్ లో మొత్తం 601 సీట్టకు గానూ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (యునిఫైడ్ మాక్సిస్ట్, లెనినిస్ట్)కు 175 మంది సభ్యులున్నారు. అధికారం చేపట్టడానికి కావాల్సిన కనీస బలం 299 అవసరం కావటంతో సీపీఎన్.. మావోయిస్టు పార్టీ(80 మంది సభ్యులు), ఆర్పీపీ(24), మాదేసిల ఫోరం (14 మంది సభ్యుల) మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. 196 మంది సభ్యులున్న నేపాలీ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పాత్రను పోషిస్తోంది. అయితే ప్రభుత్వ ఏర్పాటు సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ దేశ ప్రధాని ఓలి తుంగలోతొక్కారని, అందుకే మద్దతు ఉపసంహరించుకున్నామని మిత్రపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి.

ఈ వ్యతిరేకత వెనుక మరో బలమైన కారణం కూడా ఉంది. నేపాల్ నూతన రాజ్యాంగం అమలులోకి తెచ్చిన సమయంలో తమకు అన్యాయం జరుగుతోందంటూ మాదేసీలు చేసిన ఉద్యమాన్ని ప్రభుత్వం తీవ్రంగా అణిచివేశారు. ఆందోళనల్లో 50 మంది మాదేసీలను పోలీసులు కాల్చిచంపారు. ఇదిగాక భారత్ తో సత్సంబంధాలను తెంచుకుని చైనాకు దగ్గరవుదామనుకున్న ఓలీని స్వపక్షం వారే వ్యతిరేకించారు. ఈ పరిణామాలన్నీ ఆయన్నీ పదవిచీత్యుడిని చేసేందుకు పురిగొల్పాయి.

 'ఆయన తనగురించి మాత్రమే ఆలోచించే స్వార్థపరుడు. అహంకారి. మనుగడ కోసం మా పార్టీని వాడుకుని లబ్దిపొందాలనుకుంటున్నాడు' అంటూ మావోయిస్టు పార్టీ అధినేత ప్రచండ ప్రధాని ఓలీపై నిప్పులు చెరిగారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nepal  PM KP Oli  Resign  No trust Vote  

Other Articles