Mallya told FT he was in forced exile and had no plans to leave Britain

India asks uk to deport vijay mallya

Vijay Mallya, Kingfisher Airlines, Kingfigher debt settlement, British High Commission, External Affairs Ministry, MEA, Financial Times mallya, Supreme Court, UK

Embattled tycoon Vijay Mallya wants a "reasonable" settlement with creditor banks to his defunct airline, he said in an interview in London published by the Financial Times on Friday.

భారత్ కు రాను.. అరెస్టు చేస్తే రూపాయి కూడా రాదు: విజయ్ మాల్యా

Posted: 04/29/2016 02:33 PM IST
India asks uk to deport vijay mallya

బ్యాంకులకు వేల కోట్ల రూపాయల రుణాలు ఎగొట్టి, విదేశాలకు వెళ్లిపోయిన ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు బిగుసుకున్న ఉచ్చు మరింత బలపడేలా కనిపిస్తోంది. లండన్‌లో ఉంటున్న విజయ్ మాల్యాను తమకు అప్పగించాలని బ్రిటన్‌ ప్రభుత్వానికి కేంద్రం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు విదేశాంగ శాఖ... బ్రిటన్ హై కమిషనర్‌కు లేఖ రాసింది. విచారణకు రావాలంటూ ఈడీ మూడు సార్లు నోటీసులు పంపినా... డొంకతిరుగుడు సమాధానాలు చెబుతూ తప్పించుకుంటున్నమాల్యా తాను భారత్ కు తిరిగివచ్చేది లేదని కుండబద్దలు కొట్టారు.

Also Read: ఒక్క రూపాయి అప్పులేని విజయ్ మాల్యా 

కాగా, మాల్యాను వెనక్కి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. మాల్యా మాత్రం తాను ఇంగ్లండ్ను వదిలివచ్చే ఉద్దేశ్యంలేదని చెబుతున్నాడు. తన పాస్పోర్టు తీసుకున్నా, అరెస్ట్ చేసినా బ్యాంకులకు ఒక్క రూపాయి కూడా రాదని చెప్పాడు. బ్యాంకులకు ఎంతో కొంత చెల్లించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపాడు. విజయ్ మల్యా పలు బ్యాంకులకు దాదాపు 9500 కోట్ల రూపాయలు బకాయిపడిన సంగతి తెలిసిందే.

Also Read: మాల్యాను తీసుకురండి.. ఫైన్ కడతా 

బ్యాంకులకు రుణం చెల్లించకుండా ఆయన ఇంగ్లండ్కు వెళ్లిపోయాడు. లండన్‌లో ఉంటున్న విజయ్ మాల్యాను తమకు అప్పగించాలని బ్రిటన్‌ ప్రభుత్వానికి కేంద్రం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు విదేశాంగ శాఖ... బ్రిటన్ హై కమిషనర్‌కు లేఖ రాసింది. మాల్యాను స్వదేశానికి రప్పించే ప్రయత్నాల్లో భాగంగా ఆయన పాస్ట్ పోర్టును కూడా రద్దు చేసింది. ఇక మాల్యా రాజ్యసభ సభ్వత్వాన్ని రద్దు చేయాల్సిందిగా ఎథిక్స్ కమిటీ సిఫారసు చేసింది.

జి, మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vijay Mallya  Kingfisher Airlines  Kingfigher debt settlement  

Other Articles