nabil parents alleges its a cold blooded murder

How can i see my sons murder says nabil father yousuf

Street fighting turns ugly in Hyderabad, kills teen, Mirchowk, Hyderabad, street fighting, boxing bout, old city, Hyderabad, teen dies after continous blows on head and face, Crime, wwf, crime in telangana, crime in hyderabad, sabil, old city boxing video goes viral, nabil father yousuf, nabil parents alleges its a cold blooded murder

nabil parents alleges its a cold blooded murder, and his father yousur questions how can he see his sons murder video

స్నేహితులే మా ఒక్కగానోక్క బిడ్డను బలితీసుకున్నారు

Posted: 05/10/2015 12:01 PM IST
How can i see my sons murder says nabil father yousuf

తండ్రిగా తన కొడుకుపై పిడిగుద్దులు కురిపిస్తున్న వీడియోను తాను చూడలేనని..  చూసినా తాను తట్టుకోలేనని నబిల్ తండ్రి యూసుఫ్ అన్నారు. హైదరాబాద్ పాత బస్తీలో డబ్ల్యూడబ్ల్యూఎఫ్ తరహాలో నబిల్ అతడి స్నేహితుడి మధ్య బాక్సింగ్ ఫైటింగ్ జరిగి నబిల్ ప్రాణాలు కోల్పోవడం.. చేతికందవచ్చిన కొడుకు అకస్మికంగా బస్తీలోని బాక్సింగ్ బలి కావడంపై ఆయన కన్నీళ్ల పర్యంతమయ్యారు. తమ కోడుకును స్నేహితులు కావాలని పిడిగుద్దులు గుద్ది.. దానిని బాక్సింగ్ గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

ఈ ఘటనపై నబిల్ తల్లిదండ్రులు స్పందిస్తూ.. ముందుగా తమ కోడుకు నబిల్ బైక్ యాక్సిడెంట్ లో చనిపోయారని అబద్ధం చెప్పారని అన్నారు. ఇంట్లో ఉన్న తమ బిడ్డను భయటకు తీసుకెళ్లిన అతని స్నేహితులు ముందుగా వేసుకున్న పథకం ప్రకారమే హత్యచేశారని వారు దు:ఖసాగరంలో మునిగారు. తమ ఒక్కగానొక్క బిడ్డను పొట్టన పెట్టుకున్నారని చెప్పారు. ఇప్పటికే దానికి సంబంధించిన వీడియో మీరంతా చూశారని, కొడుకు చనిపోయే వీడియోను ఒక తండ్రిగా తాను మాత్రం చూడలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, మరే తండ్రికి ఇలాంటి పుత్రశోకం కలగకుండా పోలీసులు తగు చర్యలు తీసుకోవాలని, నిందితులనకు కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : street fighting  boxing bout  old city  Hyderabad  yousuf  

Other Articles