Teen dies due to Street fighting in Hyderabad

Street fighting turns ugly in hyderabad kills teen

Street fighting turns ugly in Hyderabad, kills teen, Mirchowk, Hyderabad, street fighting, boxing bout, old city, Hyderabad, teen dies after continous blows on head and face, Crime, wwf, crime in telangana, crime in hyderabad, sabil, old city boxing video goes viral,

A street fight took an ugly turn in Mirchowk of Hyderabad resulting in the death of a 16-year-old boy who died after receiving continuous blows on his head and face.

ITEMVIDEOS: బస్తీమే బాక్సింగ్.. యువకుడు మృతి

Posted: 05/10/2015 11:27 AM IST
Street fighting turns ugly in hyderabad kills teen

టీనేజ్ అనగానే అనేక ప్రమాదాల వయస్సని అందుకనే 13 ఏళ్ల వయస్సు నుంచి 19 ఏళ్ల వయస్సు వచ్చే వరకు తమ పిల్లలను అన్ని రకాలుగా కాపాడుకోవాల్సిన అవసరం తల్లిదండ్రులపైన వుంటుందని పెద్దలతో పాటు మానసిక నిఫుణులు, పిలల్ల వైద్యులు కూడా చెబుతుంటారు. పిల్లలకు స్వేచ్ఛ, స్వతంత్ర్యం కల్పించాలి, కానీ వారిని కంటికి రెప్పలా కాపాడాలి కూడా. అలా కాకపోతే పిల్లలు ఎంచుకునే మార్గం వక్రమైతే.. అది అనేక ప్రమాదకర ఘటనలకు దారి తీయవచ్చు. పాతబస్తీలో జరిగిన ఓ ఘటన ఇందుకు ఉదాహరణగా నిలుస్తుంది.

 

 

స్నేహితులు సరదాకు అడుకున్న ఆట ఒకరి ప్రాణాలు తీసింది. తెలసీతెలియని వయస్సులో వారు ఏం చే్స్తున్నారో గమనించకపోవడంతో తల్లిదండ్రులు చేతికందే కోడుకును కోల్పోవాల్సి వచ్చింది. అన్ని జాగ్రత్తల మధ్య జరగాల్సిన బాక్సింగ్ బౌట్ తరహో ఆటను బస్తీలో ఎలాంటి రక్షణ లేకుండా, నిబంధనలు పాటించకుండా జరగడంతో తమలో ఒక స్నేహితుడిని కోల్పాయారు వారు. హైదరాబాద్ పాత బస్తీలోని మీర్ చౌక్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అత్యంత భయంకరమైన క్రీడగా చెప్పుకునే డబ్ల్యూ డబ్ల్యూ బాక్సింగ్ తరహాలో నబీల్ మరికొందరు వ్యక్తులు కలిసి పాతబస్తీలోని ఓ వీధికి చేరారు.

అనంతరం వారంతా కలిసి వీధి బాక్సింగ్కు దిగారు. అనంతరం ఆ ప్రాంతాన్ని రింగుగా భావించి ఘోరంగా తలపడ్డారు. దీంతో పరస్పరం పిడిగుద్దులు కురిపించుకోవడంతో నబీల్ అనే వ్యక్తి కుప్పకూలిపోయాడు. అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలుకోల్పోయాడు. కాగా, ఇది అనుమానాస్పద మృతి కేసుగా పోలీసులు నమోదు చేసుకున్నారు. మరోపక్క, వారు బాక్సింగ్ తలపడిన వీడియో ఒకటి బయటకు వచ్చి ప్రస్తుతం హల్ చల్ చేస్తోంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : street fighting  boxing bout  old city  Hyderabad  Crime  

Other Articles