telugu serial actress attempts suicide

Tv actress attempts suicide

telugu serial actress attempts suicide, TV Actress attempts suicide, TV Actress attempts suicide, Actress Harjit Kaur aka Rupa attempted suicide, rupa kaur, roopa kaur, roopa klaur alias Harjit Kaur, live-in relationship, rupa relative Keval Singh, Private Bank employee,

Telugu TV Actress Harjit Kaur aka Rupa attempted suicide by jumping into Hussain Sagar. Luckily, She was rescued by the Lake Police and got to know love failure is the reason behind her extreme step

అపు‘రూప’ జీవితాన్ని కాపాడిన లేక్ పోలీసులు

Posted: 05/10/2015 12:28 PM IST
Tv actress attempts suicide

ప్రేమ వైఫల్యం కారణంగా మానసిక వ్యధకు గురైన తెలుగు బుల్లితెర నటి రూపా కౌర్ అలియాస్ హర్జీత్ కౌర్ (28) హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించింది. సకాలంలో అమెను గమనించిన హుస్సేన్ సాగర్ పోలీసులు అమెను అడ్డుకుని రక్షించగలిగారు. నటిగా రూప ఆర్జిస్తున్న పేరు ప్రతిష్టలను చూసి ఆమె వెంటపడిన సమీప బంధువు కేవల్ సింగ్ చేసిన దారుణ మోసాన్ని తట్టుకోలేక ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. కొన్నాళ్ల పాటు రూపా కౌర్ తో సహజీవనం చేసిన అతను.. పెళ్లి మాట ఎత్తేసరికి, టీవీ నటిని పెళ్లి చేసుకోవడానికి తన కుటుంబం ఒప్పుకోవడం లేదంటూ చేతులెత్తేసి పారిపోవడమే అమె ఆత్మహత్య యత్నానికి కారణమని తెలుస్తుంది.

వివరాల్లోకి వెళ్తే.. బుల్లితెర నటిరూప తెలుగులో చంద్రముఖి, అరుంధతి, అంతఃపురం, శిఖరం అనే సీరియల్స్‌లో నెగెటివ్ పాత్రల్లో నటించింది. కొంతకాలంగా కేవల్ సింగ్ అనే సమీప బంధువు ప్రేమలో పడింది. ప్రస్తుతం ఇద్దరూ కలిసి సహజీవనంలో ఉన్నారు. త్వరలోనే పెళ్లి చేసుకుందామనుకున్నారు. కాగా ఇంట్లోవారు సినిమా నటితో పెళ్లికి ఒప్పుకోవటం లేదని కేవల్ సింగ్.. రూపతో అనడంతో ఆమె ఆదివారం ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. సాగర్ పోలీసులు రూపను అదుపులోకి తీసుకుని పేట్‌బషీరాబాద్ పోలీసులకు అప్పగించారు.

 కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు. రూప సోదరుడిని పిలిపించిన పిలిపించిన లేక్ ఇనస్పెక్టర్ శ్రీదేవి కౌన్సిలింగ్ చేశారు. ప్రస్తుతం బోయిన్‌పల్లి సమీపంలోని సుచిత్రసర్కిల్‌లో పరిధిలో నివాసం ఉంటున్నందున కేసును పేట్ బషీర్ బాగ్ పోలిస్ స్టేషన్ కు బదలాయించారు.  కేవల్ సింగ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకునే దిశగా పేట్ బషీర్ బాగ్ స్టేషన్‌కు కేసును బదలాయించామని పోలీసులు తెలిపారు. గత ఐదేళ్లుగా టీవీ సీరియల్స్‌లో నటిస్తున్న రూప...ఇప్పటికే తెలుగు టవీ సీరియల్స్లో నెటిగివ్ పాత్రలలో మంచి క్రేజ్ సంపాదించింది. అయితే గత రెండేళ్లుగా రూప కేవల్ సింగ్ ప్రేమాయణం నడిచిందని, అతనిని పెళ్లికి ఒప్పించలేక విసిగిపోయిన రూప చివరికి ఆత్మహత్యకు ప్రయత్నించింది.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles