Criminals keen for cricket jail in guwahati to install cable tv

worldcup 2015, icc worldcup 2015, jail prisoners, local tribal council, guwahati jail prisoners, jail criminals, cable tvs, worldcup cricket matches, guwahati high court, guwahati jail prisoners, indian vs west indies match, guwahati court,

Seven prisoners, including a former head of a local tribal council, had filed a petition before the city's high court asking permission to watch the ongoing World Cup cricket matches.

జైళ్లకు కేబుల్ కనెక్షన్.. ఖైదీలకు క్రీకెట్ ఫీవర్

Posted: 03/05/2015 09:41 PM IST
Criminals keen for cricket jail in guwahati to install cable tv

ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంట్ ఫీవర్ యావత్ ప్రపంచంతో పాటు జైళ్లలో దోషులు, నిందితులకు కూడా వ్యాపించింది. ప్రస్తుతం నడుస్తున్న క్రికెట్ టార్నమెంటును తాము చేసేందుకు వీలు కల్పించాలని ఏడుగురు ఖైదీలు వేసిన పిటీషన్ విచారించిన అస్సోంలోని గౌహతి హైకోర్టు అందుకు పచ్చజెండాను ఊపింది. జైలులో వున్న ఖైదీలందరు క్రికెట్ ప్రపంచకప్ చూసేందుకు వీలు కల్పించాలని జైలు అధికారులను అదేశించింది.

ఏడుగురు ఖైదీలతో పాటు స్థానిక గిరిజన నాయకడు వేసిన పిటీషన్ ను విచారించిన గౌహతి న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి జైలు ఖైదీలు అన్ని మ్యాచ్ లను వీక్షించేందుక వీలు కల్పించాలని అదేశించారు. ఇలాంటి మ్యాచ్ ల వల్ల ఖైదీల నేర ప్రవృత్తిలో మార్పు వస్తుందని న్యాయస్థానం అభిప్రాయపడింది. భారత రాజ్యాంగానికి లోబడి ఖైదీలు ప్రాథమిక హక్కులను కాపాడాలని ఆయన సూచించారు. ఖైదీలకు టీవీని విక్షించడం, వార్తలు, క్రీడలు, వినోదం తదితరాలను చూసే వీలు కల్పించాలన్నారు.

కాగా న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో గౌహతి జైలులో అధికారులు కేబుల్ కన్షక్షన్ ను ఏర్పాటు చేశారు. ఐదు రోజుల వ్యవధిలో ఖైదీలకు టీవీలను ఏర్పాటు చేయాలన్న న్యాయస్థానం అదేశానుసారి మరో నాలుగు రోజుల్లో టీవీలను ఏర్పాటు చేస్తామని జైలు అధికారులు తెలిపారు. ప్రస్తుతం జైలు లో కేబుల్ టీవీ కనక్షన్ వైరు లాగామన్నారు. టీవీలను ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలన్న దానిపై నిర్ణయం తీసుకున్న తరువాత వాటికి అనుగూణంగా టీవీలను అమరుస్తామని జైలు అధికారులు తెలిపారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : guwahati court  Criminals  cable TV installation in jail  

Other Articles