Foreign and indian women gang raped

american national sexally assaulted, califonia wowan sexally assaulted in uttarpradesh, alifonia wowan sexally assaulted in Vrindavan, gang rape in hyderabad, gang rape in kukatpally, crime in uttarpradesh, voilence on woman, crime on woman, rape on woman, woman gang raped, police registers fir, rape cases in india, latest news on woman rape, latest news on gang rapes,

US national alleged that she was sexually assaulted by sadhus in Vrindavan, gang rape in kukatpally

స్వదేశీ, విదేశీల తేడా లేదు.. ఆడది కనబడితే చాలు..!

Posted: 03/05/2015 09:29 PM IST
Foreign and indian women gang raped

కీచకల పరంపర కొనసాగుతోంది. మహిళలపై మగమృగాళ్లు విలయతాండవం శృతి మించుతోంది. త్లల్లిగా, చెల్లిగా, భార్యగా ఆదరణకు నోచుకోవాల్సిన మహిళలపై అత్యాచార సంఘటనలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. అత్యాచారాలకు పాల్పడితే కఠిన శిక్షలు ఉంటాయని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నా మాకేం నేరాలు కోత్త కాదు అన్నట్లుగా మగమృగాళ్లు విరుచుకుపడుతున్నాయి. ఆకాశంలో సగం మగువలన్న అర్థం పోయి.. ఇంటి నుంచి అడుగు భయట పెట్టాలంటేనే మగువలు జంకాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి.

తాజాగా ఓ మహిళపై ఇద్దరు వ్యక్తులు అత్యంత పాశవికంగా అత్యాచారం చేశారు. ఈ సంఘటన గురువారం కేపీహెచ్‌బీలోని వెంకటేశ్వరాకాలనీలో జరిగింది. వివరాలు.. వెంకటేశ్వర కాలనీకి చెందిన 38 ఏళ్ల మహిళపై ఇద్దరు వ్యక్తులు శ్రీనివాస్, వెంకటేశ్,  అత్యాచారం చేశారు. బాధితురాలు కూకట్‌పల్లి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అత్యాచారానికి పాల్పడిన ఆ ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.

మరో ఘటనలో ఉత్తరప్రదేశ్‌లోని వృందావన్‌కు వచ్చిన 40 ఏళ్ల అమెరికన్ మహిళపై ఓ సాధువు అత్యాచారానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. స్వతహాగా శ్రీష్ణుడి భక్తురాలైన కాలిఫోర్నియాకు చెందిన మహిళ ఫిబ్రవరి 26న హోలీ ఉత్సవాల కోసం వృందావన్‌కు వచ్చింది. స్థానికంగా వున్న ఓ గెస్టు హౌస్‌లో దిగింది. ఆ మరుసటి రోజు నుంచి కనిపించకుండా పోయిన మహిళ ఇవాళ తీవ్రగాయాలతో స్పృహ కోల్పోయి, రోడ్డు పక్కన పడి వుంది. విధేశీ మహిళను గుర్తించిన పోలీసులు ఎస్కార్టు సాయంతో ఆమెను మధుర జిల్లా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.  

తులసీ మాల ధరించిన ఓ సాధువు తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు బాధితురాలి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు తులసీ మాల ధరించిన ఓ సాధువును వెతికే పనిలో పడ్డారు. ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన ఆసుపత్రి వర్గాలు ప్రస్తుతం ఆమె తీవ్రమైన షాక్ స్థితిలో ఉందని, తనపై జరిగిన దాడి కారణంగా చాలా భయపడిందని చెప్పారు. ఇప్పటి వరకు చేసిన వైద్య పరీక్షల్లో ఆమె లైంగిక వేధింపులకు గురైనట్లు సూచించలేదని, మిగతా పరీక్షల నిమిత్తం ఆమెను ఆగ్రాకు పంపుతున్నట్లు తెలిపారు

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Young girl raped  Kukatpally venkateswara nagar colony  america  california  vrindavan  women  sadhu  police  

Other Articles