Holi wishes to all the people

holi, modi, colours, festival,

holi festival may bring new colours to peoples lives. the president, pm, governor wish the holi to people.

హోళీ శుభాకాంక్షలు.. ప్రముఖుల ఆకాంక్షలు

Posted: 03/06/2015 09:36 AM IST
Holi wishes to all the people


మనందరి జీవితాలు సప్త వర్ణాల శోభితం. అన్ని రంగులు మన జీవితంలోని వివిధ పరిస్థితులను అద్దం పట్టేవే. ఒక్కో రంగు ఒక్కో అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది. అలాంటివి మన జీవితంలో అన్ని రంగులు కలిగి ఎంతో కలర్ ఫుల్ లా తయారు కావాలని ఆకాంక్షిస్తున్నాము. హోళీకి ముందు రాత్రి కాముడిని మంటల్లో కాల్చి, ఆ వేడిని మన శరీరాలకు తాకేలా చూసుకుంటాం. కొత్త వెలుగుల కోసం హోళీ మంటలు అందరికి అవసరం. హోళీ రోజు ఉదయం నుండి వివిధ రంగులతో అందరితో కలిసి రంగులు చల్లుకుంటూ శుభాకాంక్షాలు తెలుపుతాము. చిన్నా, పెద్దా, ఆడ, మగ, పేద, ధనికలాంటి భేదాలు లేకుండా అందరు కలిసి రంగులు హోళీ ఆడతారు. భారతీయ సంప్రదాయంలో హోళీ కి ఎంతో విశిష్టత ఉంది. హోళీ విశిష్టత గురించి తెలియకున్నా, రంగుల పండగను మాత్రం ఎవరు మాత్రం వదులుకుంటారు, అందుకే అందరూ రంగుల ప్రపంచంలో మునిసి మైమరిచిపోతారు.

01
02
03
04
05
06
07
08
09
10

ఇక దేశ ప్రజలకు శుభాకాంక్షాల వెల్లువ కొనసాగింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి, గవర్నర్ నరసింహన్ లు ప్రజలకు హోళీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ హోళీ ప్రజల జీవితాల్లో రంగులు నింపాలని ఆకాంక్షించారు. వసంత రుతువు ఆరంభం నేపథ్యంలో ఈ రంగుల పండుగ ప్రజల జీవితాల్లో సరికొత్త కాంతులు తేవాలని ఆకాంక్షించారు. శాంతియుత సహజీవనం, స్నేహసౌభ్రాతృత్వాలు, ఆనందోత్సహాలతో ప్రజలు వర్ధిల్లాలని వారు కోరుకున్నారు.
-అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : holi  modi  colours  festival  

Other Articles