Obama wishes south korean us envoy speedy recovery

South Korea US envoy Mark Lippert, Mark Lippert 'well' after knife attack, US ambassador to South Korea recovering, US President Barack Obama wished speedy recovery, Mark Lippert, US ambassador, south korea, wielding attacker, Kim Ki-jong,

A militant Korean nationalist has slashed the face of the US ambassador to South Korea at a breakfast meeting in Seoul, but the envoy was not seriously hurt.

లిప్పర్ట్ త్వరగా కోలుకోవాలని ఒబామా అకాంక్ష

Posted: 03/05/2015 09:26 PM IST
Obama wishes south korean us envoy speedy recovery

సౌత్ కొరియాలోని దారుణం జరిగింది. అగ్రరాజ్యం అమెరికా రాయబారి మార్క్ లిప్పర్ట్ పై ఓ సాయుధ దుండగుడు కత్తితో దాడి పాల్పడ్డాడు. ఉదయం అల్పాహార సమయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న ఆయనపై సాయుధ దుండగుడు దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో లిప్పర్ట్  ముఖంపై చేతిపై తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన రాయబారి లిప్పర్ట్ ను ఆసుపత్రికి తరలించారు.  కాగా లిప్పర్ట్  ప్రాణానికేమీ ప్రమాదం లేదని  వైద్యులు తెలిపారు.  

మరోవైపు భద్రతా సిబ్బంది దాడి చేసిన దుండగుడిని అదుపులోకి తీసుకున్నారు. కిమ్ కీ జాంగ్ అనే 55 ఏళ్ల సాయుధ దుండగుడు అమెరికా రాయబారిపై లిప్పర్ట్ పై దాడికి పాల్పడ్డాడు. దాడి చేసి పారిపోతున్న క్రమంలో అతని కాలి మడవ వద్ద ఎముక విరిగిందని భద్రతాధికారులు తెలిపారు. దాడి జరుగగానే దుండగుడిని బూటు కాళ్లతో మెడపై తోక్కిన భద్రతా దళాలు అదుపులోకి తీసుకునే వరకు అలానే వుంచారు,

కాగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. ఆయన లిప్పర్ట్ తో ఫోన్ లో మాట్లాడారు.  త్వరగా కోలుకోవాలని ఒబామా ఆకాంక్షించారు. ఈ దాడిని  సౌత్  కొరియా- అమెరికా  మైత్రిపై జరిగిన  దాడిగా  సౌత్ కొరియన్ ప్రెసిడెంట్  అభివర్ణించారు. మరోవైపు  ఉత్తర, దక్షిణ కొరియా ఏకం కావాలంటూ దుండగుడు నినాదాలు చేసినట్టుగా సమాచారం. మరోవైపు దుండగుడి ఇంటిలో తనిఖీలు చేసేందుకు సంబంధిత వారెంట్ల కోసం దక్షిణ కోరియా పోలీసుల అధికారులు వేచి వున్నారు

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : US ambassador  South Korea  wielding attacker  

Other Articles