అండమాన్స్ (Andamans)
ప్రకృతి అందాలను తన ఒడిలో దాచుకున్న ఈ ద్వీపం భూతల స్వర్గంగా పేరుగాంచింది. తన అద్భుతమైన అందంతో పర్యాటకుల్ని ఆకర్షించే ఈ ద్వీపం.. అచ్చం మెడగాస్కర్ ద్వీపాన్ని తలపిస్తుంది. ఏ విధంగా మెడగాస్కర్ అందంగా కనిపిస్తుందో.. దానికి ఏమాత్రం తీసిపోకుండా అండమాన్స్ ఆకర్షణీయంగా కనిపిస్తాయి.