the health benefits of chapatis which contains number of nutrients | healthy food items

Chapati health benefits home remedies best tips

chapati benefits, chapati health benefits, chapati health tips, healthy food items, chapati remedies, home remedies, healthy home remedies, best foods for health

chapati health benefits home remedies best tips : The health benefits of chapatis which contains number of nutrients.

చపాతీలో దాగివున్న ఆరోగ్య ప్రయోజనాలు

Posted: 11/12/2015 01:17 PM IST
Chapati health benefits home remedies best tips

ఉదయం బ్రేక్ ఫాస్టులో చపాతీ తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇటీవల జరిపిన పరిశోధనల్లో భాగంగా.. ఉదయాన్నే చపాతీ తింటే ఆ రోజంతా ఫ్రెష్ గా, ఆరోగ్యంగా వుండటంతోపాటు అన్ని కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటారని వెల్లడైంది. అందుకే.. వాటిని రెగ్యులర్ గా తీసుకోవాల్సిందిగా వారు సూచిస్తున్నారు. ఇంతకీ చపాతీలో ఎటువంటి ప్రయోజనాలు దాగివున్నాయో తెలుసుకుందామా...

చపాతీలు తినడం వల్ల శరీరానికి అందే కొవ్వు పదార్థాల స్థాయిలు తక్కువ మోతాదులో వుంటాయి. తద్వారా గుండె సంబంధిత వ్యాధులు తగ్గుముఖం పడతాయి. గోధుమల్లో విటమిన్ బి,ఈ పుష్కలంగా వుంటాయి. అంతేకాదు.. శరీరానికి కావలసిన కాపర్, అయోడైడ్, జింక్, మాగ్నస్, సిలికాన్, ఆర్సెనిక్, క్లోరిన్, సల్ఫర్, పొటాషియం, మేగ్నిషియం, కాల్షియం, మినరల్ సాల్ట్ వంటి పోషకాలు వుంటాయి. ఇవి రోజంతా ఉత్తేజంగా, ఆరోగ్యంగా వుంచడంలో దోహదపడుతాయి. గోధుమల ద్వారా చేసిన చపాతీ తినటం వలన చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. రైస్ తో పోల్చుకుంటే గోధుమలతో చేసిన చపాతీలు త్వరగా, సులభంగా జీర్ణం చెందించబడతాయి. గోధుమలు ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లను పుష్కలంగా కలిగి ఉంటాయి. వీటి వలన శరీరానికి కావలసిన శక్తి వస్తుంది.

చపాతీలో ఐరన్ మూలకం ఎక్కువపాళ్ళలో ఉంటుంది. దీంతో హిమగ్లోబిన్ శాతం పెరుగుతుంది. రక్తహీనత తగ్గుతుంది. చపాతీ తినటం వలన శరీరానికి తక్కువ క్యాలోరీలు అందించబడతాయి. బటర్ లేదా ఆయిల్ లేని చపాతీల నుండి చాలా తక్కువ మొత్తంలో క్యాలోరీలు అందిస్తాయి.  ఫైబర్ లను అధికంగా కలిగి ఉండే చపాతీల వలన జీర్ణం శక్తి పెరుగుతుంది. మలబద్ధకం దానంతట అదే తగ్గుతుంది. ఫైబర్, సెలీనియంలను కలిగి ఉండడం వల్ల చపాతీలు క్యాన్సర్ వ్యాధిని నివారిస్తాయని పరిశోధనలలో కనుగొనబడింది. ఇన్ని ప్రయోజనాలు చపాతీలో దాగి వున్నాయి కాబట్టి.. వాటిని రెగ్యులర్ గా తీసుకోవాల్సిందిగా నిపుణులు సలహా ఇస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chapati health benefits  healthy food items  

Other Articles

  • Digestive biscuits danger to health

    డైజెస్టివ్ బిస్కట్లు.. చాలా ప్రమాదం

    Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more

  • Stay cool without ac

    ఏసీ లేకున్నా చల్లదనానికి మార్గాలు

    Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more

  • Annam chapathi good for health

    అన్నం-చపాతీ.. ఏది ఉత్తమం?

    Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more

  • Great exercises for diabetes people

    మధుమేహానికి.. ఆరోగ్యమే మహాభాగ్యం!

    Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more

  • Energy drinks most dangerous

    ఎనర్జీ డ్రింక్స్.. అసలు మంచిది కాదు

    Dec 20 | ఎన‌ర్జీ డ్రింకులు అధికంగా తాగ‌డం వల్ల బ్రెయిన్ హెమ‌రేజ్ (మెదులో రక్తస్రావం) బారిన ప‌డే అవ‌కాశం ఉంద‌ని నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్ల‌డించింది. అంతేకాకుండా హృద్రోగాలు, ర‌క్త‌నాళాల ప‌నితీరు మంద‌గించ‌డం వంటి ఆరోగ్య... Read more