Young hero siddharth birth day story

young hero siddharth birth day story

young hero siddharth birth day story

12.gif

Posted: 04/17/2012 06:56 PM IST
Young hero siddharth birth day story

              si_inn_1యువ హీరోల్లో ఆత్మవిశ్వాసం తొణికిసలాడే వారెవరంటే సిద్దార్థ్ పేరు టక్కున గుర్తొస్తుంది. తనే మనుకుంటున్నాడో నిర్మొహమాటంగా చెప్పగలిగే సామర్థ్యం ఆయన సొంతం. తప్పు అనుకుంటే ఎలాంటి జంకూ బొంకు లేకుండా నిర్ద్వందంగా ఖండించగలిగే స్వభావం ఆయనది. ఈ తరహా కొంత ఇబ్బందులు కలిగించినప్పటికినీ ఏమాత్రం లక్ష్య పెట్టక,  తనదైన పందాలో  చిత్రసీమలో దూసుకుపోతున్నాడీ యంగ్ హీరో.
             si_22inn2233 సిద్దార్ధ్ నేటితో 33 వసంతాలు పూర్తి చేసుకుని నవ వసంతంలోకి అడుగిడుతున్నాడు.  ఏప్రిల్ 17న 1979లో తమిళనాడులోని అయ్యర్ కుటుంబలో జన్మించిన సిద్ధార్థ్ చిన్ననాటి జీవితం అంతా చెన్నై మరియు డిల్లీ లోనే సాగింది. ముంబై లోని ఎస్.పి జైన్ ఇన్స్టిట్యూట్ అఫ్ మేనేజ్ మెంట్ లో ఎమ్ బిఎ పూర్తి చేసిన సిద్ధార్థ్ సినిమాల మీద ఉన్న మక్కువతో ప్రముఖ దర్శకుడు మణిరత్నం వద్ద అమృత వంటి సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసాడు. అనంతరం నటుడిగా తానేంటో నిరూపించుకుటున్నాడు.
                  నట ప్రస్థానం.. సుప్రసిద్ధ దర్శకుడు శంకర్ డైరెక్షన్లో వచ్చిన ‘బోయ్స్’ సినిమా ద్వారా నటుడిగా పరిచయమై ఐటిఎఫ్ఎ బెస్ట్ యాక్టర్ గా మంచి మార్కులు కొట్టేశాడు. అనంతరం ఆయన నటించిన ‘నువ్వొస్తానంటే నేనోద్దంటానా’ చిత్రం ద్వారా ఘన విజయం సొంతం చేసుకున్నాడు. ‘రంగ్ దే బసంతి’ సినిమాలో అద్భుత నటనకుగాను బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డు దక్కించుకున్నాడు.  ‘బొమ్మరిల్లు’ సినిమా ద్వారా ఉత్తమ నటుడిగా తానేంటో నిరూపించుకున్నాడు. ‘ఆట’ సినిమా సిద్దార్థ్ కు లేడీస్ లోనూ, అటు యూత్ లోనూ ఫాలోయింగ్ ను పెంచేసింది. మొన్నటి లవ్ ఫెయిల్యూర్ లో ఏతరహా పాత్రల్లోనైనా జీవించగలడనే భరోసా కల్పించాడు సిద్దు. hero_siddharth2
                   ప్రస్తుతం సిద్ధార్థ్ దీప మెహత డైరెక్షన్లో ‘మిడ్ నైట్స్ చిల్డ్రన్’ ఇంకా, ‘చష్మే బద్ధూర్’,  అలాగే తెలుగులో నందిని డైరెక్షన్లో సమంతాతో ఒక సినిమాలో నటిస్తున్నాడు. అంతేకాదు అటు సింగర్ గానూ, ప్లేబాక్ రైటర్ గానూ  సిద్ధార్థ్ సిద్దహస్తుడు. సిద్దార్థ్ పుట్టిన రోజును పురస్కరించుకుని అతని మిత్రులు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువలా వచ్చిపడుతున్నాయి. అటు సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లోనూ గ్రీడింగ్స్ పరంపర కొనసాగుతుంది. సిద్దార్థ్ మరిన్ని మంచి సినిమాలతో తెలుగు చిత్ర సీమలో సుస్థిరంగా వెలిగిపోవాలని మనసారా ఆకాంక్షిస్తోంది ఆంధ్రావిశేష్.కాం..హ్యాపీ బర్త్ డే సిద్దార్థ్....

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Telugu film industry people visit tirumala
Great actress soundarya memories  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles