అక్కినేని కుటుంబం నుంచి మరో వారసుడు అఖిల్ తెరంగేంట్రం చేసేందుకు సిద్ధంగా వున్న విషయం తెలిసిందే! వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో సాయేషా హీరోయిన్’గా నటిస్తోంది. ఈ మూవీని హీరో నితిన్ శ్రేష్ట్ మూవీస్ పతాకంపై నిర్మిస్తున్నాడు. ఇక.. ఇతని ఎంట్రీకోసం నాగార్జున ఎన్నో కష్టాలు అనుభవించిన విషయం విదితమే! మంచి కథతోపాటు సక్సెస్ ఫుల్ దర్శకుడితో ఎంట్రీ ఇవ్వాలనుకున్నట్లుగానే అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకున్నారు. ఫిబ్రవరి 16వ తేదీ నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
అయితే.. తన తనయుడు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇస్తున్నాడన్న విషయాన్ని అభిమానులకు చేరవేసేందుకు నాగార్జున ఓ భారీ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు రంగం సిద్ధం చేశారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14వ తేదీన హైదరాబాదులోని మాధాపూర్ శిల్పకళావేదిక ఆడిటోరియంలో ఈ పరిచయ కార్యక్రమం పెద్ద ఎత్తున చేశారు. ఈ సందర్భంగానే షూటింగును కూడా లాంఛనంగా ప్రారంభిస్తారని సమాచారం! ఈ వేడుకలోనే చిత్రకథానాయిక అయిన సాయేషా సైగల్ ను కూడా అభిమానులకు పరిచయం చేస్తారు. ఈ వేడుకల కార్యక్రమాలకు కావలసిన అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకున్నారు.
మొదటి సినిమాతోనే సక్సెస్ ఫుల్, స్టార్ హీరోగా అఖిల్ ఎదగాలన్న ఉద్దేశంతోనే నాగార్జున ఈ గ్రాండ్ ‘పరిచయ’ పార్టీని సిద్ధం చేసినట్లు సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఏదైతేనేం.. అఖిల్ ఎంట్రీ కోసం ఆయన కుటుంబసభ్యులతోపాటు ఇటు టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more
Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more
Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more
Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more
Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more