Mithali Sets Record to Captain Most Women ODIs చరిత్ర సృష్టించిన మన మిథాలీ..

Mithali raj sets record to captain most women odis

Mithali Raj, Jhulan Goswami, captian, 300 wicket taker, BCCI, bowling records,cricket records,india odi bowling records,india women cricket team,indian cricket records,jhulan goswami,mithali raj,women cricket records, cricket

India captain Mithali Raj set a record of captaining the most number of matches in Women’s ODI cricket. The first ODI was Mithali’s 118th match as a captain.

చరిత్ర సృష్టించిన టీమిండియా మహిళా సారధి..

Posted: 09/12/2018 08:52 PM IST
Mithali raj sets record to captain most women odis

హైదరాబాదీ అమ్మాయి, భారతీయ మహిళా క్రికెట్‌ కెప్టెన్‌ మిథాలీరాజ్‌ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. అంతర్జాతీయ మహిళా క్రికెటర్ గా రాణించి ఇప్పటికే పలు రికార్డులను అందుకున్న అమె తాజాగా అత్యధిక వన్డేలకు నాయకత్వం వహించిన సారధిగా కూడా కొత్త రికార్డును అందుకుని చరిత్ర సృష్టించారు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్ తో మిథాలీ ఈ మైలురాయిని అందుకున్నారు.

ఇప్పటి వరకు 195 వన్డేలు ఆడిన మిథాలీ 118 వన్డేలకు సారధిగా వ్యవహరించారు. ఈ ఘనత సాధించడం ద్వారా ఇంగ్లండ్‌ మాజీ మహిళా క్రికెటర్‌ చార్లెస్‌ ఎడ్వర్ట్‌ (117 వన్డేలు) పేరిట ఉన్న రికార్డును అమె బ్రేక్ చేశారు. ఆస్ట్రేలియా మాజీ మహిళా క్రీడాకారిణి బెలిండా క్లార్క్‌ (101) మూడో స్థానంలో ఉన్నారు. అంతర్జాతీయ మహిళా క్రికెట్ లో ఇప్పటి వరకు వందకు పైగా వన్డేలకు నాయకత్వం వహించింది ఈ ముగ్గురే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mithali Raj  Jhulan Goswami  captian  300 wicket taker  BCCI  sports  cricket  

Other Articles