నేను క్రికెటర్ కావాలన్నది నా తండ్రి కల: భజ్జీ It was my father's dream to make me a cricketer: Harbhajan Singh

It was my father s dream to make me a cricketer harbhajan singh

harhajan singh, off spinner, Team india, records, bcci, cricket news, cricket

India's veteran off-spinner Harbhajan Singh says it was his late father Sardar Sardev Singh's dream to see him become a cricketer.

నేను క్రికెటర్ కావాలన్నది నా తండ్రి కల: భజ్జీ

Posted: 01/08/2017 02:25 PM IST
It was my father s dream to make me a cricketer harbhajan singh

ప్రస్తుతం టీమిండియా జట్టలో అవకాశాలు రాని అఫ్ స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్, తనను క్రికెటర్ కావాలని ప్రోత్సహించి, ప్రేరేమించారని తన దివంగత తండ్రి సర్థార్ సర్ దేవ్ సింగ్ ను గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం పాపులర్ సింగింగ్ రియాల్టీ షో  'ద వాయిస్ ఇండియా సీజన్ 2' లో హర్భజన్ సింగ్ అలరించేందుకు సిద్ధమయ్యాడు. ఈ కార్యక్రమంలో పోటీదారుగా ఉన్న ఫర్హాన్ ఖాన్ కోసం తాను ఈ షోలో పాల్గొంటున్నట్లు భజ్జీ  తెలిపాడు.

ప్రస్తుతం  జీవితంలో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్న ఫర్హాన్ ఖాన్ జీవితం తరహాలోనే తన బాల్యం కూడా సాగిందంటూ ఆనాటి జ్ఞాపకాల్ని భజ్జీ గుర్తు చేసుకున్నాడు. 'ఫర్ఖాన్ ఖాన్ పాడుతుంటే ఒళ్లు పులకరించి పోతుంది. ఆ 19 ఏళ్ల కుర్రాడు స్టేజ్పై ఎప్పుడూ పాడినా అతని పాటకి ముగ్ధుడ్ని అయిపోతాను. ఫర్ఖాన్ ఖాన్ కుటుంబ సభ్యుల ఆశీర్వాదం అతనికి ఉంటుందని ఆశిస్తున్నా. అతను కచ్చితంగా సింగింగ్ ఇండస్ట్రీలో ఒక మార్కును సృష్టిస్తాడు. అతని జీవితానికి నా జీవితం దగ్గరిగా ఉండటంతోనే ఆ  షోలో పాల్గొంటున్నా' అని హర్భజన్ అన్నాడు.

హర్భజన్ సింగ్.. భారత్ క్రికెట్లో ఓ వెలుగు వెలిగిన క్రికెటర్. ప్రత్యేకంగా సౌరవ్ గంగూలీ నేతృత్వంలో సత్తా చాటుకుని భారత్ కు అనేక విజయాల్ని అందించిన ఆఫ్ స్పిన్నర్. దాంతో పాటు ధోని సారథ్యంలోని వరల్డ్ టీ 20(2007), వన్డే వరల్డ్ కప్(2011)లను టీమిండియా గెలవడంలో హర్భజన్ కీలక పాత్ర పోషించాడు. ఇప్పటివరకూ 103 టెస్టులు ఆడిన భజ్జీ 417 వికెట్లు తీసి  అనిల్ కుంబ్లే (619), కపిల్ దేవ్(434) తరువాత స్థానాన్ని ఆక్రమించాడు. అతని కెరీర్లో 236 వన్డేలాడి 265 వికెట్లను సాధించగా, 28 టీ 20ల్లో 25 వికెట్లు తీశాడు. అయితే ప్రస్తుతం ఈ వెటరన్ ఆఫ్ స్పిన్నర్కు అవకాశాలు రావడం లేదు. భారత్ తరపున టెస్టులు, వన్డేలు ఆడి  ఏడాదికి పైగా అయ్యింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : harhajan singh  off spinner  Team india  records  bcci  cricket news  cricket  

Other Articles

 • Dinesh karthik defends indian cricket team spinners after loss

  వారికి అది అరుదైన దురదృష్టకరమైన రోజు

  Oct 23 | ముంబై వేదికగా జరిగిన తొలివన్డేలో టీమిండియా విజయాల పరంపరకు బ్రేకులు పడటం.. అభిమానులకు కాసింత నిరాశనే మిగిల్చినా.. స్పీన్నర్లను కివీస్ బ్యాట్స్ మెన్లు చితకబాదడం కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో వారిని టీమిండియా... Read more

 • Virat kohli reveals reason for hosts defeat in mumbai

  పూర్తి సామర్ధ్యాన్ని ప్రదర్శించలేకపోయాం, అందుకే..

  Oct 23 | ముంబైలోని వాంఖేడ్ స్టేడియం వేదికగా న్యూజీలాండ్ తో జరిగిన తొలి వన్డేలో తమ జట్టు ఓటమి పాలుకావడానికి పూర్తి సామర్థ్యాన్ని ప్రదర్శించకపోవడమేనని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. తమ జట్టు బ్యాటింగ్ లో... Read more

 • Hasan ali pakistan pace sensation becomes no 1 odi bowler in icc rankings

  ఐసీసీ ర్యాకింగ్స్: టాప్ ప్లేస్ లో ఏబీ డెవిలియర్స్...

  Oct 20 | టీమిండియాను వెనక్కి తోసిరాజుతూ సౌతాఫ్రికా అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో ఏకంగా టాప్ ప్లేస్ ను అందుకుంది. ఈ మేరకు ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో సఫారీలు ప్రథమ స్థానానికి... Read more

 • Under observation kapugedera likely to feature in fifth odi

  ఐదో టెస్టుకు అందుబాటులోకి చమర కపుగెదర

  Oct 20 | పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న శ్రీలంక మిడిల్ అర్ఢర్ ప్రముఖ క్రికెటర్ చమర కపుగెదర ఐదో వన్డేకు అందుబాటులోకి రానున్నాడని జట్టు యాజమాన్యం తెలిపింది. యూఏఈ, పాకిస్థాన్ జట్లలో షార్జాలోని  షేక్ జాయెద్... Read more

 • Virender sehwag retaliates sachin tendulkar caught off guard

  బర్త్ డే రోజున కూడా తనదైన స్టయిల్ లోనే వీరూ..

  Oct 20 | వినూత్న ట్వీట్లకు టీమిండియా డాషింగ్ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ పెట్టింది పేరు. అలాంటిది కనీసం ఆయన తన పుట్టిన రోజునైనా వచ్చిన ట్విట్లకు సరిగ్గా సమాధానం చెబుతారా..? లేక ఈ రోజు కూడా జోరుగా... Read more

Today on Telugu Wishesh