మహేంద్రసింగ్ ధోని మకాం ఎందుకు మార్చాడు.? MS Dhoni has shifted to Mumbai with his family

Ms dhoni has shifted to mumbai with his family

ms.dhoni, mumbai, residence, Mumbai's Andheri area, society, Mahendra Singh Dhoni, Mumbai, Andheri, India vs England, cricket news

MS Dhoni is originally from Ranchi but according to reports, the 35-year-old has moved in with his full family in the society, and it has since become one of the most popular property in Mumbai.

మహేంద్రసింగ్ ధోని మకాం ఎందుకు మార్చాడు.?

Posted: 01/12/2017 04:21 PM IST
Ms dhoni has shifted to mumbai with his family

టీమిండియా క్రికెట్ జట్టును విజయపథంలో నడిపించి.. అగ్రభాగన నిలపడంలో క్రియాశీలక పాత్ర పోషించిన జార్ఖండ్ డైనమైట్, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని.. తన జన్మస్థలమైన రాంఛీ నుంచి ముంబైకి మకాం మార్చాడు. మూడేళ్ల క్రితం టెస్టు కెప్టెన్సీ పగ్గాలకు వదులుకున్న ధోని, తాజాగా పరిమిత ఓవర్ల కెప్టెన్సీ పగ్గాలను కూడా వదులుకుంటున్నట్లు ప్రకటించి తన అభిమానులను షాక్ కు గురి చేసిన ధోని ఇకపై తన కుటుంబంతో కలసి ముంబైలో నివసించబోతున్నారు.

అందుకోసం ఇప్పటికే ముంబైలోని అంధేరి ప్రాంతంలోని ఒక పేరొందిన హౌజింగ్ సొసైటీలో నాలుగు ఫ్లాట్స్ను కొనుగోలు చేసిన అయన ఇంత అకస్మాత్తుగా ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారో తెలియడం లేదు. సొసైటీలో కొనుగోలు చేస్తున్న ఇళ్లలోకి ఆయన కుటుంబసభ్యులతో కలిసి మకాం మార్చబోతున్నట్టు తెలుస్తోంది. అయితే టీమిండియాకు తన అవసరం చివరి దశకు వచ్చిందని గ్రహించిన ధోని.. ఇక తాను వ్యాపారాలపై దృష్టి సారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారా..? అన్న ప్రశ్నలు కూడా రేకెత్తుతున్నాయి.  
 
ప్రస్తుతం ఎంఎస్ ధోని జార్ఖాండ్లోని రాంచిలో హర్ము హౌజింగ్ కాలనీలో నివాసం ఉంటున్నారు. స్థానిక బ్రోకర్లు సైతం ఆ సొసైటీ 'ధోని వాలీ' బిల్డింగ్గా లేబ్లింగ్ చేయబోతున్నట్టు రిపోర్టులు పేర్కొన్నాయి. ప్రముఖ బాలీవుడ్ సెలబ్రిటీలు విపుల్ షా, చిత్రాన్గడ సింగ్, ప్రాచి దేశాయ్, ప్రభు దేవా వంటి పలువురు ఇళ్లకి దగ్గర్లో ధోని ఈ ఫ్లాట్లను కొన్నారు. వన్డే, టీ-20 క్రికెట్ జట్ల కెప్టెన్సీ నుంచి వైదొలుగుతున్నట్టు  ప్రకటించిన ధోని ముంబైకి మకాం మార్చడానికి కారణాలు మాత్రం తెలియాల్సివుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles