Vivian Richards praises Virat Kohli for a 'classy knock' of 200

Sir vivian richards in awe of magnificent kohli

india vs west indies, west indies vs india, ind vs wi, wi vs ind, india tour of west indies, india cricket, west indies cricket, virat kohli, Jason Holder, Test series, anil kumble india, kumble cricket, kumble bowling, cricket, sports news, sports

West Indies legend Vivian Richards has lavished praise on Virat Kohli, describing the Indian Test skipper's maiden double century as a 'classy knock'.

విరాట్ కోహ్లీ ఫాన్ క్లబ్ లో చేరిన దిగ్గజ క్రికెటర్..

Posted: 07/23/2016 05:49 PM IST
Sir vivian richards in awe of magnificent kohli

టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అప్రతిహాత ఫామ్ లో కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన అభిమానుల జాబితాలో తాజాగా విండీస్ మాజీ క్రికెటర్ సర్. వివియన్ రిచర్డ్స్ చేరారు. అద్భతమైన ఫామ్‌తో దూసుకుపోతున్న కోహ్లీపై రిచర్డ్స్ పొగడ్తల వర్షం కురిపించారు. మ్యాచ్‌కు ముందు ‘వివియన్ రిచర్డ్స్ ఇంటర్నేషనల్ స్టేడియంలో’ ప్రాక్టీస్‌లో ఉన్న భారత ఆటగాళ్లను కలిశానని, ఆ సందర్భంగా కోహ్లీకి ఆల్ ది బెస్ట్ చెప్పానని రిచర్డ్స్ తెలిపారు.

మొదటి మ్యాచ్‌లో డబుల్ సెంచరీతో చెలరేగిన కోహ్లీ ఆటకు ఆయన కితాబుచ్చారు. కేవలం ఆల్ ది బెస్ట్ చెప్పినందుకు ఇంత పని చేస్తాడని ఊహించలేదని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కోహ్లీ ఆటను ఆస్వాదించడం తనకెంతో ఆనందాన్ని కలిగించిందని తెలిపారు. విరాట్ ఇన్నింగ్స్ చూడని వారు చాలా కోల్పోతారని, తాను తొలిసారి కోహ్లీ ఆటను చూశానని, అదీ డబుల్ సెంచరీతో విజృంభించడం చూశానని విడీస్ క్రికెట్ దిగ్గజం రిచర్డ్స్ తన మనసులోని మాటని బయటపెట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Virat Kohli  West Indies tour  India vs West Indies 2016  Team india  BCCI  cricket  

Other Articles