Harbhajan Singh and Ambati Rayudu involved in ugly spat

Harbhajan singh ambati rayudu fight during match

harbhajan singh ambati rayudu fight, harbhajan rayudu fight, harbhajan singh fight with rayudu, harbhajan singh, ambati rayudu, IPL, mumbai indians, pune super gaints, mi vs rps, rps vs mi, ipl 2016, cricket

Harbhajan Singh and Ambati Rayudu were involved in an ugly on-field spat during the match between Mumbai Indians and Rising Pune Supergiants.

మైదానంలో లొల్లిపెట్టుకున్న అంబటిరాయుడు, హర్భభజన్

Posted: 05/02/2016 12:56 PM IST
Harbhajan singh ambati rayudu fight during match

గేమ్ అన్నాక మాటల యుద్ధం అనేది కామన్. కాగా ప్రత్యర్థులు బాగా రాణిస్తున్న సందర్భంలో, తమ జట్టు ఓటమి అంచులకు చేరుతుందన్న క్రమంలోనో, లేక తమ జట్టు బౌలర్లను ప్రత్యర్థి బ్యాట్స్ మెన్లు చితకకొడుతున్న తరునంలో మాటల యుద్దం సర్వ సాధారణం. అంతేకాదండోయ్ ఒక్కనోక సందర్భాల్లో అవి శృతిమించి బౌతికంగా తెగబడేంతవరకు దారితీస్తాయి, అయితే ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లతోనే కాకుండా సొంత జట్టుకు చేందిన ఆటగాళ్ల మధ్య ఇలాంటి లోల్లి చేటుచేసుకుంటే.. సరిగ్గా అలానే జరిగింది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9లో ఎడిషన్ లో పూణే సూపర్ జయింట్స్, ముంబాయి ఇండియన్స్ మద్య జరుగుతున్న మ్యాచ్ లో ఇలాంటి ఘటనే చోటు చోటుచేసుకుంది. పుణెతో మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఆటగాళ్లైన హర్భజన్ సింగ్, అంబటి రాయుడులు ఆగ్రహావేశాలకు గురికావడంతో స్టేడియంలోని ప్రేక్ష్కులందరూ విస్తుసోయారు. పుణె బ్యాటింగ్ చేసే క్రమంలో పదకొండో ఓవర్ ను హర్భజన్ వేయగా, రాయుడు మిస్ ఫీల్డ్ చేయడంతో ఇద్దరు అగ్రహావేశాలకు గురయ్యారు.

హర్భజన్ వేసిన ఆ ఓవర్ నాల్గో బంతిని పుణె ఆటగాడు సౌరభ్ తివారీ డీప్ మిడ్ వికెట్ మీదుగా ఫోర్ సాధించాడు. అయితే ఆ బంతిని ఆపే క్రమంలో రాయుడు శక్తివంచన లేకుండా పరుగెత్తి అపినా అది తన చేయికి తగిలి మరీ బౌండరీ దాటింది. దీంతో హర్భజన్ సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. అంతటితో ఆగకుండా బంతిని కళ్లతో చూసి పరుగెత్తు అంటూ సైగ చేస్తూ అరిచాడు. హర్భజన్ అలా అనడంతో చిర్రెత్తుకొచ్చిన రాయుడు అంతే దీటుగా స్పందించాడు. అయితే ఏంటి అన్న రీతిలో రాయుడు తిరిగి సమాధానమిస్తూ భజ్జి వద్దకు అవేశంగా వచ్చాడు.

దీనిని గమనించిన హర్భజన్ కూడా అతనికి ఎదురేగి నడుస్తూ వెళ్లాడు. ఇద్దరు ఎదరుపడగానే తాను చేసిన చర్యను క్షమించాల్సిందిగా.. తాను అలా స్పందించి వుండాల్సింది కాదన్నట్లుగా హర్భజన్ అంబటి రాయుడికి చెప్పాడు. హర్భజన్ సముదాయిస్తున్నప్పటికీ రాయుడు కొంత శాంతించిన.. పూర్తిగా మాత్రం తన కోపాన్ని అణిచివేసుకోలేక పోయాడు. అంతే తనకు ఏమీ చెప్పవద్దు అనే రీతిలో అక్కడి నుంచి వెళ్లాడు. అయినా రాయుడి చేతిని పట్టుకున్న హర్భజన్ మరోమారు సముదాయించే ప్రయత్నం చేసినా.. రాయుడు దానిని తిరస్కరించి ఫీల్డ్ లోకి వెళ్లిపోయాడు.

జి, మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : harbhajan singh  ambati rayudu  IPL  mumbai indians  pune super gaints  

Other Articles