Kings XI Punjab skipper Murali Vijay confident of reviving fortunes

Axar patel tricks as kxip make winning start under murali vijay

Murali Vijay, kings xi punjab, David Miller, 2016 IPL, Indian Premier Leagaue, cricket news sports news, sports gallery, cricket news, cricket

Axar Patel spun a web around the Gujarat batsmen and finished with impressive figures of 4/21 in his quota of four overs including a hat-trick

అక్సర్ పటేల్ అద్భుత హ్యాట్రిక్.. కింగ్స్ విజయం

Posted: 05/02/2016 04:50 PM IST
Axar patel tricks as kxip make winning start under murali vijay

స్పిన్నర్ అక్షర్ పటేల్ అద్బుతం చేశాడు. హ్యాట్రిక్ నమోదు చేశాడు. ఆయన బౌలింగ్ ప్రతిభ తమ జట్టు గెలుపుకు కారణమైందని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ మురళీ విజయ్ ప్రశంసలు కురింపించాడు. అక్షర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడని మెచ్చుకున్నాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత విజయ్ మాట్లాడుతూ... 'ఈ రోజు విజయం క్రెడిట్ అక్షర్ కు దక్కుతుంది. గత మ్యాచుల్లో అతడు ఒత్తిడికి గురయ్యాడు. ఈ మ్యాచ్ లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు' అని పేర్కొన్నాడు.

గుజరాత్ లయన్స్ తో జరిగిన మ్యాచ్ లో అక్షర్ 21 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. హ్యాట్రిక్ తో టాప్ ఆటగాళ్లను పెవిలియన్ కు పంపాడు. ఓవర్ మూడో బంతికి డ్వేన్ స్మిత్ (15)ను అవుట్ చేసిన అక్షర్... ఐదు, ఆరు బంతులకు కార్తీక్ (2), బ్రేవో (0)లను పెవిలియన్ పంపించాడు. మరో మూడు ఓవర్ల తర్వాత మళ్లీ బౌలింగ్‌కు దిగిన అక్షర్ తొలి బంతికే జడేజా (11)ను 'హ్యాట్రిక్' వికెట్‌గా అవుట్ చేశాడు. తాను వేసిన ఐదు బంతుల వ్యవధిలో పటేల్ నాలుగు వికెట్లు సాధించడం గోప్ప విషయంగాను మురళీ విజయ్ అభిప్రాయపడ్డాడు.

డేవిడ్ మిల్లర్ ను తప్పించి విజయ్ కు కింగ్స్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది పంజాబ్ కింగ్స్ ఎలెవన్ యాజమాన్యం. అయితే ఈ విషయమై అడిగిన ప్రశ్నకు కూడా ఎలాంటి తడబాటు లేకుండా సమాధానం ఇచ్చాడు ఈ కొత్త కెప్టెన్. మిల్లర్ ఫామ్ లో లేడు కదా, మరి మీరెలాంటి కార్యచరణతో బరిలోకి దిగుతున్నారని అడగ్గా.. ఏ జట్టుకైనా అతడు ఎసెట్ అని పేర్కొన్నాడు. కాగా అక్షర్ తో పాటు పేసర్లు మొహిత్ శర్మ, సందీప్ శర్మ కూడా బాగా బౌలింగ్ చేశారని విజయ్ అన్నాడు. ఏడు మ్యాచ్ లు ఆడిన పంజాబ్ కేవలం 2 మ్యాచుల్లో మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది.

జి, మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cricket  ipl 2016  ipl9  murali vijay  axar patel  hat-trick  IPL  kings XI punjab  

Other Articles