అక్కినేని నాగార్జున కొడుకు నాగ చైతన్య హీరోగా నటించిన ఆటోనగర్ సూర్య ఎట్టకేలకు తెరపై బొమ్మపడటానికి సిద్దమైంది. ఎన్నో అవాంతరాలను దాటుకొని ప్రేక్షుకుల ముందుకు వస్తుంది. దర్శకుడు దేవకట్టా, ఆటోనగర్ నుంచి ,, సిటీలోకి నాగ చైతన్య ఆటోను తెస్తున్నారు. అనూప్ రూబెన్స్ అందించిన ఈ సినిమా ఆడియోకి మంచి రెస్పాన్స్ రావడంతో ఈ రోజు ఈ చిత్ర ప్లాటినం డిస్క్ ఫంక్షన్ చేసారు. ఈ కార్యక్రమంలో నాగ చైతన్య, దేవకట్టా, దిల్ రాజు, అచ్చి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నాగ చైతన్య మాట్లాడుతూ ‘ఈ సినిమా రిలీజ్ కి ఎంతో కష్టపడిన ఫైనాన్సియర్స్, దిల్ రాజుకి నా స్పెషల్ థాంక్స్. ఆలస్యం అయినా సరైన సమయానికే ఈ సినిమా వస్తోంది. దేవకట్టా చాలా బాగా తీసాడు. కచ్చితంగా ఈ మూవీ హిట్ అవుతుందని’ అన్నాడు. ఇక్కడి వరకు అందరు బాగానే చెప్పారు.
కానీ దిల్ రాజ్ మాత్రం అందరికి బిన్నంగా ఢిఫరెంట్ చెప్పటం జరిగింది. సినిమా చూడకుండా కమిట్ అయ్యాను అనే చిన్న టెన్షన్ వల్ల సినిమా షో వేయమంటే రెండు రోజులు టైం తీసుకొని నాకు షో వేసారు. చాలా మంచి మూవీ, కచ్చితంగా సూపర్ హిట్ మూవీ. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సినిమా 27న రిలీజ్ చేయాలని నా వంతు కృషి నేను చేసాను. నా సొంత సినిమాకి కూడా ఎప్పుడు ఇలా కష్టపడలేదు. ముందు చెప్పిన టైంకే సినిమా రేపు రిలీజ్ అవుతోంది.
కానీ సినిమా మొత్తం చివరి 25 నిమిషాలపైన ఆధారపడి ఉంటుందని, అది ఆటోనగర్ సూర్యకు హైలైట్స్ అని దిల్ రాజ్ చెప్పటం జరిగింది. దిల్ రాజ్ మాటల్లో ఎంత నిజం ఉందో తెలుసుకోవాలంటే.. ఆటోనగర్ సూర్య తప్పకుండా చూడాల్సిందే.
RS
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more