ఈడు గోల్డెహె రివ్యూ | Eedu Gold Ehe movie review

Teluguwishesh ఈడు గోల్డెహె ఈడు గోల్డెహె Sunil's Eedu Gold Ehe movie review. Product #: 78210 2.75 stars, based on 1 reviews
  • చిత్రం  :

    ఈడు గోల్డెహె

  • బ్యానర్  :

    ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడక్షన్

  • దర్శకుడు  :

    వీరూ పోట్ల

  • నిర్మాత  :

    రామ బ్రహ్మం సుంకర

  • సంగీతం  :

    సాగర్ మహతి

  • సినిమా రేటింగ్  :

    2.752.75  2.75

  • ఛాయాగ్రహణం  :

    దేవరాజ్

  • ఎడిటర్  :

    మార్తాండ్ కే వెంకటేష్

  • నటినటులు  :

    సునీల్, సుష్మారాజ్, రిచా పనయ్, జయసుధ, పునీత్ ఇస్సార్, పృథ్వీ, షకలక శంకర్ తదితరులు

Eedu Gold Ehe Movie Review

విడుదల తేది :

2016-10-07

Cinema Story

అనాథ అయిన బంగార్రాజు ఎక్కడ పని దొరికితే అక్కడ ఉంటూ కాలం వెల్లదీస్తుంటాడు. అయితే అతని మంచితనంతో యజమానులు ఇబ్బంది పడుతూ ఉంటారు. చివరకు ఓ పెద్దావిడ(జయసుధ) మాత్రం అతన్ని పెద్ద కొడుకుగా భావించి ఆశ్రయం ఇస్తుంది. ఆ ఇంటి వ్యవహారాలన్నింటిని బంగార్రాజే చూసుకుంటాడు. ఇంతలో అనుకోని ట్విస్ట్ మహదేవ్ అనే మాఫియా గ్యాంగ్ లీడర్ బంగార్రాజు వెంటపడుతూ ఉంటాడు. ఆ అటాక్ తో షాక్ తిన్న అతను పరుగులు పెడుతుంటాడు. చివరకు అసలు కారణం తెలిసి, దానికి కారణమైన వాళ్ల కోసం వెతకటానికి వెళ్తాడు. ఈ క్రమంలో అతను ఎదుర్కునే పరిస్థితులు ఏంటి? మాఫియా గ్యాంగ్ నుంచి ఎలా తప్పించుకుంటాడు. తన జీవితంలోకి ప్రవేశించిన గీత(సుష్మారాజ్) ప్రేమను ఎలా పొందుతాడు అన్నదే కథ. 

cinima-reviews
ఈడు గోల్డెహె

కమెడియన్ నుంచి హీరోగా మారాక కెరీర్ లో ఫాస్ట్ గా హిట్లు కొట్టిన సునీల్ ఇప్పుడు రేసులో వెనుకబడ్డాడు. జస్ట్ యావరేజ్ చిత్రాలను అందిస్తూ వస్తున్నాడు. ఈ యేడాది వచ్చిన సీరియస్ సినిమా కృష్ణాష్టమి దెబ్బకొట్టడం, కాస్త యాక్షన్ తో వచ్చిన జక్కన్న ఆశించిన విజయాన్ని అందించకపోవటంతో మళ్లీ కామెడీపైనే పడ్డాడు.

బిందాస్, రగడ లాంటి చిత్రాలను తీసిన వీరూపొట్ల దర్శకత్వంలో ఈడు గోల్డెహే అంటూ ఈరోజు థియేటర్లలో సందడి చేసేందుకు వచ్చాడు. మరి ఈ ట్విస్ట్ లతో కూడిన కామెడీ థ్రిల్లర్ సునీల్ ఏమేర అలరించాడో చూద్దాం.

విశ్లేషణ:

ఒక క్యారెక్టర్, నాలుగు ట్విస్ట్ లు, ఓ మూడు జోకులు ఇది సింపుల్ గా ఈడు గోల్డెహె కథ. చెప్పుకోవడానికి మంచి కథ ఉంది, అదిరిపోయే ట్విస్ట్‌లు ఉన్నాయి. కానీ, సమస్య అంతా వాటన్నింటినీ కలిపే బలమైన స్క్రీన్‌ప్లే లేకపోవటమే. సినిమా ఫ్లోలో ఉండగా ఇంటర్వెల్‌ , ప్రీ క్లైమాక్స్, మరి ముఖ్యంగా క్లైమాక్స్‌లలో వచ్చే షాక్ ఇచ్చేలా ఉంది. ఇవన్నీ ఒక క్యారెక్టర్ చుట్టూ తిరిగే కథలో బాగా సెట్ అవ్వడం కూడా ప్లస్ పాయింట్‌గానే చెప్పాలి. అయితే ఎటోచ్చి వాటన్నింటిని ఒకే పద్ధతి క్రమంలో చూపించడంలో మాత్రం వీరూ పోట్ల తడబడ్డాడు. తనలా ఉన్న మరో వ్యక్తిని వెతుకుంటూ సునీల్ చేసే జర్నీ, అందులో అతను ఎదుర్కునే సమస్యలు అంతా కాస్త డ్రమాటిక్ గా, ఎక్కడో అతని పాత సినిమాల్లో చూశామన్న అనుభూతిని కలిగిస్తాయి.

ఇక నటీనటుల విషయానికొస్తే.... సునీల్ కామెడీతో కితకితలు పెడుతూనే, యాక్షన్ సీన్లలో సీరియస్ నెస్ ను చూపించాడు. అయితే అదంతా ఎప్పటిలాగానే అనిపిస్తుంది. హీరోయిన్లు గ్లామర్ పార్ట్ కి తప్ప ఎందుకూ పనికి రాలేదు. రొమాంటిక్ ట్రాక్ అస్సలు సూట్ అవ్వలేదు. ఉన్నంతలో జయసుధ, థర్టీ ఇయర్స్ పృథ్వీ, షకలక శంకర్ ఆకట్టుకుంటారు. పోసాని ట్రాక్ బలవంతంగా ఇరికించినట్లు ఉంది. విలన్ పాత్ర పేలలేదు.

టెక్నికల్ గా... మణిశర్మ కొడుకు సాగర్ మహతి అందించిన పాటల్లో అంతగా గుర్తుండవు. తండ్రి ప్రభావం మూలంగానో ఏమో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం బాగా ఇచ్చాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ మాత్రం అస్సలు కుదరలేదు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి.

ఫ్లస్ పాయింట్లు :
కథ
ఇంట్రస్టింగ్ ట్విస్ట్ లు
కామెడీ సీన్లు


మైనస్ పాయింట్లు:
పాటలు
స్క్రీన్ ప్లే

తీర్పు:
మంచి కథను, దానికి తగ్గట్లు కాస్ట్ ను చేతిలో ఉంచుకుని కూడా వీరూ మ్యాజిక్ ఏమీ చేయలేకపోయాడు. అలాగని ఈ కామెడీ ఎంటర్ టైనర్ ని తీసి పారేయలేం కూడా. ఫ్లో లో సినిమా సాగుతుండగా వచ్చే ట్విస్ట్ లు, కథతో సంబంధం లేకుండానే వచ్చే కొన్ని కామెడీ సీన్లు మాత్రం బాగా ఆకట్టుకుంటాయి.

చివరగా... జస్ట్ ఫర్ టైం పాస్

 

Author Info

Bhaskar

పూర్తి పేరు భాస్కర్ గౌడ్ శ్రీపతి.  ఏ వార్త అయినా సరే సింపుల్ గా రాసేందుకు ప్రయత్నిస్తుంటాడు. సమకాలీన రాజకీయాలు, పరిస్థితులపై విశ్లేషణ చేసి వ్యాసాలు రాయటం అదనపు బాధ్యతగా నిర్వహిస్తున్నాడు.  సినిమాలు చూడటం అంటే ఇతనికి ఎక్కువ పిచ్చి.  స్టాంపుల సేకరణ, కాయిన్ కలెక్షన్ ఇతని హాబీలు. సోషల్ మీడియా అప్ డేట్లతో వార్తలు త్వరగతిన అందించడం ఇతని ప్రత్యేకత. అయాన్ రాండ్ నవలలు ఎక్కువగా చదువటం, కార్డూన్లు ఎక్కువ చూడటం చేస్తుంటాడు.