Speedunnodu | Bellamkonda Srinivas | Speedunnodu Review | Sonarika Bhadoria

Teluguwishesh స్పీడున్నోడు స్పీడున్నోడు Get The Complete Details of Speedunnodu Telugu Movie Review. The Latest Telugu Movie Speedunnodu featuring Bellamkonda Sreenivas, Sonarika Bhadoria, Tamanna. Directed by Bheemaneni Srinivas Rao. Music composed by Vasanth and Produced by Bheemineni Sunitha under the banner of Goodwill Films. For More Details Visit Teluguwishesh.com Product #: 72229 3 stars, based on 1 reviews
  • చిత్రం  :

    స్పీడున్నోడు

  • బ్యానర్  :

    గుడ్ విల్ ఫిలిమ్స్

  • దర్శకుడు  :

    భీమనేని శ్రీనివాస్ రావ్

  • నిర్మాత  :

    భీమినేని సునీత

  • సంగీతం  :

    DJ వసంత్

  • సినిమా రేటింగ్  :

    333  3

  • ఛాయాగ్రహణం  :

    విజయ్ ఉలగనాథ్

  • ఎడిటర్  :

    గౌతంరాజు

  • నటినటులు  :

    బెల్లంకొండ శ్రీనివాస్, సోనారిక, తమన్నా, శ్రీనివాస్ రెడ్డి, ప్రకాష్ రాజ్, రావు రమేష్ తదితరులు

Speedunnodu Movie Review

విడుదల తేది :

2016-02-05

Cinema Story

రామగిరి గ్రామ పంచాయితీ పెద్ద వీరభద్రప్ప(ప్రకాష్ రాజ్). వీరభద్రప్ప కొడుకు శోభన్(బెల్లంకొండ శ్రీనివాస్) డిగ్రీ పూర్తయ్యి నాలుగేళ్లయినా కూడా ఎలాంటి పని చేయకుండా తన స్నేహితులతో కలిసి లైఫ్ ను ఎంజాయ్ చేస్తూ వుంటాడు. స్నేహితుల కోసం ఎంత రిస్క్ అయినా చేసే కుర్రాడు శోభన్. శోభన్ ఫ్రెండ్ గిరి(మధు) ఓ అమ్మాయిని ప్రేమిస్తుంటాడు. ఆ అమ్మాయిని గిరితో కలిపే ప్రయత్నంలో ఓరోజు ఆ అమ్మాయిని చూస్తాడు. ఆ అమ్మాయి వాసంతి(సోనారిక బడోరియా). గిరికి వాసంతిలను కలిపే ప్రయత్నంలో శోభన్ తో వాసంతి ప్రేమలో పడుతుంది. కానీ ఆ తర్వాత ఫ్రెండ్స్ సపోర్ట్ తోనే శోభన్-వాసంతిల ప్రేమ మొదలవుతుంది. సీన్ కట్ చేస్తే... వీరి ప్రేమ విషయం వాసంతి ఇంట్లో తెలిసి మొదట సమస్య మొదలవుతుంది. ఇదిలా వుండగానే శోభన్ కు మరికొన్ని సమస్యలు తలెత్తుతాయి. శోభన్ సమస్యలకు మదన్ (కృష్ణచైతన్య), జగన్(కబీర్ సింగ్ దుహన్)లు కారణమవుతారు. అసలు వీరి ప్రేమకు వచ్చిన సమస్య ఏంటి? మదన్, జగన్ లు ఎవరు? వీరికి శోభన్ కు సంబంధం ఏంటి? చివరకు ఈ సమస్యలను శోభన్ ఎలా ఎదుర్కొన్నాడు? అనే అంశాలు వెండితెరమీద చూడాల్సిందే.

cinima-reviews
స్పీడున్నోడు

‘అల్లుడు శీను’ తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకుని, మళ్లీ ప్రేక్షకుల ముందుకొస్తున్న హీరో బెల్లంకొండ శ్రీనివాస్. ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాస్ రావ్ దర్శకత్వంలో శ్రీనివాస్, సోనారిక హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘స్పీడున్నోడు’. గుడ్ విల్ ఫిలిమ్స్ బ్యానర్ పై భీమినేని సునీత నిర్మించిన ఈ చిత్రానికి DJ వసంత్ సంగీతం అందించాడు. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇందులో మిల్కీ బ్యూటీ తమన్నా ‘బ్యాచిలర్ బాబు...’ అనే స్పెషల్ సాంగ్ లో నటించింది. ట్రైలర్ చూస్తుంటే... స్నేహంకోసం ఎంత రిస్క్ అయినా చేసే ఓ సరదా కుర్రాడు అనే కథాంశంతో ఈ సినిమా రూపొందినట్లుగా అనిపిస్తోంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని ‘స్పీడున్నోడు’ నేడు (జనవరి 5) ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి బెల్లంకొండ శ్రీనివాస్ ‘స్పీడున్నోడు’ ఎలా వుందో ఒకసారి చూద్దామా!

ప్లస్ పాయింట్స్:
‘అల్లుడు శీను’ తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ తన రెండవ చిత్రానికి యాక్టింగ్ లో మంచి పర్ఫార్మెన్స్ చూపించాడు. డాన్సులు, ఫైట్స్ సీన్లలో ఇరగదీసాడు. ముఖ్యంగా ఇంట్రడక్షన్ సాంగ్, బెల్లంకొండ, బ్యాచిలర్ బాబు సాంగ్ లలో డాన్సులతో దుమ్ముధులిపేసాడు. అలాగే ఎమోషనల్ సీన్లలో చాలా చక్కగా నటించాడు. స్ర్కీన్ ప్రజెన్స్ బాగుంది. ఇక సోనారిక పల్లెటూరి అమ్మాయి పాత్రలో బాగుంది. లంగావోణిలో చాలా ముద్దుగా బొద్దుగా కనిపించి ఆకట్టుకుంది. పాటల్లో గ్లామర్ ఒలకబోస్తూ తన అందచందాలతో పిచ్చెక్కించేసింది. ఇక స్పెషల్ సాంగ్ తమన్నా తన అందచందాలు, డాన్సులతో అదరగొట్టేసింది.

‘పటాస్’ తర్వాత శ్రీనివాస్ రెడ్డి మరోసారి ఇందులో తనదైన కామెడీతో ప్రేక్షకులను బాగా నవ్వించాడు. సినిమాకు మంచి సపోర్ట్ గా నిలిచాడు. మధు, షకలక శంకర్ ఫ్రెండ్స్ పాత్రలో పర్వాలేదనిపించారు. పోసానీ, పృద్వీరాజ్ అక్కడక్కడా నవ్వించారు. ఇక ముఖ్య పాత్రలో నటించిన ప్రకాష్ రాజ్, రావు రమేష్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేసారు. చైతన్య కృష్ణ, కబీర్ సింగ్ లు నెగెటివ్ షేడ్స్ లో ఆకట్టుకున్నారు. మిగతా నటీనటులు వారి వారి పాత్రల మేరకు పర్వాలేదనిపించారు.

స్నేహానికి వున్న గొప్పతనానికి, ఓ ప్రేమకథను జోడించి ఓ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో చెప్పడం చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా సరదాగా ఎంటర్ టైనింగ్ గా సాగుతుంది. ఫ్రెండ్స్, అల్లరి, లవ్, కామెడీ అంశాలతో చాలా ఎనర్జీతో ఎంటర్ టైనింగ్ గా నడుస్తుంది. సెకండ్ హాఫ్ లో కాస్త కామెడీ తగ్గినప్పటికీ ఎమోషనల్ మూడ్ లో సాగుతూ వుంటుంది.

మైనస్ పాయింట్స్:
ఇది ఓ రీమేక్ సినిమా కాబట్టి.. మన నేటివిటీకి తగ్గట్లుగా కొన్ని కొన్ని సీన్లను సరైన విధంగా మార్పులు చేయడంలో మిస్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఇక ఈ సినిమాకు సెకండ్ హాఫ్ కాస్త మైనస్ పాయింట్. సెకండ్ హాఫ్ లో బాగా సాగదీసినట్లుగా అనిపిస్తుంది. దాదాపు 15 నిమిషాలు కట్ చేసిన కూడా సినిమా వేగం పెరిగి మరింత బాగుండేది. అలాగే ఎంటర్ టైన్మెంట్ కూడా కాస్త తగ్గినట్లుగా అనిపిస్తుంది. మొత్తానికి పర్వాలేదనిపించేలా వుంది.

సాంకేతికవర్గం పనితీరు:
విజయ్ ఉలగనాథ్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సినిమా మొత్తం విజువల్స్ పరంగా చాలా గ్రాండ్ గా వుంది. యాక్షన్, సాంగ్స్ సీన్లలో అదుర్స్. డిజే వసంత్ అందించిన సాంగ్స్ బాగున్నాయి. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమాకు బాగా హెల్ప్ అయ్యింది. ఇక పాటలకు కొరియోగ్రఫి కూడా చాలా బాగుంది. డాన్సులు అదరగొట్టేసారు. కిరణ్ కుమార్ ఆర్ట్ వర్క్ బాగుంది. కథనం, దర్శకత్వం బాధ్యతలను డీల్ చేసిన భీమనేని శ్రీనివాస్ రావు.. స్ర్కీన్ ప్లే విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకొని వుంటే బాగుండేది. రీమేక్ సినిమా కాబట్టి తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా మరింత కేర్ తీసుకొని వుంటే బాగుండేది. ఇక ఈ సినిమాను భీమనేని శ్రీనివాస్ రావు చాలా చక్కగా తెరకెక్కించాడు. గౌతంరాజు ఎడిటింగ్ విషయంలో మరింత శ్రద్ధ తీసుకొని సెకండ్ హాఫ్ లో అక్కడక్కడ కట్ చేసివుంటే సినిమా వేగం పెరిగేది. ఇక భీమనేని సునీత నిర్మాణ విలువలు సూపర్బ్. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు కూడా చాలా గ్రాండ్ గా వుండే విధంగా భారీ బడ్జెట్ తో నిర్మించినట్లుగా కనిపిస్తుంది.

చివరగా:
‘స్పీడున్నోడు’: కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్.