Mayuri Movie Review | Nayanthara Mayuri Review | Mayuri Movie Review And Rating

Teluguwishesh మయూరి మయూరి Get information about Mayuri Telugu Movie Review, Mayuri Movie Review, Nayanthara Mayuri Movie Review, Mayuri Movie Review And Rating, Mayuri Telugu Movie Talk, Mayuri Telugu Movie Trailer, Nayanthara Mayuri Review, Mayuri Telugu Movie Gallery and more only on TeluguWishesh.com Product #: 68261 3 stars, based on 1 reviews
  • చిత్రం  :

    మయూరి

  • బ్యానర్  :

    సి.కె.ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లి. అండ్ శ్రీ శుభశ్వేత ఫిలింస్

  • దర్శకుడు  :

    అశ్విన్ శరవణన్

  • నిర్మాత  :

    శ్వేతలానా, వరుణ్, తేజ, సివిరావు

  • సంగీతం  :

    రాన్ ఎథన్ యోహన్

  • సినిమా రేటింగ్  :

    333  3

  • ఛాయాగ్రహణం  :

    సత్యన్ సూర్యన్

  • ఎడిటర్  :

    టి.ఎస్.సురేష్

  • నటినటులు  :

    నయనతార, ఆరి, అంజాద్ ఖాన్, రోబో శంకర్ త‌దిత‌రులు

Mayuri Movie Review

విడుదల తేది :

2015-09-17

Cinema Story

మాయవనం అనే ఒక భయంకరమైన ప్రదేశం. ఈ ప్రదేశంపై పలు పరిశోధనలు జరగడమే కాకుండా ‘మాయ’ అనే ఒక పేరుతో సినిమా కూడా రూపొందుతుంది. ఇదిలా వుండగా... ఒక అడ్వటైజింగ్ కంపెనీలో జూనియర్ ఆర్టిస్ట్ మయూరి(నయనతార). తన భర్త వికాస్(ఆరి) నుంచి విడాకులు తీసుకొని కూతురితో పాటు ఒంటరిగా జీవిస్తుంటుంది. అయితే ఒకరోజు ‘మాయ’ సినిమా గురించి తెలిసి, ఆ సినిమాను చూస్తుంది.

 

అయితే ఈ సినిమా చూస్తున్నప్పుడే తనకు, ఆ సినిమాకు ఒక సంబంధం వుందనే విషయం తెలుస్తుంది. అసలు మాయ ఎవరు? మయూరి ఎవరు? మాయకు మయూరికి వున్న సంబంధం ఏంటి? మాయ సినిమా చూసిన తర్వాత మయూరి జీవితంలో వచ్చిన మార్పులేంటి? చివరకు ఏం జరిగింది? అనే ఆసక్తికర అంశాలను వెండితెర మీద చూస్తేనే బాగుంటుంది.

cinima-reviews
మయూరి

నయనతార ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘మయూరి’. సి.కె.ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లి. అండ్ శ్రీ శుభశ్వేత ఫిలింస్ పతాకంపై అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో శ్వేతలానా, వరుణ్, తేజ, సివిరావు సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రాన్ని వినాయక చవితి సంధర్భంగా సెప్టెంబర్ 17న విడుదల చేస్తున్నారు.

ఒక హర్రర్ సినిమాను ఒంటరిగా చూసి భయపడకుండా వుంటే 5 లక్షలు బహుబతి ఇస్తామనేది ఈ చిత్రంలోని కాన్సెప్ట్. అలాంటి డిఫరెంట్ కాన్సెప్టుతో రూపొందిన ఈ సినిమా డెఫినెట్ గా అందర్నీ భయపెడుతుందన్న నమ్మకంతో సినిమాలోనే కాన్సెప్టునే మేము కూడా ప్రేక్షకులకు చెప్తున్నాం. ఎవరైనా ఒంటరిగా ఈ సినిమా చూసి పల్స్ రేట్ డౌన్ కాకుండా, బి.పి. పెరగకుండా నార్మల్ గా వుంటే వారికి 5 లక్షలు బహుమతిగా ఇస్తాం అని సి.కె.ఎంటర్ టైన్మెంట్స్ అధినేత సి.కళ్యాణ్ చెప్పుకొచ్చారు.


Video Courtesy : Redicon Trailers

ఇప్పటికే విడుదలైన ట్రైలర్లకు భారీ రెస్పాన్స్ వస్తోంది. విజువల్ ఎఫెక్ట్స్ తో ప్రతి క్షణం భయపెడుతూ, థ్రిల్ కు గురిచేసే విధంగా రూపొందిన ఈ చిత్రం తప్పకుండా మంచి విజయం సాధిస్తుందని చిత్ర యూనిట్ భారీగా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళంలో విడుదల చేయనున్నారు. మరి ఈ సినిమా ఎలా వుందో ఒకసారి చూద్దామా!

ప్లస్ పాయింట్స్:

‘మయూరి’ చిత్రానికి మేజర్ ప్లస్ పాయింట్ నయనతార యాక్టింగ్. సినిమా మొత్తాన్ని తన భుజాలపై వేసుకుందని చెప్పుకోవచ్చు. తన పాత్రలో నయనతార అద్భుతంగా నటించింది. ముఖ్యంగా కొన్ని కొన్ని సన్నివేశాలలో తన హవాభావాలతో కట్టిపడేసింది. ప్రేక్షకులు కూడా థ్రిల్ కు గురయ్యే విధంగా నయనతార యాక్టింగ్ సూపర్బ్. ఇక మిగతా నటీనటులు వారి వారి పాత్రల మేరకు అద్భుతంగా నటించారు. సినిమా మొత్తం కూడా భారీ హర్రర్, థ్రిల్లర్ అంశాలతో బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో థ్రిల్లింగ్ సన్నివేశాలతో తెగ భయపెట్టేసాయి. హర్రర్, థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ‘మయూరి’ తెగ నచ్చేస్తుంది.

మైనస్ పాయింట్స్:

‘మయూరి’ సినిమా కథలోనే అక్కడక్కడ కాస్త క్లారిటీ మిస్ అయ్యింది. ఇక సెకండ్ హాఫ్ లో మరీ సాగదీసినట్లుగా అనిపిస్తాయి. అంతే కాకుండా క్లైమాక్స్ ఇంకా బోర్ ఫీలయ్యేలా అనిపిస్తుంది. అంతే కాకుండా సెకండ్ హాఫ్ లో నయనతార పాత్రకు తగిన ప్రాధాన్యత లేకుండా పోయింది. దీంతో సెకండ్ హాఫ్ లో నయనతార చాలా తక్కువ సన్నివేశాల్లో మాత్రమే కనిపిస్తుంది. అలాగే సెకండ్ హాఫ్

సాంకేతికవర్గ పనితీరు:

దర్శకుడు అశ్విన్ శరవణన్ ఎంపిక చేసుకున్న కథ చాలా బాగుంది. కానీ కథలో అక్కడక్కడ కాస్త క్లారిటీ ఇచ్చుంటే సినిమా మరింత అద్భుతంగా వచ్చేది. కానీ ఓ హర్రర్, థ్రిల్లర్ చిత్రానికి కావలసినన్ని సీన్లు ఇందులో బాగా చూపించారు. దర్శకుడిగా అశ్విన్ శరవణన్ విజయం సాధించాడు. నటీనటుల నుంచి మంచి ప్రతిభ రాబట్టుకోగలిగాడు. ఇక రాన్ ఎథన్ యోహాన్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకు ప్రాణంలా నిలిచింది. ప్రతి సన్నివేశంలో ఆ థ్రిల్లింగ్ ఫీల్ ను క్యారీ చేసే విధంగా అద్భుతమైన మ్యూజిక్ ను అందించారు. సత్యమ్ సూర్యన్ సినిమాటోగ్రఫి బాగుంది. హర్రర్ సినిమాకు తగ్గట్లుగా చాలా సన్నివేశాలను అద్భుతంగా చూపించారు. విజువల్స్ పరంగా ఆ భయాన్ని మరింత రెట్టింపును చేసాయి. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

చివరగా:
మయూరి: వామ్మో.. తెగ భయపెట్టేస్తోంది!