Teluguwishesh కార్తికేయ కార్తికేయ karthikeya telugu movie review : its tollywood all are descussing about karthikeya movie acted by nikhil and colors swathi in mainlead roles the movie looks like a historic relation to the current trending story nikhil and swathi hopes movie will give success to them here we giving review of this movie Product #: 57265 3.25 stars, based on 1 reviews
  • చిత్రం  :

    కార్తికేయ

  • బ్యానర్  :

    మాగ్నస్ సిని ప్రైమ్ బ్యానర్

  • దర్శకుడు  :

    చందు మండేటి

  • నిర్మాత  :

    వెంకట్ శ్రీనివాస్

  • సంగీతం  :

    శేఖర్ చంద్ర

  • సినిమా రేటింగ్  :

    3.253.253.25  3.25

  • ఛాయాగ్రహణం  :

    కార్తిక్ ఘట్టమనేని

  • ఎడిటర్  :

    కె.శ్రీనివాస్

  • నటినటులు  :

    నిఖిల్ (హీరో), కలర్స్ స్వాతి (హీరోయిన్), తనికెళ్ళ భరణి, రావు రమేష్, కిశోర్, తులసి తదితరులు.

Karthikeya Movie Review

విడుదల తేది :

2014-10-24

Cinema Story

ఈ సినిమా కథ అంతా సుబ్రహ్మణ్యఫురంలోని సుబ్రహ్మణ్యస్వామి ఆలయం చుట్టూ తిరుగుతుంది. పలు కారణాలతో ఈ ఆలయం మూసివేయబడుతుంది. ఇలా ఎందుకు జరిగింది అని తెలుసుకోవటానికి ప్రయత్నించేవారిని అందర్నీ ఓ పాము కాటేసి చంపేస్తుంది. ఇక కథలోపలికి వెళ్తే కార్తిక్ (నిఖిల్) తెలివైన మెడికల్ స్టూడెంట్. పోస్టింగ్ లో భాగంగా స్నేహితులతో కలిసి సుబ్రహ్మణ్యపురంకు వస్తాడు. అక్కడ కార్తిక్ కు విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. వీటిని పరిష్కరించాలని డిసైడ్ అయిన కార్తిక్ ఎలా మిస్టరీని ఛేధించాడు. అసలు పాము అందర్నీ ఎందుకు కాటేస్తుంది. హీరోయిన్ పాత్ర ఏమిటి అనేది తెరపై చూస్తేనే బాగుంటుంది.

cinima-reviews
కార్తికేయ

‘స్వామిరారా’ తర్వాత నిఖిల్-స్వాతి కాంబినేషన్ లో వచ్చిన మూవీ ‘కార్తికేయ’. ఇద్దరు స్టార్లు భారీ అంచనాలు పెట్టుకుని నటించిన ఈ సినిమా దీపావళి మరుసటి రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చందూ మండేటి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ ప్రాజెక్టు యాక్షన్ ఎంటర్ టైనర్ గా అందరూ ముందే ఊహించారు. ఇప్పటివరకు నిఖిల్ కెరీర్ లో అత్యధిక థియేటర్లలో విడుదలైన సినిమా ఇదే. ఈ సినిమాతో తన కెరీర్ టర్న్ అవుతుందని హీరో భావిస్తుండగా.., కొద్దికాలం తగ్గిన ఆఫర్లు తిరిగి వస్తాయని స్వాతి ధీమాగా ఉంది. ఇలా ఇద్దరు చిన్న స్టార్ల పెద్ద మూవీగా పేరున్న ‘కార్తికేయ’ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

కథ :

ఈ సినిమా కథ అంతా సుబ్రహ్మణ్యఫురంలోని సుబ్రహ్మణ్యస్వామి ఆలయం చుట్టూ తిరుగుతుంది. పలు కారణాలతో ఈ ఆలయం మూసివేయబడుతుంది. ఇలా ఎందుకు జరిగింది అని తెలుసుకోవటానికి ప్రయత్నించేవారిని అందర్నీ ఓ పాము కాటేసి చంపేస్తుంది. ఇక కథలోపలికి వెళ్తే కార్తిక్ (నిఖిల్) తెలివైన మెడికల్ స్టూడెంట్. పోస్టింగ్ లో భాగంగా స్నేహితులతో కలిసి సుబ్రహ్మణ్యపురంకు వస్తాడు. అక్కడ కార్తిక్ కు విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. వీటిని పరిష్కరించాలని డిసైడ్ అయిన కార్తిక్ ఎలా మిస్టరీని ఛేధించాడు. అసలు పాము అందర్నీ ఎందుకు కాటేస్తుంది. హీరోయిన్ పాత్ర ఏమిటి అనేది తెరపై చూస్తేనే బాగుంటుంది.

ప్లస్ పాయింట్లు

ఈ సినిమాకు ముఖ్యమైన ప్లస్ పాయింట్ కధ అని చెప్పాలి. ఇప్పుడున్న సినిమాల్లో కధ ఉండటం లేదు. హీరోయిజం, లవ్, కామెడి, యాక్షన్ సీన్లు కలిపేసి తీసి చేతులు కాల్చుకుంటున్నారు. అయితే ‘కార్తికేయ’లో మాత్రం కధ ఉంది. ఈ విషయంలోడైరెక్టర్ ను మెచ్చుకోక తప్పదు. సన్నివేశాలను కళ్లకు కట్టినట్లుగా... మనల్ని పూర్తిగా కధకు దగ్గరగా చేసి చూపించాడు. ఇక సినిమాలో సస్పెన్స్, మైథాలజీ కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది. సినిమాలో ఎమోషన్ తో పాటు కామెడి కూడా ఉంది. దీంతో ఎక్కడా పెద్దగా బోర్ అన్పించదు.  ఇక హీరో నిఖిల్ మెడికల్ స్టూడెంట్ పాత్రలో సెట్ అయ్యాడు. గతంలో కంటే భిన్నంగా అన్ని యాంగిల్స్ నటనా చాలా చక్కగా వచ్చింది. నిఖిల్ నటనకు మంచి మార్కులు వేయవచ్చు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. సినిమాకు ఇదో హైలైట్ అని చెప్పాలి. యాక్షన్ పార్ట్ కు లవ్ ను కలిపి తీసిన విధానం బాగుంది.

మైనస్ పాయింట్లు

‘కార్తికేయ’ మైనస్ పాయింట్ల విషయానికి వస్తే.., స్వాతికి అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదు అని చెప్పాలి. ఇక పెద్ద కథను తీసుకుని రెండున్నర గంటల్లో చెప్పాల్సి రావటంతో ఫస్ట్ ఆఫ్ ను వేగంగా తీసుకెళ్లారు. అయితే సెకండ్ పార్ట్ మళ్ళీ సాగదీశారు. క్లైమాక్స్ కూడా సింపుల్ గా ముగించారు. దీంతో ఇంకొంచెం క్లైమాక్స్ ఉంటే బాగుండేది అని భావించటం జరుగుతుంది.

సాంకేతిక పనితీరు

టెక్నికల్ పరంగా ఈ సినిమా సూపర్ అనే చెప్పాలి డైరెక్టర్ తాను చెప్పాలి అనుకుంది స్పష్టంగా చెప్పగలిగాడు. ప్రజల మనోభావాలకు సంబంధించిన సున్నితమైన అంశాన్ని చాలా తెలివిగా చూపించాడు. ఏ మాత్రం తేడా వచ్చినా ‘కార్తికేయ’ కథ కంచికి చేరేది. అలా జరగకుండా చూసుకున్న చందు మొండేటి పనితనంకు హ్యాట్సాఫ్. ఇక చందుకు టెక్నికల్ సిబ్బంది కూడా సహకరించారు. ముందుగా మ్యూజిక్ విషయం తీసుకుంటే.., శఏఖర్ చంద్ర పాటలు హైలైట్. సినిమాకు మ్యూజిక్ తో నడిపించారు అని చెప్పవచ్చు. బ్రాగ్రౌండ్ మ్యూజిక్, పాటలు రెండూ బాగా వచ్చాయి. ఇక విజయం వెనక సినిమాటోగ్రాఫర్ కార్తిక్ కష్టం చాలా ఉంది. సీన్లను చాలా నీట్ గా, ఫ్రెష్ లుక్ తో తీశాడు. క్వాలిటీ తగ్గకుండా జాగ్రత్తలు తీసుకోవటంతో ఔట్ పుట్ చాలా నీట్ గా వచ్చింది. విజువల్స్ కూడా ‘కార్తికేయ’కు ప్లస్ అని చెప్పాలి. ఇక ఎడిటింగ్ కూడా ఎక్కడా కధకు దెబ్బ రాకుండా కార్తిక్ శ్రీనివాస్ జాగ్రత్తలు తీసుకున్నాడు. ఆర్ట్ డిజైన్స్ కూడా బాగున్నాయి. ఇందుకు సురేష్ కు కంగ్రాట్స్. వెంకట శ్రీనివాస్ నిర్మాణం బాగుంది. చిన్న సినిమా అయినా భారీ బడ్జెట్ లెవల్ లో చూపించారు.

 

చివరగా : కొత్తవారు, చిన్నవారంతా కష్టపడి తీసిన ‘కార్తికేయ’కు ఆ సుబ్రహ్మణ్యుడి ఆశీర్వాదం ఉంది.


కార్తిక్