Teluguwishesh ఆగడు ఆగడు tollywood prince mahesh babu latest aagadu movie review Product #: 56124 3 stars, based on 1 reviews
  • చిత్రం  :

    ఆగడు

  • బ్యానర్  :

    14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్

  • దర్శకుడు  :

    శ్రీనువైట్ల

  • నిర్మాత  :

    రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, సునీల్ సుంకర

  • సంగీతం  :

    ఎస్‌ఎస్ తమన్

  • సినిమా రేటింగ్  :

    333  3

  • ఛాయాగ్రహణం  :

    కె.వి.గుహన్

  • ఎడిటర్  :

    ఎం.ఆర్. వర్మ

  • నటినటులు  :

    మహేష్‌బాబు, తమన్నా, రాజేంద్రప్రసాద్, సోనూసూద్

Aagadu Movie Review

విడుదల తేది :

2014-09-19

Cinema Story

కధ విషయానికి వస్తే.., దూకుడు సినిమాలాగే ఇందులో మహేష్ పోలిస్. అయితే ఆ సినిమాలో మొదటి నుంచే పోలిస్ అయితే., ఇక్కడ మాత్రం సినిమా ప్రారంభం అయ్యాక కొద్ది సేపటికి పోలస్ అవతారం ఎత్తుతాడు. ఇక కధ విషయానికి వస్తే మహేష్ పేరు శంకర్. సినిమాలో శంకర్ ఓ అనాధ.. కాని చాలా తెలివైన అబ్బాయి. శంకర్ తెలివిని చూసిన పోలీస్ రాజ నరసింగరావు (రాజేంద్ర ప్రసాద్) అతన్ని చేరదీస్తాడు. తనలాగే పోలిస్ ఆఫీసర్ చేయాలనుకుంటాడు. ఇక రాజేంద్రప్రసాద్ కు ఓ కొడుకు ( అజయ్) ఉంటాడు. అయితే అనుకోని కారణాల వల్ల శంకర్ ఓ మర్డర్ కేసులో జైలుకు వెళ్తాడు. దీంతో నర్సింగరావు శంకర్ ను దూరం పెడతాడు. అజయ్ ను తనలా పెంచి పెద్ద చేస్తాడు.

అటు జైలుకు వెళ్ళిన శంకర్ బోస్టన్ స్కూల్ లో చదివి పోలీస్ అవుతాడు.. అప్పుడే బుక్క అనే పట్టణంలో విలన్ దామోదర్ (సోనూ సూద్) చేస్తున్న అరాచకాలను అరికట్టడానికి శంకర్ ని బుక్క పట్టణం సిఐగా పంపిస్తారు. ఇక్కడితో సెకండ్ ఆఫ్ సినిమా మొదలవుతుంది. ఇక బుక్కకు వచ్చిన శంకర్ కి షాక్ లాంటి నిజం తెలుస్తుంది. ఇంతకీ ఆ నిజం ఏమిటి.? దామోదర్ ను ఎలా ఎదుర్కున్నాడు. శంకర్ మర్డర్ కేసు నిజా నిజాలేమిటి? మిగతా అంశాలను థియేటర్ కు వెళ్ళి చూడవచ్చు.

cinima-reviews
aagadu movie review

మహేష్ బాబు తాజా చిత్రం ‘ఆగడు’ విడుదలైంది. దూకుడు నుంచి కామెడి క్యారెక్టర్ పెంచుకుంటూ వచ్చిన మహేష్.., అదే పోలిస్ పంధా.., కామెడీ కలిపి తీసిన సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. భారీ అంచనాలతో.., విడుదలకు ముందే సంచలనాలతో వచ్చిందీ సినిమా. 14 రీల్స్ బ్యానర్లో వచ్చిన ఈ సినిమాలో తొలిసారి మహేష్ పక్కన తమన్నా హీరోయిన్ గా నటించగా.., శృతి హాసన్ స్పెషల్ సాంగ్ లో ఆడింది. తెలుగు రాష్ర్టాల్లోనూ దాదాపు రెండు వందలకు పైగా థియేటర్లలో సినిమా విడుదలైంది. మరి ఇంత సంచలనాలను నమోదు చేసుకున్న సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

Cinema Review

ప్లస్ పాయింట్స్ :

తనలో ప్రతి సినిమాలో కొత్తదనం చూపించటానికి ప్రయత్నిస్తున్న మహేష్ ఇందులోనూ బాగా ప్రయత్నించాడు. కొత్త యాటిట్యూడ్, మ్యానరిజం, డైలాగ్ డెలివరీ బాగా ఉన్నాయి. ఫ్యాన్స్ ను ఇవి చాలాబాగా ఆకట్టుకున్నాయి కూడా. మహేష్ పంచ్ డైలాగులు మాట్లాడిన ప్రతి సీనుకు థియేటర్లో ప్రేక్షకులు ఈలలేస్తున్నారు. యాక్షన్ పరంగా మహేష్ లో లోపాలు  చూపలేము. అటు డాన్స్ పరంగా కూడా గతంలో పోలిస్తే కొన్ని కొత్త స్టెప్పులున్నాయి. అటు హీరోయిన్స్ ఇద్దరిది సినిమాలో స్పెషల్ క్యారెక్టరైజేషన్. ముందుగా తమన్నా గురించి చెప్పాలంటే.. ‘ఆగడు’లో ఆమె క్యారెక్టర్ తక్కువ సమయం ఉంటుంది. అయినా సరే ఉన్నంతసేపు ఆడియన్స్ ను అలా తనగురించే ఆలోచించేలా చేసింది. కొత్త డ్రెస్సులు, సాంప్రదాయ లంగీ వోనీలో ఆకట్టుకునేలా ఉంది. సాంప్రదాయంగా ఉన్నా పాటల వరకు వస్తే.., అన్నీ పక్కన బెట్టి.., ప్రేక్షకులకు అందాలను ఆరబోసింది. సినిమా చివర్లో వచ్చే శృతి హాసన్ తానేమి తక్కువ తీసిపోను అన్నట్లుగా.., మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా డాన్స్ చేసింది.

ప్రధాన పాత్రలను పరిశీలిస్తే., మహేష్ తండ్రిగా నటించిన రాజేంద్ర ప్రసాద్ తన వంతుగా సినిమాకు న్యాయమే చేసాడు. కామెడి బ్రహ్మ బ్రహ్మానందం కూడా తనవంతుగా ప్రేక్షకులను నవ్వించి మంచి మార్కులేసుకున్నాడు. ముఖ్యంగా ప్రాసతో కూడిన పంచ్ డైలాగ్స్ బాగున్నాయి. అటు దూకుడు నుంచి మహేష్ తో కన్పిస్తున్న వెన్నెల కిశోర్ ఈ సినిమాలో మహేష్ వెంట మొత్తంగా కన్పిస్తాడు. అయితే పోకిరి సినిమా నుంచి మహేష్ వెంట పూర్తిగా ఉండే నాజర్ తక్కువగా కన్పిస్తాడు. అయినా సరే ఆయన నేపథ్యంగా సాగే సెటైర్లు బాగుంటాయి. ఇక నవ్వుల రాజా పోసాని గురించి చెప్తే నవ్వకుండా ఉండలేము. డైలాగ్స్ డెలీవరి ద్వారా అంతగా నవ్వించాడు.

మైనస్ పాయింట్స్ :

‘ఆగడు’లో ప్లస్ ఎంత ఉందో మైనస్ కూడా అంతే ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా సినిమాకు పెద్ద మైనస్ పాయింట్ కధ. కొత్తగా కధలో చెప్పుకోదగినంతగా ఏమి లేకపోవటం బాగా దెబ్బతీసే విషయం. అదే పోలిస్ గెటప్, అదే చేజింగ్, సేమ్ స్టోరి అన్నట్లుగా భావన వస్తోంది. పోని ఈ మద్య పోలిస్ క్యారెక్టర్ నేపథ్యంగా వచ్చిన ఓ సినిమా హీరోను ఆదర్శంగా తీసుకుని కధను తయారు చేశారా అంటే... ట్విస్టులు సరిగా చూపించలేకపోయారు. దీంతో సినిమాలో తరవాత సీన్ ఏంటనేది ప్రేక్షకులు ముందే చెప్పేసుకుంటున్నారు. గత కాంబినేషన్ సినిమాను సగం కట్ చేసి పెట్టారా అని అనకుంటున్నారు. సినిమా ఫస్ట్ పార్ట్ కామెడి, కాస్త స్టోరితో నింపేసి.. సెకండ్ పార్ట్ మహేష్ ను చూపించటానికి సరిపుచ్చారు. ఫస్ట్ ఆఫ్ నవ్వుకుని బయటకు వెళ్లి వచ్చిన ప్రేక్షకులు ఇంటర్వెల్ తర్వాత కాస్త విసుక్కున్నారు. టైమింగ్ సరిగా లేకపోవటంతో సెకండ్ ఆఫ్ ఇబ్బందిగా అన్పించింది.

సినిమాలో కామెడి చూపించాలని శ్రీనువైట్ల బాగా కష్టపడ్డారు. పంచ్ డైలాగులు.., ప్రాసల కోసం రైటర్లను పట్టు వదలకుండా కూర్చున్నారు. కానీ.., ఆయన కధ విషయాన్ని మాత్రం అంతగా పట్టించుకోలేదు. అందుకే పంచ్ డైలాగ్స్ పేలాయి కాని వాటికి కధతో అసలు సంబంధం లేదు. కొన్నిచోట్ల ఇది స్పష్టంగా కన్పించటం వల్లే.., పేలకుండా ప్రేక్షకుల ముందు ఇబ్బందిపడ్డాయి. అటు మీలో ఎవరు కోటీశ్వరుడు బాగా కష్టపడి తీసినా అంత బాగా లేదు అనేది టాక్. పాత కధను చూపించటంతో బాగా ఎక్కువ సేపు చూపించారు అని ప్రేక్షకులు ఫీల్ అవుతున్నారు.

సాంకేతిక విభాగం :

చివరగా ఇతర విభాగాల పనితీరు చూస్తే.., సినిమా తీసిన డైరెక్టర్ శ్రీనువైట్ల బాగానే కష్టపడ్డాడు. కొందరి పాత్రలు పెంచాడు.. కొందరి పాత్రలు తగ్గించాడు. అయితే ఇక్కడే ఆయన ఓ పొరపాటు చేశాడు. అయితే అది సినిమా తీసేముందు ప్రేక్షకులకు నచ్చుతుంది అనుకున్నాడు కాని అంతగా నాడి పట్టలేకపోయింది. అదేమంటే గతంలో లాగానే సేమ్ స్టోరి క్యారెక్టరైజేషన్ ప్రధాన ఎజెండాగా ఉన్నపుడు ఇందులో కొత్తగా ప్రధానమైన అంశం ఏదైనా ఉండాలి లేదా.., ట్విస్టులను చూపాలి. లేకపోతే పాత సినిమాకు కొత్త సినిమాకు తేడా ఏముంటుంది. అందుకే ఇక్కడ కాస్త దెబ్బయిపోయారు. ఇక నిర్మాత పరంగా 14రీల్స్ బ్యానర్ కూడా బాగానే ఖర్చు పెట్టింది. అది సినిమా చూస్తే ఖచ్చితంగా తెలుస్తుంది.


ఎడిటింగ్ విషయంలో కూడా సినిమా కాస్త నష్టపోయింది. అంటే అంతా అవసరం లేని సీన్లను ఎం.ఆర్. వర్మ పెట్టడం వల్ల నిడివి ఎక్కువ అయి సెకండ్ ఆఫ్ స్లో అయింది. ఇంటర్వల్ తర్వాత చాలా సన్నివేశాలు అంతగా ప్రాధాన్యం లేనివే. వాటిని కట్ చేసి ఉంటే బాగుండేది. రైటర్లు కూడా పంచుల కోసం ప్రాకులాడకుండా సన్నివేశాలకు తగ్గట్లు డైలాగులు రాసి ఉంటే ఏది పెట్టాలో సులువుగా డిసైడ్ చేసేవారు. ప్రాస ఉన్న డైలాగులన్నీ వాడే సరికి సినిమా కధ పెద్దగా అయినట్లు తెలుస్తోంది. మిగతా భాగాలను చూస్తే.,. సినిమాకు ప్రధాన ఆకర్షణ అయిన విజువల్స్ లుక్ బాగుంది. గ్రాండ్ గా అన్పించి ఆకట్టుకుంటుంది. హీరో, హీరోయిన్లనే కాకుండా ప్రతి ఒక్కరినీ బాగా చూపించాడు. లొకేషన్లను కూడా చాలా చక్కగా కవర్ చేయగలిగాడు. ఈ క్రెడిట్ సినిమాటోగ్రాఫర్ కె.వి.గుహన్ కే చెందుతుంది. గుహన్ ఆగడుకు చాలా ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. అటు తమన్ పాటలు కూడా బాగున్నాయి. బ్యాగ్రౌండ్ మ్యూజిక్, ఆర్.ఆర్. కూడా సెట్ అయ్యేలా కంపోజ్ చేశారు. డాన్స్ కోసం రక్షిత్, ప్రేమ చేసిన కష్టం  ఫలించిందని చెప్పవచ్చు.

క్లుప్తంగా చెప్పాలంటే.. ::

ప్రేక్షకుల భారీ అంచనాలను సినిమా అందుకోలేకపోయింది. కధ పరంగా కాస్త వెనకబడింది. డైరెక్టర్ వల్ల ఇలా జరిగిందని తెలుస్తోంది. అయితే ఆయన ఏదో చూపించాలని ప్రయత్నించినా.., అది పెద్ద విషయం కాకపోవటం వల్ల ప్రేక్షకులు అంతగా పట్టించుకోవటం లేదు. నటన పరంగా, మహేష్ బాబు కొత్త మ్యానరిజం, డైలాగ్ డెలివరి, హీరోయిన్ నటన, గ్లామర్, స్పెషల్ సాంగ్ అంతా బాగుంది. ఇక కామెడి గురువులు కూడా తమ వంతు న్యాయం చేశారు. ప్రధాన పాత్రలు కూడా ఎక్కడా లోపాలను చూపలేము. అయితే కధ మాత్రం తీవ్రంగా దెబ్బకొట్టంది. అంతా బాగా చేసినా.. కధ విషయానికి వచ్చే సరికి ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఓవరాల్ గా చెప్పాలంటే సినిమా ఓకే. కాని బెస్ట్ కాదు. ఇప్పటికిప్పుడు రిలీజ్ అయ్యే సినిమాలు ఏవి లేకపోవటం వల్ల ఈ సినిమా మాత్రం కలెక్షన్లను వసూలు చేస్తుందని చెప్పవచ్చు.

 

కార్తిక్

Movie TRAILERS

ఆగడు

play