Teluguwishesh ఉలవచారు బిర్యాని ఉలవచారు బిర్యాని Ulavacharu Biryani Review, Ulavacharu Biryani Telugu Movie Review, Ulavacharu Biryani Movie Review and Rating, Telugu Ulavacharu Biryani Review, Ulavacharu Biryani Movie Stills, Ulavacharu Biryani Movie Trailer, Videos, Gallery, Wallpapers and more on Teluguwishesh.com Product #: 53287 2/5 stars, based on 1 reviews
  • చిత్రం  :

    ఉలవచారు బిర్యాని

  • బ్యానర్  :

    ప్రకాష్ రాజ్ ప్రొడక్షన్స్

  • దర్శకుడు  :

    ప్రకాష్ రాజ్

  • నిర్మాత  :

    వల్లభ

  • సంగీతం  :

    ఇళయరాజా

  • సినిమా రేటింగ్  :

    2/52/5  2/5

  • ఛాయాగ్రహణం  :

    ప్రీతా

  • ఎడిటర్  :

    కిశోర్

  • నటినటులు  :

    ప్రకాష్ రాజ్, స్నేహా, ఊర్వశి

Ulavacharu Biryani Movie Review

విడుదల తేది :

జూన్ 6, 2014

Cinema Story

కాళిదాసు (ప్రకాష్ రాజ్ ) ఆర్కియాలజీ డిపార్ట్ మెంటులో పనిచేస్తుంటాడు. వయస్సు నాలుగు పదులు పై బడినా ఇంకా పెళ్లి చేసుకోకుండా ఉంటాడు. ఇతగాడు మంచి భోజన ప్రియుడు. భోజనం అన్నా, వంటకాలు అన్నా ఎంతిష్టమంటే ఓసారి పెళ్ళి చూపులకు వెళ్లి అక్కడ చేసిన వంటకాలు తిని తెగ నచ్చేసి, ఏకంగా వాటినే తెచ్చి ఇంట్లపెట్టుకునేంతగా. గౌరి (స్నేహా ) ఈమె డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పనిచేస్తుంటుంది. వయస్సు మూడు పదుల వయస్సు దాటి పోయినా పెళ్లి మాత్రం కాలేదు. ఎన్నో సంబంధాలు చూసినా ఏవో కారణాలతో చెడిపోతుంటాయి. కానీ అనుకోకుండా ఓ రాంగ్ కాల్ వల్ల కాళిదాసుతో పరిచయం పెరిగి, రోజు ఫోన్లలో గంటల తరబడి మాట్లాడుకుంటుంటే ఒకరంటే ఒకరికి తెగ ఇష్టం ఏర్పడుతుంది. ఓ రోజు ఇద్దరు కలుద్దామని అనుకుంటారు. కానీ ఇద్దరికి కలవాలంటే కాస్తంత భయం, బిడియం. అందుకే కాళిదాసు తన మేనల్లుడ్ని, గౌరి తన చెల్లెల్ని పంపుతుంది. అక్కడి వచ్చిన ఈ యువ జంట ఏం చేస్తారు ? వీరిద్దరు ప్రేమలో పడి వారిద్దర్ని కలుపుతారా ? ఈ రెండు జంటల ప్రేమ కథ ఎన్ని మలుపులు తిరుగుతుంది ? అనేది తెర పై చూడాల్సిందే.

cinima-reviews
ఉలవచారు బిర్యాని

తమిళంలో సూపర్ హిట్ అయిన్ ‘సాల్ట్ అండ్ పెప్పర్ ’ సినిమాను ప్రముఖ నట, దర్శక, నిర్మాత అయిన ప్రకాష్ తెలుగులో తాను నటిస్తూ దర్శకత్వం వహించమే కాకుండా నిర్మించాడు. అన్నీ తానై చేసిన ఈ సినిమా ‘ఉలవచారు బిర్యాని ’ అనే టైటిల్ ని పెట్టాడు. దర్శకుడిగా ‘ధోని ’ అనే  సినిమాను తెరకెక్కించిన ఆయన తొలి ప్రయత్నంలో పర్వాలేదనిపించినా ఆ సినిమా డబ్బులు మాత్రం రాలేదు కానీ, ఓ కొత్త రకమైన స్టోరీ ఉన్న సినిమాను చూసిన ఫీలింగ్ మాత్రం జనాల్లో కలిగించాడు. ఆ సినిమా తరువాత మళ్లీ తన టాలెంట్ ను బిర్యాని రూపంలో చూపించాలనుకున్నాడు. మరి ఆయన వండిన ఉలవ చారు కి, బిర్యాని కుదిరి, ప్రేక్షకులకు రుచించిందా ? లేదా ? అనేది ఈ సినిమా రివ్యూ ద్వారా చూద్దాం.

Cinema Review

ఎలాంటి పాత్రల్నైనా తనదైన శైలిలో పోషించే ప్రకాష్ రాజ్ ఈ సినిమాలో కూడా తన నటనతో ఆకట్టుకున్నాడు. భోజన ప్రియుడి పాత్రలో ఆయన నటన అందర్ని ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఇష్టంగా వంటకాల్ని తినేటప్పుడు, తన ప్రేమకు సంబంధించిన విషయాలు ఆలోచించినప్పుడు ఆయన నటన సూపర్ గా ఉంది. ఇక చాన్నాళ్ళ తరువాత తెర మీద కనిపించిన స్నేహా నటనకు ఆస్కారం ఉన్న పాత్రలో నటించింది. హోమ్లీగా కనిపించిడమే కాకుండా, ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకుంది. యువ జంటగా కనిపించిన నవీన్, సంయుక్తల మధ్య మంచి కెమిస్ట్రీ వర్కవుట్ అయ్యింది. ఇక మిగతా పాత్రల్లో నటించిన ఎమ్మెస్ నారాయణ, బ్రహ్మాజీ ఫర్వాలేదనిపించారు. కానీ వారికి, వారి పాత్రలకు కథలో ప్రాముఖ్యత లేదు.

సాంకేతిక విభాగం :

మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజ సంగీతానికి ఎటువంటి వంక పెట్టాల్సిన అవసరం ఉండదు. కానీ ఈ సినిమాలో తన స్థాయికి తగ్గ సంగీతాన్ని అందివ్వలేదనిపిస్తుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇరగదీసే ఇయళరాజా ఈ సినిమాలో మాత్రం బిర్యానీ టేస్టుకు తగ్గట్లు అందించలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రకృతి సౌందర్యాన్ని, వంటలని ప్రీత కెమెరా అందంగా  బంధించింది. ఎడిటింగ్‌ పరంగా చాలా లోపాలున్నాయి. కొన్ని సీన్లలో చేతి వాటం ప్రదర్శించి కత్తిరిస్తే బాగుండేదనిపిస్తుంది.

ప్రథమార్థంలో ప్రకాష్ రాజ్ , స్నేహల మధ్య సన్నివేశాలు బాగున్నా ద్వితీయార్థంలో యువ జంట అయిన తేజస్, సంయుక్తల మధ్య సన్నివేశాలు పండలేదు. మలయాళంలో రూపొందిన ‘సాల్ట్‌ అండ్‌ పెప్పర్‌’ సినిమాకి రీమేక్‌ ఇది. ఆ కథా రచయిత చక్కని ప్రేమకథ రాసుకున్నాడు. అయితే దానిని అనువదించి... అదే ఫీల్‌ తీసుకురావడంలో ఇక్కడి రచయితలు, దర్శకులు విఫలమయ్యారు. ధోని సినిమాతో తన దర్శకత్వ ప్రతిభను కాస్తం నిరూపించుకున్న ప్రకాష్ రాజ్ ఈ సినిమాలో జస్ట్ ఓకే అనిపించుకున్నాడు. నటన పరంగా ఫర్వాలేదనిపించుకున్న ఈయన దర్శకుడిగా మాత్రం అంత సక్సెస్ కాలేక పోయాడు.

చివరగా :

మసలని ఉలవచారు... ఉడకని బిర్యాని...

more