Chiru’s Sye Raa mints Rs 90 crore in Telugu states తెలుగునాట రూ.90 కోట్ల షేర్ రాబట్టిన ‘సైరా’

Sye raa box office day 8 collection chiru s film mints rs 90 crore in telugu states

Sye Raa Narasimha Reddy, Sye Raa 8th day collection, Eighth day collections, Telugu states, sye raa narsimha reddy box office, sye raa chiranjeevi collections, chiranjeevi sye raa 8th day collections, Chiranjeevi, nayantara, amitabh bachchan, surender reddy, Chiranjeevi, Tollywood, Entertainment, Movies

Actor Chiranjeevi’s latest release Sye Raa Narasimha Reddy has struck gold at the box-office with eighth day telugu states share of around Rs 90 crore.

తెలుగునాట రూ.90 కోట్ల షేర్ రాబట్టిన ‘సైరా’

Posted: 10/10/2019 08:18 PM IST
Sye raa box office day 8 collection chiru s film mints rs 90 crore in telugu states

మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రంగా.. ఆయన నటించిన తొలి చారిత్రక చిత్రం తెలుగు రాష్ట్రాలలో సందడి చేస్తోంది. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాంచరణ్ నిర్మించిన 'సైరా నరసింహా రెడ్డి' చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎనమిది రోజులలో తెలుగునాట ఏకంగా 90 కోట్ల షేర్ ను రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక థియేటర్స్ లో ఈ సినిమా విడుదలైంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టింది.

ఈ రెండు రాష్ట్రాల్లో ఈ సినిమా నాలుగురోజుల్లో 100 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా సైరా నరసింహారెడ్డి బాక్సాఫీసులను షేక్ చేసింది. భారతీయ చిత్రాలలో అత్యధిక తొలిరోజు కలెక్షన్లను రాబట్టిన ఐదవ చిత్రంగా కూడా రికార్డును క్రియేట్ చేసింది. అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సైరా ఎనిమిదో రోజు కూడా స్టడీగా కొనసాగుతోంది. ఈ సినిమా 8వ రోజున కూడా తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 5 కోట్ల 80 లక్షల షేర్‌ సాధించి నిలకడగా కొనసాగుతోంది.

చిరంజీవి కెరియర్లో ఇది తొలి చారిత్రక చిత్రం కావడం.. దర్శకుడిగా తనకి వచ్చిన అవకాశాన్ని సురేందర్ రెడ్డి ఛాలెంజింగ్ గా తీసుకోవడం .. భారీ తారాగణం అన్ని కలగవడంతో చిత్రం నిలకడగా ముందుకు సాగుతోంది. ముఖ్యంగా నైజాంలో మెగాస్టార్ మరోసారి తన సత్తా చాటుకున్నాడు. భారీ వసూళ్లతో సాధించిన మెగాస్టార్‌ యంగ్ హీరోలకు సవాల్ విసిరాడు. ఇప్పటికీ సైరా స్టడీగా వసూళ్లు సాధిస్తుండటంతో ముందు ముందు మరిన్ని రికార్డ్‌లు తిరగరాయటం ఖాయం అంటున్నారు అభిమానులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sye Raa  Eight day collections  Telugu states  Chiranjeevi  Ram Charan  Amitabh bachchan  Tollywood  

Other Articles