Kajal Agarwal displeasure over CBFC ‘ఫారిస్ పారిస్’ కత్తెరింపులపై కాజల్ కస్సుబుస్సు..

Kajal agarwal displeasure against kollywood censor board over paris paris cuts

paris paris, kajal agarwal, kajal agarwal paris paris movie, kajal agarwal on censored cuts, paris paris censor cuts, paris paris movie release date, kajal agarwal fires on CBFC, censor board, censored cuts, tamannah, telugu, kannada, Tamil Nadu, kollywood, movies, entertainment

The CBFC found many objectionable scenes in Kajal Agarwal's new movie 'Paris Paris', its opinion in the film and had ordered 25 cuts for a U/A certificate.

‘ఫారిస్ పారిస్’ కత్తెరింపులపై కాజల్ కస్సుబుస్సు..

Posted: 08/21/2019 08:42 PM IST
Kajal agarwal displeasure against kollywood censor board over paris paris cuts

బాలీవుడ్ లో తిరుగులేని విజయాన్ని అందుకోవడంతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్న చిత్రం ‘క్వీన్’. హిందీలో కంగనా రనౌత్ చేసిన ఈ సినిమా అక్కడ భారీ విజయాన్ని అందుకోవడంతోపాటు అమె కెరియర్లో ఇది చెప్పుకోదగిన సినిమాగా నిలిచింది. అలాంటి ఈ సినిమాను దక్షిణాది భాషల్లో రీమేక్ చేస్తున్నారు. తమిళ రీమేక్ లో కాజల్ నటించింది. అయితే ఈ సినిమాలో అసభ్యకరమైన సన్నివేశాలు .. సంభాషణలు ఉండటంతో, సెన్సార్ బోర్డువారు నిరభ్యంతరంగా వాటిని కత్తిరించేశారట.

ఈ విషయం పట్ల నిర్మాతలు అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ, మరోసారి పరిశీలించాలని హడావిడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాజల్ స్పందిస్తూ .. "ఈ సినిమాను నేను ఎంతో కష్టపడి చేశాను. ఒరిజినల్లో వున్న సన్నివేశాలనే తీయడం జరిగింది. అయినా ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను కత్తిరించడం నన్ను చాలా అసంతృప్తికి గురిచేసింది. ఇలా జరగకుండా వుంటే బాగుండేది" అంటూ అసహనాన్ని వ్యక్తం చేసింది. అయితే తెలుగు, కన్నడ బాషల్లో నటి తమన్నా నటించిగా, ఆయా చిత్రాలు ఎలాంటి కత్తెరింపులు లేకుండానే యూఏ సర్టిఫికెట్ ను అందుకోవడం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : paris paris  kajal agarwal  censor board  censored cuts  tamannah  telugu  kannada  kollywood  

Other Articles

Today on Telugu Wishesh