Allu Arjun - Trivikram film launched అల్లు అర్జున్-త్రివిక్రమ్ ల కాంబినేషన్లో మరో మూవీ..!

Allu arjun and trivikram srinivas aa19 puja ceremony held

Allu Arjun, Trivikram Srinivas, Pooja Hegde, allu arjun 19 movie, allu arjun trivikram movie, aa 19 movie, sushanth, navadeep, senior actress Tabu, tollywood, movies, entertainment

Allu Arjun’s upcoming film with Trivikram Srinivas, tentatively called #AA19, was launched today with the pooja ceremony, Pooja Hegde stars as the female lead.

అల్లు అర్జున్-త్రివిక్రమ్ ల కాంబినేషన్లో మరో మూవీ.. ఇంకా..!

Posted: 04/13/2019 04:35 PM IST
Allu arjun and trivikram srinivas aa19 puja ceremony held

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొత్త సినిమాకి కొబ్బరి కాయ కొట్టేశారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ శ్రీనివాస్‌, బన్నీ కాంబో మూవీ లాంచ్ కార్యక్రమం శనివారం నాడు హైదరాబాద్‌లో వైభవంగా సాగింది. ఈ కార్యక్రమంలో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్, అల్లు అరవింద్, నిర్మాత రాధాక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు. తొలి షాట్‌కి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క్లాప్ కొట్టగా అల్లు అరవింద్ కెమెరాఆన్ చేశారు.

హారికా హాసిని క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో బన్నీకి జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ సినిమా ఈ రోజునే పూజా కార్యక్రమాలు జరుపుకుంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, 'టబు' ఒక కీలకమైన పాత్రలో కనిపించనుంది. ఇక ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రల కోసం ఇద్దరు యంగ్ హీరోలను తీసుకున్నట్టుగా సమాచారం. ఆ ఇద్దరిలో ఒకరు నాగార్జున మేనల్లుడు సుశాంత్

కాగా మరొకరు నవదీప్. హీరోగా ఎన్ని ప్రయత్నాలు చేసినా సుశాంత్ కి హిట్ పడలేదు. ఇక నవదీప్ కి కెరియర్ ఆరంభంలో ఒకటి రెండు సక్సెస్ లు వచ్చినా, ఆ తరువాత ఆయనకి అవకాశాలే లేకుండాపోయాయి. అలాంటి ఈ హీరోలిద్దరకీ ఈ సినిమాలో అవకాశం రావడం విశేషం. అమాయక చక్రవర్తి పాత్రలో సుశాంత్ కనిపించనున్నాడట. ఇక నవదీప్ పాత్ర ఎలా ఉంటుందనేది తెలియాల్సి వుంది. ఇక మిగతా పాత్రల్లో రాజేంద్రప్రసాద్ .. సునీల్ .. రావు రమేశ్ కనిపించనున్నారట. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh