Chaitu Denies Rumour again pair with Rakul | రకుల్ తో మళ్లీ సినిమానా?.. నమ్మకండి : చైతూ

Naga chaitanya condemns rumours

Naga Chaitanya, Rakul Preet Singh, Director Sowjanya, Chay-Rakul, Naga Chaitanya Next Projects

Naga Chaitanya Condemns Rumour on his next project with Krishna Vamsi Assistant Sowjanya's Direction. Rakul Preet Singh in lead role. But, Chaitu Condemns it in Twitter.

పుకార్లు నమ్మొద్దంటున్న నాగ చైతన్య

Posted: 02/22/2018 06:57 PM IST
Naga chaitanya condemns rumours

గతేడాది ఒకే చిత్రంతో హిట్ కొట్టిన నాగచైతన్య మరో ప్రాజెక్టుకు ఓకే చెప్పాడనే వార్త టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. రకుల్ హీరోయిన్ గా కృష్ణవంశీ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన సౌజన్య ఈ సినిమా ద్వారా దర్శకురాలిగా పరిచయం కానుందనే వార్త వినిపించింది. ప్రస్తుతం చైతూ చేస్తోన్న సినిమాలు పూర్తికాగానే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనున్నట్టు చెప్పుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో చైతూ తన ట్విట్టర్ లో స్పందించాడు. ఇందులో ఎంతమాత్రం నిజం లేదని చెప్పాడు. ప్రస్తుతం తాను 'సవ్యసాచి'తో పాటు మారుతి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నానని అన్నాడు. ఈ రెండు సినిమాలు ఆసక్తికరమైన కంటెంట్ తో మలచబడుతున్నాయని చెప్పాడు. తదుపరి ప్రాజెక్టు ఏమిటనే విషయాన్ని తాను త్వరలోనే ప్రకటిస్తాననీ .. అప్పటివరకూ ఎలాంటి ప్రచారాలు నమ్మొద్దని స్పష్టం చేశాడు.

దాంతో రకుల్ మళ్లీ చైతూ జోడీ కట్టనుందనే ప్రచారానికి తెరపడినట్టైంది. బాలీవుడ్ లో అయ్యారీ ఫలితంతో ఢీలా పడ్డ రకుల్ మళ్లీ సౌత్ లో బిజీ అయిపోవాలనే ఫ్లాన్ లో ఉంది. కోలీవుడ్ లో తాజాగా శివకార్తీకేయన్ చిత్రాన్ని ఓకే చేసిన రకుల్.. నాని సినిమాకు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles