దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు సినిమాలను కాపీ చేయడం తప్ప మరేమీ తెలియదని సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ వ్యాఖ్యానించాడు. ఈ మేరకు తన సోషల్ మీడియాలో ఈ ఉదయం వరుస పోస్టులు చేశాడు. "త్రివిక్రమ్ అనే దర్శకుడు కాపీ చెయ్యకుండా రాసిన, తీసిన సినిమా ఒక్కటి కూడా లేదు. కొన్ని సీన్ లో, సీక్వెన్సులో, ఏకంగా కథనో... ఇలా ఎదో ఒకటి కాపీ చేస్తూనే ఉంటాడు. లేదా ఒక డైలాగ్ ఎదో ఆసక్తికరంగా ఉంటే, దాని చుట్టూ కొన్ని సీన్లు అల్లే ప్రయత్నం చేస్తుంటాడు" అని ఆరోపించాడు.
మరో ట్వీట్ లో "ముఖ్యంగా యండమూరి వీరేంద్రనాథ్ రచనలలో నుంచీ కొన్ని వాక్యాల్ని, ఆలోచనల్ని అరువు తెచ్చుకుని తనదైన కొన్ని పదాలను అక్కడక్కడా కూర్చి, మాయ చేసి మెప్పిస్తుంటాడు. మన ఖర్మకొద్ది ఆ మాత్రం రాసే రచయితలు ఎవరులేక అగ్రదర్శకుడిగా చలామణి అయిపోతున్నాడు" అని విమర్శలు గుప్పించాడు.
ఇంతకాలం పవన్ ను మాత్రమే అది కూడా రాజకీయాలపరంగా కామెంట్లు చేస్తూ వస్తున్న మహేష్ కత్తి ఈ మధ్య సినిమాలపరంగా కూడా ట్వీట్లు చేస్తుండటం మొదలుపెట్టాడు. ఇది చాలదన్నట్లు ఇప్పుడు ఏకంగా త్రివిక్రమ్ పైనే అక్షరాల తుటాలు గురిపెట్టడం విశేషం.
త్రివిక్రమ్ అనే దర్శకుడు కాపీ చెయ్యకుండా రాసిన, తీసిన సినిమా ఒక్కటి కూడా లేదు. కొన్ని సీన్లో, సీక్వెన్సులో, ఏకంగా కథ ఇలా ఎదో ఒకటి కాపీ చేస్తూనే ఉంటాడు. లేదా ఒక డైలాగ్ ఎదో ఆసక్తికరంగా ఉంటే, దాని చుట్టూ కొన్ని సీన్లు అల్లే ప్రయత్నం చేస్తుంటాడు.
— Mahesh Kathi (@MaheshhKathi) January 3, 2018
ముఖ్యంగా యండమూరి వీరేంద్రనాథ్ రచనలలో నుంచీ కొన్ని వాక్యాల్ని, ఆలోచనల్ని అరువు తెచ్చుకుని తనదైన కొన్ని పదాల్లో అక్కడక్కడా కూర్చి మాయ చేసి మెప్పిస్తుంటాడు. మన ఖర్మకొద్ది ఆ మాత్రం రాసే రచయితలు ఎవరులేక అగ్రదర్శకుడిగా చలామణి అయిపోతున్నాడు.
— Mahesh Kathi (@MaheshhKathi) January 3, 2018
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more