Super Star 25th Movie Heroine Confirmed | సూపర్ స్టార్ పక్కన స్లిమ్ బ్యూటీ కన్ఫర్మ్

Mahesh babu 25th movie heroine confirm

Mahesh Babu, 25th Movie, Pooja Hegde, Vamsi Paidipally, MB 25th Movie, Pooja Hegde Mahesh Babu, Mahesh Babu 25th Movie, Vamsi Paidipally Mahesh Babu

Mahesh Babu 25th Movie Under Vamsi Paidipally direction heroine confirmed. Pooja Hegde almost confirmed for Mahesh.. Official announcement to be await.

మహేష్ బాబు 25లో పూజా హెగ్డే హీరోయిన్

Posted: 01/03/2018 10:39 AM IST
Mahesh babu 25th movie heroine confirm

టాలీవుడ్ టూ బాలీవుడ్ కు ఎగిరిపోయిన పూజా హెగ్డేకు అక్కడ చేసిన ఒకే సినిమ ఫలితం పెద్ద షాక్ ఇచ్చింది. దీంతో తిరిగి తెలుగులోనే నటించేందుకు సుముఖత వ్యక్తం చేసి బన్నీతో డీజేలో నటించింది. సినిమా యావరేజ్ గా నిలిచిన బన్నీ క్రేజ్ తోపాటు ఒక రకంగా పూజా గ్లామర్ కూడా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించిందంటే అతిశయోక్తి కాదు.

ప్రస్తుతం ఈ స్లిమ్ బ్యూటీ చేతిలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా చేస్తున్న 'సాక్ష్యం' ఉండగా, నితిన్ శ్రీనివాస కళ్యాణం ఓకే చేసేసింది. ఈ రెండింటిలోనూ అమ్మడిది గ్లామర్ రోల్ అని తెలుస్తోంది. ఇది కాకుండా చెర్రీ రంగం స్థలంలో ఐటెం సాంగ్ కు అల్రెడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. దీంతోపాటు మరో స్టార్ హీరోతో కూడా ఆమె జత కట్టడం దాదాపు కన్ఫర్మ్ అయినట్లే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్ 25వ చిత్రం రూపుదిద్దుకోబోతున్న విషయం తెలిసిందే.

ఆ సినిమా కోసం ఆ మధ్య పూజాను సంప్రదిస్తున్నట్లు.. అయితే రెమ్యునరేషన్ విషయంలోనే సమస్య తలెత్తినట్లు చెప్పుకన్నట్లు వార్తలు వినిపించాయి. అయితే ఎట్టకేలకు ఆమె ఆ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. దీంతోపాటు ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా కోసం కూడా పూజా పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఒకేసారి ఇద్దరితోనా?రంగస్థలంలో పూజా ఐటెం సాంగ్క్రేజీ హీరోయిన్ చుక్కలు చూపిస్తోందిగా

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles