Rajamouli Voice Over to Father's Srivalli Movie | తండ్రికి 5 నిమిషాలు మాత్రమే కేటాయించాడా?

Rajamouli helps to father new movie

Srivalli Movie, SS Rajamouli, K V Vijayendra Prasad, Rajamouli New Movie

Ace Director SS Rajamouli helps to Father K V Vijayendra Prasad's Srivalli Movie. Rajamouli given 5 Minutes Voice Over to Srivalli.

శ్రీవల్లిలో రాజమౌళి.. జస్ట్ వాయిస్ ఓవర్ మాత్రమే!

Posted: 09/14/2017 03:54 PM IST
Rajamouli helps to father new movie

ఒకప్పుడు బయటి బ్యానర్ లో చిత్రాలు రాసిన రైటర్ విజయేంద్ర ప్రసాద్ తర్వాత కొన్నాళ్లపాటు తనయుడు రాజమౌళి చిత్రాలకే అంకితమైపోయాడు. అయితే బాహుబలి సమయంలో భజిరంగీ భాయ్ జాన్ చిత్రం ద్వారా బాలీవుడ్ లోనూ హాట్ టాపిక్ గా మారిన ఈ సీనియర్ రచయిత ఇప్పుడు దాదాపు అన్ని భాషల్లో కథలను అందించేందుకు రెడీ అయిపోతున్నాడు. బాలీవుడ్ లో రౌడీ రాథోడ్ 2, నాయక్ 2 చిత్రాలకు కథలను అందించే పనిలో బిజీగా ఉన్న ఆయన.. కోలీవుడ్, కన్నడలో ఇప్పటికే కొన్ని సినిమాలకు కథలను అందించేశారు.

తన కథలలో ఎగ్జయిటింగ్ వాటిని ఎంచుకుని తానే స్వయంగా దర్శకత్వం వహించటం ఆయన స్పెషాలిటీ. అలా శ్రీవల్లి చిత్రాన్ని రేపు ప్రేక్షకుల ముందుకు తేబోతున్నాడు. రజత్ .. నేహా హింగే జంటగా సునీత నిర్మించిన ఈ సినిమా టీజర్; ట్రైలర్ లతో కాస్త మంచి అంచనాలనే పెంచింది. అయితే ఈ సినిమాకు జక్కన్న చేసిన సాయం గురించి ఇఫ్పుడు నిర్మాత రివీల్ చేస్తున్నారు. సైంటిఫిక్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా మొదటి 5 నిమిషాలు ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకూడదని చెబుతున్నారు.

సినిమా ప్రారంభంలోనే రాజమౌళి వాయిస్ ఓవర్ తో కథ ప్రారంభం అవుతుందంట. అసలు కథ ఎలా పుట్టింది? ఎలా ఉండబోతుంది? అన్న విషయాలను ఈ స్టార్ దర్శకుడు చెప్పటంతోనే మొదలవుతుందని నిర్మాత వివరించారు. అయితే గతంలో విజయేంద్ర ప్రసాద్ తీసిన చంద్రహాస్ డిజాస్టర్ కాగా, నాగార్జున హీరోగా నటించిన రాజన్న కూడా అంతంత మాత్రంగానే ఆడింది. ఈ నేపథ్యంలో తండ్రితో ఎలాగైనా హిట్ కొట్టించాలన్న ప్రయత్నం ఏ మేర సక్సెస్ అవుతుందో చూడాలి. అన్నట్లు రాజన్న చిత్రంలో యాక్షన్ ఎపిసోడ్స్ తెరకెక్కించింది రాజమౌళినే కావటం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles