Kannada Hero Yash Confirm for Arjun Reddy Remake | బోల్డ్ రీమేక్ కోసం ఆ హీరో రెడీ!

Arjun reddy remake hero confirm

Arjun Reddy, Kannada Remake, Rocking Star Yash, Rockline Venkatesh

Rocking Star Yash almost Confirm for Arjun Reddy Remake. Official Announcement released soon.

అర్జున్ రెడ్డి కన్నడ రీమేక్ హీరో కన్ఫర్మ్

Posted: 09/14/2017 04:30 PM IST
Arjun reddy remake hero confirm

సినిమా క్యారెక్టర్ లకు సూటయ్యే హీరో దొరికితే చాలూ నటన ద్వారా సినిమా బ్లాక్ బస్టర్ అవ్వటం ఖాయం. రీసెంట్ గా వచ్చిన అర్జున్ రెడ్డి మూవీ అందుకు నిదర్శనం అనే చెప్పొచ్చు. యాంగ్రీ లవర్ గా విజయ్ దేవరకొండ చేసిన ఫెర్ ఫార్మెన్స్ కు నూటికి నూరు మార్కులు వేయటమే కాదు.. కలెక్షన్ల పరంగా కూడా బ్రహ్మరథం పట్టారు తెలుగు ప్రేక్షకులు.

ఇక పెట్టుబడికి 7 రెట్లు వసూళ్లు రాబట్టిన అర్జున్ రెడ్డిపై ఆటోమేటిక్ గానే మిగతా భాషల కళ్లు పడటం ఖాయం కదా. కోలీవుడ్ లో తమిళంలో రీమేక్ చేయడానికి ధనుష్ రైట్స్ తీసుకున్నాడు. హీరోగా ఇంకా ఎవరినీ కన్ఫర్మ్ చేయలేదు. అయితే కజిన్ సెల్వ రాఘవన్ దర్శకత్వంలోనే చేసే ఛాన్సు ఉందని చెబుతున్నారు. మరోవైపు బాలీవుడ్ లోనూ అర్జున్ రెడ్డి ఎఫెక్ట్ బాగానే ఉంది. బోల్డ్ పాత్రలకు పెట్టింది పేరైన రణ్ వీర్ సింగ్ ఉత్సాహాన్ని చూపుతున్నాడు.

ఇక నటుడు, నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ కన్నడలో రీమేక్ చేయడానికి ఫ్లాన్ గీసుకున్నాడు. అయితే హీరోగా మాత్రం రాకింగ్ స్టార్ యష్ ను తీసుకున్నట్లు సమాచారం. యష్ కి మాస్, యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. పైగా కేఎఫ్ జీ అనే చిత్రంలో కాస్త అటువంటి ఛాయలే ఉన్న పాత్ర పోషించటంతో ఆయననే ఫైనల్ చేశారనేది తాజా సమాచారం. ఇక కథానాయికగా సుదీప్ చిత్రం రణ్ణా(తెలుగులో అత్తారింటికి దారేది) ఫేమ్ రచితా రామ్ పేరు పరిశీలనలో ఉంది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles