హాలీవుడ్ దిగ్గజ దర్శకులు ఒకటైతే... | Spielberg trained with Cameron for Ready Player 1

Legendary directors worked for one movie

Steven Spielberg, James Cameron, Spielberg Cameron Movie, Cameron Help Spielberg, Spielberg Ready Player One, Ready Player One Movie, Ready Player One Highlights, Ready Player One James Cameron, Avatar Director Helps Spielberg, Both Hollywood Directors for One Movie, Two Legendary Directors

Steven Spielberg took help from James Cameron for his Ready Player One film. The two visionary filmmakers are both known for using computer technology in their filmmaking in inventive ways. But while Steven Spielberg has moved on to more practical effects, James Cameron's movies are still extremely driven by computer generated effects and imagery. Spielberg's Ready Player One is slated to be released on March 30, 2018.

హాలీవుడ్ దిగ్గజ దర్శకులు ఒకరికొకరు సాయం

Posted: 07/24/2017 01:08 PM IST
Legendary directors worked for one movie

భారీ ప్రాజెక్టుల నిర్మాణాల పేర్లు చెబితే గుర్తొచ్చేది ఆ ఇద్దరే. అద్భుతమైన కళాఖండాలను అందించారు. టెక్నాలజీని వాడుకోవటంలో వాళ్లను మించిన వాళ్లు లేరనే చెప్పాలి. వాళ్లే స్టీవెన్ స్పీల్‌బ‌ర్గ్‌, జేమ్స్ కామెరూన్ లు. `జురాసిక్ పార్క్‌` `అవ‌తార్‌` లాంటి ప్ర‌తిష్టాత్మ‌క చిత్రాలు తీసిన వీళ్లకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అదే ఈ ఇద్దరూ ఒకే సినిమాకు పని చేస్తే ఎలా ఉంటుంది?

అవును... స్పీల్‌బ‌ర్గ్ నూత‌న చిత్రం `రెడీ ప్లేయ‌ర్ వ‌న్‌` సినిమాలో కామెరూన్ హ్యాండ్ కూడా ఉందంట. ఈ విషయాన్ని సినిమా స్క్రీన్ రైటర్ జాక్ పెన్ తెలిపాడు. మోష‌న్ క్యాప్చ‌ర్ టెక్నాల‌జీ ఎలా ఉప‌యోగించాల‌న్నది కామెరూన్ కు తెలిసినంతగా ఎవరికీ తెలీదు. ఆ విష‌యంలో ఆయన స‌హాయం తీసుకునే స్పీల్ బర్గ్ తెరకెక్కించాడని తెలిపాడు. శాండియాగో కామిక్ కాన్ ప్యానెల్ ఇంట‌ర్వ్యూలో చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల త‌ర్వాత ఆయ‌న ఈ విష‌యం చెప్పారు.

పూర్తిగా వీడియోగేమ్ నేప‌థ్యంలో సాగే `రెడీ ప్లేయ‌ర్ వ‌న్` సినిమాలో దాదాపు 80 శాతం చిత్రాన్ని మోష‌న్ క్యాప్చ‌ర్ ద్వారానే చిత్రీకరించటం విశేషం. అంటే సినిమా పేరుకు స్పీల్ బర్గ్ దర్శకుడే అయినప్పటికీ మేజర్ పార్ట్ మొత్తం మాత్రం కామెరూన్ నేతృత్వంలోనే తెరకెక్కిందన్న మాట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hollywood  Steven Spielberg  James Cameron  Ready Player One  

Other Articles