కమల్ రూట్ లో రజనీ.. కానీ డెసిషన్ వేరేలా | Kamal interacts with fans hints at joining politics

Kamal to hold meeting with fans

Rajinikanth Kamal Haasan, Rajinikanth Kamal, Kamal Fans Meet, After Rajini Kamal Fans Meet, Kamal New Party, Kamal Tamil Nadu CM Posters, Kamal New Party, DMK Kamal Alliance

After Rajinikanth Kamal Haasan also to hold meeting with fans. Recently he tweets against AIADMK Government hits that.

కమల్ కూడా ఫ్యాన్స్ తో మీట్.. పొలిటికల్ ఎంట్రీపై టెన్షన్

Posted: 07/24/2017 02:51 PM IST
Kamal to hold meeting with fans

ఓవైపు సీరియస్ గా తన రాజకీయ ఆరంగ్రేటం పై యూనివర్సల్ హీరో కమల్ హాసన్ వడివడిగా అడుగులేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఘాటు ట్వీట్లు, సందేశాలతో తమిళ న్యూస్ ఛానెళ్లలో నానుతూ వస్తున్నాడు. ఇంతలోనే ‘తమిళనాడుకు కాబోయే సీఎం కమలహాసన్’ అంటూ మధురైలో పోస్టర్లు వెలిశాయి. అవినీతి మంత్రులు, అధికారులను ఇంటికి పంపే సత్తా, కమలహాసన్ కే ఉందంటూ ఆ పోస్టర్లలో ఆయన అభిమానులు పేర్కొన్నారు.

కాగా, దమ్ముంటే రాజకీయాల్లోకి రావాలంటూ కమల్ ను ఉద్దేశించి తమిళనాడు ఆర్థిక మంత్రి డి.జయకుమార్ ఇటీవల వ్యాఖ్యానించడం, కమల్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఇటీవల ఓ కవితను పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. ‘ప్రస్తుతం ఎవరూ రాజు కాదు... నాతో పాటు రండి కామ్రేడ్.. అసంబద్ధతను బద్దలు కొట్టే నాయకుడిగా తయారవుతారు’ అని తన కవితలో ఆయన పేర్కొన్నాడు.

మరో పక్క మొన్న రజనీ ఎలాగైతే ఫ్యాన్స్ తో ఫేస్ టూ ఫేస్ నిర్వహించాడో అలాగే కమల్ కూడా ఓ సమావేవాన్ని నిర్వహించాలని ఫ్లాన్ చేస్తున్నాడు. అయితే తలైవాలా తికమక ప్రకటనలు కాకుందడా, తాను డైరక్ట్ గా రాజకీయాల్లోకి వచ్చే అంశాన్నే నేరుగా ప్రస్తావించబోతున్నాడంట. త్వరలోనే సొంత పార్టీ ప్రకటన చేసి అన్నాడీఎంకే కు ఎదురెళ్లే ఆలోచనలో ఉన్నాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే బిగ్ బాస్ తోపాటు నత్త నడక ‘శభాష్ నాయుడు’ షూటింగ్ ను చేస్తున్నాడనే టాక్ వినిపిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kamal Haasan  AIADMK  New Political Party  

Other Articles