Chinna Kushboo Confirmed for Sangamithra

Hansika replaces shruti haasan for sangamithra

Sunder C, Director Sunder C, Sunder C Hansika, Hansika, Hansika Sangamithra, Sangamithra Hansika, Sangamithra Shruthi Haasan Hansika, Tendral Movies Hansika, Hansika Motwani India Biggest Movie

Sunder C selected Hansika as New Sangamithra. Initially she in actress race later replaces with Hansika Only.

సంఘమిత్ర అసలు హన్సికేనా?

Posted: 06/29/2017 02:13 PM IST
Hansika replaces shruti haasan for sangamithra

సౌత్ లోనే కాదు. టోటల్ ఇండియాలోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కించబోయే బిగ్గెస్ట్ మోషన్ పిక్చర్స్ మాదే అంటూ సంఘమిత్రతో కలరింగ్ ఇచ్చాడు కోలీవుడ్ నటుడు కమ్ దర్శకుడు సుందర్ సి. 500 కోట్ల పెట్టుబడి అని చెప్పినప్పటికీ తీరా చూస్తే టాప్ హీరోలంతా వెనక్కి తగ్గటంతో ఆర్య, జయం రవి లాంటి సెకండ్ స్థాయి హీరోలను ఎంపిక చేశాడు. పైగా హీరోయిన్ ఓరియంటల్ అంటూ హైప్ పెంచి శృతీహాసన్ ను సెలక్ట్ చేసి, ఓ పోస్టర్ కూడా వదిలి తర్వాత  ఆమెను తీసి పడేశాడు.

శృతీ ఎగ్జిట్ కారణాలేవైనా ఆ ప్లేస్ లో ఇప్పుడు హన్సిక వచ్చి చేరటంతో కొన్ని అనుమానాలకు క్లారిటీ లభిస్తోంది. దర్శకుడు సుందర్, హన్సిక గతంలో రెండు చిత్రాలకు పని చేశారు. అందులో చంద్రకళ, కళావతి సినిమాలు తీశారు. అందులో మొదటిది హిట్ కాగా, రెండోది ఫట్టుమంది. అయినప్పటికీ తన భారీ బడ్జెట్ చిత్రం కోసం కూడా తొలుత హన్సికనే తీసుకోవాలన్న ఫ్లాన్ చేశాడని తెలుస్తోంది. అయితే నిర్మాతల ఒత్తిడి, పైగా అడ్వేంచర్ మూవీ కావటంతో కాస్త డేరింగ్ ఉన్న హీరోయిన్ ను ఎంచుకోవాల్సి వచ్చిందంట. 

చివరకు శృతీని డేట్లు అడ్జస్ట్ మెంట్ , రెమ్యునరేషన్ అనే వంకలతో సైడ్ చేసేసి, ఆ స్థానంలో జూనియర్ కుష్బూ అదేనండీ హన్సికను తీసుకోచ్చేయటంతో సుందర్ కంఫర్ట్ గా ఫీలవుతున్నాడంట. ఇప్పటికే షూటింగ్ ప్రారంభించేసుకున్న సంఘమిత్ర ఆర్య, జయం రవిలపై యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరిస్తుండగా, త్వరలోనే హన్సిక సెట్స్ లో జాయిన్ కాబోతుందని టాక్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sangamithra  Hansika  Shruthi Haasan  

Other Articles