తీవ్ర ఒత్తిడిలో చిరు-బాలయ్య... దేినికో? | chiru balayya eye on firstday collections.

Chiru khaidi no 150 comes early

chiru comes early, chiru 150 versus balayya 100, khaidi early than satakarni, pressure on khaidi for firstday, chiru balayya, chiru balayya fears for sarwananad

Chiru and Balayya fight for firstday collections. chiru may comes early.

బాలయ్య-చిరు అందుకోసం కూడా కొట్టుకుంటారా?

Posted: 11/02/2016 09:29 AM IST
Chiru khaidi no 150 comes early

రెండు రోజులు, ఇద్దరు సీనియర్ హీరోలు.. భారీ బడ్జెట్ సినిమాలు... పైగా పెద్ద పండగ సీజన్. ఇది 2017 జనవరి 11-14 తేదీల మధ్య సంక్రాంతి సీజన్ కి టాలీవుడ్ చేయబోతున్న సందడి. మెగాస్టార్, నటసింహ తమ స్పెషల్ చిత్రాలను ఇప్పటికే చిత్రాలను సంక్రాంతికే తెస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.

వీరిలో తొమ్మిదేళ్ల తర్వాత మేకప్ వేసుకోబోతున్న చిరు 150వ చిత్రం ఖైదీ నంబర్ 150పై భారీ అంచనాలే ఉన్నాయి. కారణం ఆ రేంజ్ లో జరిగిన బిజినెస్ అందుకు కారణం. బడ్జెట్ పెట్టడమే కాదు.. అందుకు తగ్గట్లు ప్రీ బిజినెస్ కూడా చేసి చిత్రంపై అంచనాలు మెగా స్టాయికి ఏ మాత్రం తగ్గకుండా పెంచేశాడు చెర్రీ. మరోవైపు శాతకర్ణి కూడా తన స్థాయికి మించే బిజినెస్ చేసేసింది. ఈ రెండు చిత్రాల షూటింగ్ దాదాపు ముగియటంతో వాటికొ కొత్త సమస్య వచ్చి పడింది.

అందుకు కారణం తొలి రోజు వసూళ్లపై కన్నేయటమే. సాధారణంగా ఇలాంటి సమయంలో ఏ చిత్రంకైనా ఫస్ట్ డే కలెక్షన్లు చాలా ముఖ్యం. సంక్రాంతి రేసులో ఖైదీ, శాతకర్ణియే కాక, శర్వానంద్ శతమానంభవతి కూడా ఉంది. అంటే మూడు రోజులు, మూడు చిత్రాలన్న మాట. సంక్రాంతికి వచ్చే మాస్ ఇమేజ్ చిత్రాల కంటే ఫ్యామిలీ చిత్రాలకే ఆదరణ ఎక్కువ ఉంటుంది. ఈ నేపథ్యంలో చిరు చిత్రమే ముందు రిలీజ్ చేయాలంటూ డిస్ట్రిబ్యూటర్లు ఇప్పుడు నిర్మాతలపై ఒత్తిడి తెస్తున్నారంట. ఈ విషయంలో మరో నిర్మాణ భాగస్వామి లైకా కూడా ఆ ఆలోచనే చేస్తుందట. మరి బాలయ్య అండ్ క్రిష్ వారి డెసిషన్ కూడా మార్చుకుంటారా? చూద్దాం... తొలి రోజు వచ్చి కలెక్షన్లు కుమ్ముకునేది ఎవరో...?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles