బుర్రిపాలెం బుల్లోడి సేవా కృషి చూస్కోండి | Mahesh Babu posted Burripalem development photos in his FB

Mahesh babu posted burripalem development photos in his fb

Mahesh special thanks to Galla jayadev, mahesh Burripalem Pics, Mahesh Facebook Burripalem development, Mahesh Babu Burripalem Photos, Burripalem development, Mahesh post new burripalem photos, MP jaya Dev Burripalem

Mahesh Babu posted Burripalem development photos in his FB special thanks to in law Galla Jayadev.

మహేష్ ఫేస్ బుక్ లో ఆ ఫోటోలు

Posted: 10/27/2016 12:29 PM IST
Mahesh babu posted burripalem development photos in his fb

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫేస్ బుక్ అకౌంట్ లో ఈరోజు ఉదయం కొన్ని ఆశ్చర్యకరమైన ఫోటోలు దర్శనమిచ్చాయి. అవి చూస్తే ఊళ్లను దత్తత తీసుకోవటం అంటే జేబులో డబ్బులు తీసి రోడ్లు, రంగులు వేయటం అనే డైలాగ్ ను ఫాలో అయిపోతున్నాడేమో అనిపిస్తుంది. శ్రీ‌మంతుడు సినిమాలోలాగా మహేష్ గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే.

బావ, టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ప్రోత్సాహంతో ఆ ప్రాంతంలో అభివృద్ధి ప‌నులు చేస్తున్నాడు. అయితే కేవ‌లం ద‌త్తత తీసుకొని పై పై ప‌నులు చేసి వ‌దిలేయ‌కుండా మ‌హేశ్ ఆ గ్రామాభివృద్ధిపై ఎంతో శ్రద్ధపెడుతున్నట్లు అర్థమౌతోంది.

ఇందుకు సంబంధించిన ఫోటోలను స్వయంగా మహేషే త‌న‌ ఫేస్‌బుక్ ఖాతా ద్వారా స్పందించారు. అక్క‌డ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయ‌ని చెబుతూ... గ్రామంలోని స‌ద‌రు ప‌నుల‌ ఫొటోలను ఆయ‌న‌ పోస్ట్‌ చేశారు. గల్లా జయదేవ్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్న‌ట్లు పేర్కొన్నారు. మరోపక్క గ్రామజ్యోతి పథకంలో భాగంగా మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు మహబూబ్ నగర్ జిల్లాలోని గట్టు మండలంలోని చింతలకుంట గ్రామాన్ని కూడా మహేష్ దత్తత తీసుకుని, ఆపనులను భార్య నమ్రతా శిరోద్కర్ కి అప్పజెప్పటం, ఆ మధ్య ఆమె మంత్రలను కలవటం, ఆ గ్రామ రూపురేఖలు మారిపోయే విధంగా పనులు చకచకా జరిగిపోతున్నాయి కూడా.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh Babu Facebook  Burripalem Development  MP Jayadev  special thanks  

Other Articles